రక్షణ మంత్రిత్వ శాఖ
నేటి నుంచి మూడు రోజులపాటు భారత్‌లో రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దక్షిణ కొరియా) రక్షణ శాఖ మంత్రి పర్యటన
Posted On:
25 MAR 2021 10:52AM by PIB Hyderabad
దక్షిణ కొరియా రక్షణ శాఖ మంత్రి సూ ఊక్ నేటి నుంచి మూడు రోజులపాటు (మార్చి 25-27) భారత్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా, భారత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌తో ఊక్ దిల్లీలో సమావేశమవుతారు. భారత్-ద.కొరియా మధ్య రక్షణ రంగంలో సహకారంతోపాటు పరస్పర ప్రయోజనమున్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. భారత్-కొరియా స్నేహపూర్వక పార్కును దిల్లీ కంటోన్మెంట్‌లో ఇరువురు కలిసి ప్రారంభిస్తారు.
ఈ పర్యటనలో భాగంగా ఆగ్రాను కూడా సూ ఊక్ సందర్శిస్తారు.
****
(Release ID: 1707448)
Visitor Counter : 200