ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధి పెంచాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ

రెండో డోస్ వ్యవధి 6-8 వారాల మధ్య అయితే మరింత రక్షణ

Posted On: 22 MAR 2021 3:20PM by PIB Hyderabad

వెలుగు చూస్తున్న శాస్త్రీయ సాక్ష్యాల ఆధారంగా కోవిడ్-19 టీకా అయిన కోవిషీల్డ్ ఇచ్చే రెండు డోసుల మధ్య వ్యవధిని 6 నుంచి 8 వారాలకు పెంచాలని ప్రభుత్వం సూచిస్తోంది. టీకాలమీద జాతీయ సాంకేతిక సలహా బృందం ( ఎన్ టి ఎ జి ఐ) , ఆ తరువాత కోవిడ్-19 మీద టీకాల నిర్వహణ మీద జాతీయ నిపుణుల బృందం ( ఎన్ ఇ జి వి ఎ సి) తన 20వ సమావేశం లో చేసిన సూచన ఆధారంగా ఈ నిర్ణయం వెల్లడించారు. ఈ సమావేశంలొ చేసిన సిఫార్సుల ప్రకారం ఈ టీకా మొదటి, రెండవ డోసుల మధ్య వ్యవధి 4-8 వారాలు ఉండాలని గతంలో సూచించినప్పటికీ ఇప్పుడు దాన్ని 6-8 వారాలకు పెంచాలని సిఫార్సు చేసింది. అయితే, ఇది కోవిషీల్డ్ టీకాకే తప్ప కొవాక్సిన్ కు వర్తించదని కూడా స్పష్టం చేసింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ భూషణ్ ఈ మేరకు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఈ రోజు లేఖ రాశారు. నిపుణుల బృందాలు చేసిన సిఫార్సులను భారత ప్రభుత్వం ఆమోదించిందని అందువలన రాష్ట్రాలు కోవిషీల్డ్ టీకా లబ్ధిదారులకు రెండో డోస్ వ్యవధిని పెంచాలని సూచించారు. ,

ఇప్పటి శాస్త్రీయ సాక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని కోవిషీల్డ్ రెండో డోస్ వ్యవధిని 6-8 వారాలకు పెంచటం వలన రక్షణ పెరుగుతున్నట్టు తేలిందన్నారు. అయితే, 8 వారాలకు మాత్రం మించకూడదన్నారు. సంబంధిత అధికారులందరికీ దీనికి అనుగుణంగా ఆదేశాలివ్వాలని, మారిన వ్యవధి మీద స్థానికంగా తగిన విధంగా ప్రచారం చేయాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ఈ లేఖలో చీఫ్ సెక్రెటరీలను కోరారు. 

***

 


(Release ID: 1706621) Visitor Counter : 391