ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్, గుజరాత్ లలో పెరిగిన కోవిడ్ కేసులు, రోజువారి కొత్త కోవిడ్ కేసులలో 81 శాతం ఈ రాష్ట్రాలకు చెందినవే. దేశ వ్యాప్తంగా 5.31 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేయడం జరిగింది.
23 లక్షల డోస్‌లకు పైగా వాక్సిన్ గత 24 గంటలలో వేశారు.
Posted On:
25 MAR 2021 11:32AM by PIB Hyderabad
మహారాష్ట్ర , పంజాబ్, కేరళ, కర్ణాటక, చత్తీస్‌ఘడ్, గుజరాత్ ఈ ఆరు రాష్ట్రాలలో రోజు వారి కొత్త కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటలలో నమోదైన కొత్త కేసులలో మొత్తం 80.63 శాతం కేసులు ఈ రాష్ట్రాలనుంచి ఉన్నాయి.
53,476 కొత్త కేసులు గత 24 గంటలలో నమోదయ్యాయి.
మహారాష్ట్రలో రోజువారి కొత్త కేసులు గరిష్టంగా నమోదౌతున్నాయి. ఇవి 31,855 (59.57 శాతం) గా ఉన్నాయి. దీని తర్వాత పంజాబ్ 2,613, కేరళ 2,456 కేసులలో తరువాతి స్థానాలలో ఉన్నాయి.
పదిరాష్ట్రాలు కొత్త కేసులలో పెరుగుదలను సూచిస్తున్నాయి.
ఇండియా మొత్తం కోవిడ్ కేస్‌ల లోడ్ ఈ రోజు 3.95 లక్షలు (3,95,192) గా ఉంది. మొత్తం పాజిటివ్ కేసులలో ఇది 3.35 శాతం.
మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, ఈ మూడు రాష్ట్రాలు దేశంలోని మొత్తం యాక్టివ్ కేసులలో 74.32 శాతంగా ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి దేశంలోని మొత్తం యాక్టివ్ కేసులలో 62.91 శాతం కేసులు ఉన్నాయి.
ఈరోజు ఉదయం 7 గంటల వరకు 5.31 కోట్లు ( 5,31,45,709) వాక్సిన్ డోస్‌లను 8,61,292 సెషన్‌లలో వేసినట్టు ప్రాథమిక నివేదికల ప్రకారం తెలుస్తోంది.
ఇందులో 79,80,849 హెచ్.సి.డబ్ల్యు ( తొలి డోస్), 50,61,790 హెచ్‌సిడబ్ల్యులు (రెండో డోస్), 84,78,378 ఎఫ్.ఎల్.డబ్ల్యులు 32,37,381 ఎఫ్.ఎల్.డబ్ల్యు ( రెండో డోస్), 51,31,949 లబ్దిదారులు 45 సంవత్సరాలకు పైబడిన వారు ప్రత్యేకించి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారు (1వ డోస్), 2,32,55,262 లబ్ధిదారులుల 60 సంవత్సరాలకు పైబడిన వారు ఉ న్నారు.
HCWs
|
FLWs
|
45 to <60 years with Co-morbidities
|
Over 60 years
|
Total
|
1st Dose
|
2nd Dose
|
1st Dose
|
2nd Dose
|
1st Dose
|
1st Dose
|
79,80,849
|
50,61,790
|
84,78,478
|
32,37,381
|
51,31,949
|
2,32,55,262
|
5,31,45,709
|
వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించిన 68 వ రోజు నాటికి (24 మార్చి 2021), 23 లక్షల మందికి పైగా అంటే 23,03,305 మందికి వాక్సిన్ వేయడం జరిగింది. ఇందులో 21,13,323 మంది లబ్ధిదారులకు 38,243 సెషన్‌లలో మొదటి డోస్, 1,89,982 హెచ్‌సిడబ్ల్యులు, ఎఫ్.ఎల్‌డబ్ల్యులు రెండో వాక్సిన్ ను వేయించుకున్నారు.
Date: 24th March, 2021
|
HCWs
|
FLWs
|
45to<60 years with Co-morbidities
|
Over 60years
|
Total Achievement
|
1stDose
|
2ndDose
|
1stDose
|
2nd Dose
|
1stDose
|
1stDose
|
1stDose
|
2ndDose
|
|
62,761
|
41,344
|
1,16,351
|
1,48,638
|
4,32,773
|
15,01,438
|
21,13,323
|
1,89,982
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
ఎనిమిది రాష్ట్రాలలో కింద సూచించిన విధంగా క్యుములేటివ్ డోస్‌లలో 60 శాతం ఇవ్వడం జరిగింది.
ఇండియా క్యుములేటివ్ రికవరీలు ఈరోజు నాటికి 1,12,31,650 వద్ద ఉన్నాయి. నేషనల్ రికవరీ రేటు 95.28 శాతంగా ఉంది.
గత 24 గంటలలో 26,940 రికవరీలు నమోదయ్యాయి. మొత్తం రికవర్ అయిన కేసులు, యాక్టివ్ కేసుల మధ్య అంతరం ఈరోజు 10,826,458 గా ఉంది.
గడచిన 24 గంటలలో 251 మరణాలు నమోదయ్యాయి.
రోజువారి మరణాల సంఖ్యలో ఆరు రాష్ట్రాలు 78.49 శాతంగా ఉంది. మహారాష్ట్రలో గరిష్ఠంగా 95 మరణాలు నమోదయ్యాయి. పంజాబ్ ఆ తర్వాతి స్థానంలో 39 రోజువారి మరణాలు, చత్తీస్‌ఘడ్‌లో 29 మరణాలు నమోదయ్యాయి.
14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో గత 24 గంటలలో ఎలాంటి కోవిడ్ 19 కేసులు నమోదు కాలేదు. ఇవి జమ్ము కాశ్మీర్ (యుటి), గోవా, ఉత్తరాఖండ్, ఒడిషా, లక్షద్వీప్, డిఅండ్ డి , డిఅండ్ ఎన్, లద్దాక్(యుటి), సిక్కిం, త్రిపుర, మేఘాలయ, మిజోరం, అండమాన్ నికోబార్ దీవులు,అరుణాచల్ ప్రదేశ్ ,నాగాలాండ్ ఉన్నాయి.
***
(Release ID: 1707569)
Visitor Counter : 196