ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఐఎన్ఎస్ఏసిఓజి జరిపిన జన్యు శ్రేణి విశ్లేషణ ప్రకారం ఆందోళన కలిగించే వివిధ రూపాంతరాలు, భారత్ లో కొత్త వేరియంట్ ఉన్నట్టు వెల్లడి

Posted On: 24 MAR 2021 12:49PM by PIB Hyderabad

జెనోమిక్స్ పై ఇండియన్ సార్స్-కోవ్-2 కన్సార్టియం ( ఐఎన్ఎస్ఏసిఓజి) అనేది 10 జాతీయ ప్రయోగశాలల సమాహారం. దీనిని 2020 డిసెంబర్ 25వ తేదీన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్థాపించింది. ఐఎన్ఎస్ఏసిఓజి అప్పటి నుండి కోవిడ్-19 వైరస్ జన్యు శ్రేణి, విశ్లేషణలను నిర్వహిస్తుంది. సాంక్రామిక వ్యాధుల అధ్యయనానికి సంబంధించిన జన్యు వైవిధ్యాలతో పరస్పరం సంబంధం కలిగి ఉంది. వివిధ వైరస్ ల జన్యు వైవిధ్యాలు సహజమైన దృగ్విషయం. ఇవి దాదాపు అన్ని దేశాలలో కనిపిస్తాయి.

ఐఎన్ఎస్ఏసిఓజి తన పనిని ప్రారంభించినప్పటి నుండి, రాష్ట్రాలు / యుటిలు అందించిన మొత్తం 10787 పాజిటివ్ నమూనాలలో 771 కొత్త రూపాలు (విఓసిలు) కనుగొన్నారు. వీటిలో యుకే (బి.1.1.7) రకానికి చెందిన 736 పాజిటివ్ నమూనాలు, దక్షిణాఫ్రికా (బి.1.351) రకానికి చెందిన 34 పాజిటివ్ నమూనాలు ఉన్నాయి. బ్రెజిలియన్ (పి .1) రకానికి చెందిన ఒక పాజిటివ్  నమూనా ఉంది. ఈ విఓసిలతో ఉన్న నమూనాలను దేశంలోని 18 రాష్ట్రాల్లో గుర్తించారు. అంతర్జాతీయ ప్రయాణికుల నుండి వచ్చిన నమూనాలు, కొత్త రకం వైరస్ కాంటాక్టులు, చాలా రాష్ట్రాల నుండి వచ్చిన కమ్యూనిటీ నమూనాలు, వీటన్నింటిపై ఐఎన్ఎస్ఏసిఓజి భాగస్వామ్య ప్రయోగశాలలు పదింటిలో జీనోమ్ సీక్వెన్సింగ్ మరియు విశ్లేషణలు జరిగాయి.

మహారాష్ట్ర నుండి వచ్చిన నమూనాల విశ్లేషణలో, డిసెంబర్ 2020 తో పోలిస్తే, E484Q మరియు L452R ఉత్పరివర్తనాలతో నమూనాల భిన్నంలో పెరుగుదల ఉందని వెల్లడైంది. ఇటువంటి ఉత్పరివర్తనలు రోగనిరోధక తప్పించుకోవడం మరియు పెరిగిన అంటువ్యాధిని సూచిస్తాయి. ఈ ఉత్పరివర్తనలు సుమారు 15-20% నమూనాలలో కనుగొన్నారు, అలాగే గతంలో గుర్తించి జాబితాగా చేసిన వైరస్ రకాలతో సరిపోలడం లేదు. ఇవి విఓసి లుగా వర్గీకరించినప్పటికీ, రాష్ట్రాలు / యుటిలచే " పెరిగిన పరీక్షలు, దగ్గరి కాంటాక్టుల సమగ్ర ట్రాకింగ్, పాజిటివ్ కేసులు, కాంటాక్టులను వెంటనే వేరుచేయడం మరియు జాతీయ చికిత్స ప్రోటోకాల్ ప్రకారం చికిత్సనందించడం" మాదిరిగానే సాంక్రామిక వ్యాధుల అధ్యయనం, ప్రజారోగ్య స్పందన అవసరం.

కేరళ నుండి 2032 నమూనాలు (మొత్తం 14 జిల్లాల నుండి) క్రమం చేయడం జరిగింది. రోగనిరోధక తప్పించుకోవడంతో సంబంధం ఉన్న N440K వేరియంట్ 11 జిల్లాల నుండి 123 నమూనాలలో కనుగొన్నారు. ఈ వేరియంట్ అంతకుముందు ఆంధ్రప్రదేశ్ నుండి 33% నమూనాలలో మరియు తెలంగాణ నుండి 104 నమూనాలలో 53 లోగుర్తించారు. ఈ వేరియంట్ యుకె, డెన్మార్క్, సింగపూర్, జపాన్ మరియు ఆస్ట్రేలియాతో సహా మరో 16 దేశాల నుండి కూడా రిపోర్ట్ అయింది. ప్రస్తుతానికి ఇవి పరిశోధనలో ఉన్న వేరియంట్ అని చెప్పవచ్చు.

విఓసిలు, కొత్త డబుల్ మ్యుటెంట్ వేరియంట్ భారతదేశంలో కనుగొనబడినప్పటికీ, ఇవి కొన్ని రాష్ట్రాల్లో కేసుల యొక్క వేగవంతమైన పెరుగుదలను వివరించడానికి లేదా ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాయని చెప్పడానికి సరిపోయే సంఖ్యలో నిర్ధారణ కాలేదు. పరిస్థితిని మరింత విశ్లేషించడానికి జెనోమిక్ సీక్వెన్సింగ్ మరియు ఎపిడెమియోలాజికల్ అధ్యయనాలు కొనసాగుతున్నాయి.

 

***

 



(Release ID: 1707210) Visitor Counter : 373