వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

నేటితో ముగిసిన బ్రిక్స్ (BRICS) కాంటాక్ట్ గ్రూప్ ఆన్ ఎక‌మ‌నిమ‌క్ అండ్ ట్రేడ్ ఇష్యూస్ తొలి స‌మావేశం

Posted On: 12 MAR 2021 9:27AM by PIB Hyderabad

బ్రిక్స్ కాంటాక్ట్ గ్రూప్ ఆన్ ఎక‌మ‌నిమ‌క్ అండ్ ట్రేడ్ ఇష్యూస్ (సిజిఇటిఐ - ఆర్థిక వాణిజ్య అంశాల‌పై బ్రిక్స్ సంప్ర‌దింపుల బృందం) లీడ్స్ త‌మ తొలి స‌మావేశాన్ని భార‌త్ అధ్య‌క్ష‌త‌న మార్చి 9-11, 2021వ‌ర‌కు నిర్వ‌హించింది. ఈ ఏడాది బ్రిక్స్ ఇతివృత్తం - బ్రిక్స్‌@15ః ఇంట్రా బ్రిక్స్ కోఆప‌రేష‌న్ ఫ‌ర్ కంటిన్యుటీ, క‌న్సాలిడేష‌న్ అండ్ క‌న్సెన్స‌స్ (బ్రిక్స్ దేశాల మ‌ధ్య కొన‌సాగింపు, స్థిరీక‌ర‌ణ‌, ఏకాభిప్రాయం కోసం స‌హ‌కారం).
భార‌త్ త‌న అధ్య‌క్ష‌త‌న, 2021కి బ్రిక్స్ సిజిఇటిఐ 2021కి కేలండ‌ర్‌ను ప్ర‌తిపాదించింది. ఇందులో సేవ‌ల గ‌ణాంకాలపై ఎంఎ ఎంస్ఇ రౌండ్ టేబుల్ స‌మావ‌వేశం వ‌ర్క్‌షాప్‌, బ్రిక్స్ వాణిజ్య ప్ర‌ద‌ర్శ‌నకు కాల‌ప‌ట్టిక‌, సాధ్య‌త, బ‌ట్వాడాల కోసం ప్రాధాన్య‌త అంశాలు పొందుప‌రిచారు. దీని త‌ర్వాత బ్రిక్స్ సిజిఇటిఐకి భార‌త్ అధ్య‌క్ష‌త‌న భార‌త ప్ర‌భుత్వంలోని సంబంధిత శాఖ‌లు త‌యారు చేసిన ప్ర‌తిపాదిత డెలివ‌ర‌బుల్స్‌పై వేర్వేరు సెష‌న్ల‌లో ఇవ్వ‌వ‌ల‌సిన ప్రెజెంటేష‌న్ల పంరంపర సాగాయి. 
ప్ర‌తిపాదిత డెలివ‌ర‌బుల్స్ (1) 2020లో ర‌ష్యా అధ్య‌క్ష‌త‌న ఆమోదించిన‌ స్ట్రాట‌జీ ఫ‌ర్ బ్రిక్స్ ఎక‌న‌మిక్ పార్ట్న‌ర్‌షిప్ 2025 ప‌త్రంపై కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక (2) ప్ర‌పంచ వాణిజ్య సంస్థ‌లో వద్ద ట్రిప్స్ (TRIPS) మాఫీ ప్రతిపాదనకు సహకారంతో సహా బహుళపాక్షిక వాణిజ్య వ్యవస్థపై బ్రిక్స్ సహకారం (3) ఇ-కామ‌ర్స్‌లో వినియోగ‌దారుల ర‌క్ష‌ణ‌కు చ‌ట్టం (4) ప‌న్నేత‌ర చ‌ర్య‌లు (నాన్ టారిఫ్ మెజ‌ర్స్ - ఎన్‌టిఎం) ప‌రిష్కార విధానం (5) పారిశుద్ధ్య‌, పాత‌ప పారిశుద్ధ‌త (ఎస్‌పిఎస్‌) ప‌నివిధానం (6) జన్యు వనరులు, సాంప్రదాయ జ్ఞాన రక్షణ కోసం సహకార చట్రం; (7) ప్రొఫెషనల్ సర్వీసెస్‌లో సహకారంపై బ్రిక్స్ చ‌ట్రం. ఈ అంశాల‌పై ప్ర‌తి సెష‌న్ త‌ర్వాత ఫీడ్ బ్యాక్ సెష‌న్ జ‌రిగింది. 
భార‌త్ రూపొందించిన కార్య‌క్ర‌మాల ప్ర‌ణాళిక స‌కాలంలో, ప్ర‌స్తుత ప‌రిస్థితికి త‌గ్గ‌టుగా ఉంద‌ని బ్రిక్స్ భాగ‌స్వాములు అభినందించ‌డ‌మే కాక భార‌త్ ప్ర‌తిపాదించిన వివిధ చొర‌వ‌ల‌పై క‌లిసి ప‌ని చేసేందుకు త‌మ మ‌ద్ద‌తు తెలిపారు.  ఇప్ప‌టి నుంచి సెప్టెంబ‌ర్ 2021వ‌ర‌కు బ్రిక్స్ దేశాల మ‌ధ్య ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు సెష‌న్ల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతాయి. సిజిఇటిఐ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించిన బ్రిక్స్ అధికారులు జూన్ 2021లో జ‌రుగనున్న 27వ అధికార స్థాయి సిజిఇటిఐ స‌మావేశం కోసం ప‌ని చేయ‌డాన్ని కొన‌సాగిస్తారు.

***
 


(Release ID: 1704338) Visitor Counter : 233