రక్షణ మంత్రిత్వ శాఖ
నౌకాదళ సేవలోకి ప్రవేశించిన మూడవ కల్వరి క్లాస్ జలాంతర్గామి ఐఎన్ఎస్ కరంజ్
ముంబైలోని నావల్ డాక్ యార్డ్ లో ప్రారంభం
మజాగాన్ డాక్ లో స్వదేశీ పరిజ్ణానంతో రూపుదిద్దుకుని ఆత్మనిర్భరత సాధనలో నావికాదళ 75వ ప్రాజెక్ట్ ప్రధాన మైలురాయి
Posted On:
10 MAR 2021 1:48PM by PIB Hyderabad
భారతీయ నావికాదళం లోని మూడవ స్టీల్త్ స్కార్పెన్ క్లాస్ జలాంతర్గామి ఐఎన్ఎస్ కరంజ్ ఈ రోజు ముంబైలోని నావల్ డాక్ యార్డ్ లో ప్రారంభమయింది. ఐఎన్ఎస్ కరంజ్ సేవల ప్రారంభ కార్యక్రమంలో భారతనౌకాదళ మాజీ ప్రధానాధికారి అడ్మిరల్ వి.ఎస్. శేఖవత్ పివిఎస్ఎమ్, ఎవిఎస్ఎమ్, విఆర్సి (రిటైర్డ్) ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. పాత కరంజ్ కమీషనింగ్ సిబ్బందిలో ఒకరిగా పనిచేసిన అడ్మిరల్ వి.ఎస్. శేఖవత్ 1971 ఇండో-పాక్ యుద్ధంలో కమాండింగ్ అధికారిగా వ్యవహరించి ఆ తరువాత భారతనౌకాదళాధిపతిగా పనిచేశారు. ఫ్రాన్స్ కి చెందిన మెసర్స్ నావల్ గ్రూప్ తో కలసి భారతదేశంలో ఆరు స్కార్పీన్ క్లాస్ జలాంతర్గాములను భారతదేశంలో మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండిఎల్) ముంబైలో నిర్మిస్తోంది. ఐఎన్ఎస్ కరంజ్ పశ్చిమ నౌకాదళానికి తన సేవలు అందిస్తూ కమాండ్ అమ్ములపొదిని మరింత శక్తివంతం చేస్తుంది.
ప్రారంభ కార్యక్రమంలో నావికాదళ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, నావికాదళం రక్షణమంత్రిత్వ శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 2003 లో సేవల నుంచి వైదొలగిన రష్యన్ మూలం కలిగిన ఫాక్స్ ట్రాట్ క్లాస్ జలాంతర్గామి ‘కరంజ్’లో పనిచేసిన సిబ్బంది కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. సమావేశంలో ప్రసంగించిన నౌకాదళాధిపతి " భారత నౌకాదళ అభివృద్ధిలో కీలకంగా వ్య్వవహరించిన స్వదేశీ పరిజ్ఞానం ఆత్మ నిర్భర్ భారత్ లు భవిష్యత్ లో శక్తి సామర్ధ్యాలను మరింత పెంపొందిస్తాయని " అని అన్నారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న అడ్మిరల్ శేఖవత్ ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ " అనేక ఉపగ్రహాలను ప్రయోగిస్తూ , అణు జలాంతర్గాములను నిర్మిస్తూ, ప్రపంచదేశాలకు వాక్సిన్ లను అందిస్తున్న భారతదేశ శక్తికి కొత్త కరంజ్ మరొక ఉదాహరణ"అని అన్నారు.
1971 ఇండో - పాక్ యుద్ధానికి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ ఏడాదిని ‘స్వర్నిమ్ విజయ్ వర్ష్’ గా జరుపుకుంటున్నారు. 04 సెప్టెంబర్ 1969 న పూర్వపు యుఎస్ఎస్ఆర్ లోని రిగాలో ప్రారంభం అయిన పాత ఐఎన్ఎస్ కరంజ్ అప్పటి సిడిఆర్ వి.ఎస్. షేఖావత్ కమాండ్ కింద సంఘర్షణలో చురుకుగా పాల్గొన్నారు. ఆమె ఓ ers సెర్స్ మరియు సిబ్బంది యొక్క సాహసోపేతమైన చర్యకు గుర్తింపుగా, అప్పుడు కమాండింగ్ ఆఫీసర్ గా పనిచేసిన శేఖవత్ నాయకత్వంలో యుద్ధంలో కీలకపాత్ర పోషించింది. ఈ సేవలకు గుర్తింపుగా శేఖవత్ కు వీర్ చక్ర అవార్డు అనేక మంది సిబ్బందికి అవార్డులు అందుకున్నారు.పాత ఐఎన్ఎస్ కరంజ్ కమాండింగ్ ఆఫీసర్ గా వ్యవహరించిన ఎంఎన్ఆర్ సమంత్ 1971 లో కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్ నావికాదళానికి తొలి ప్రధానాధికారిగా నియమించబడడం ఒక ఆసక్తికరమైన అంశం.
ప్రపంచంలో అత్యంత అధునాతన సాంప్రదాయ జలాంతర్గాములలో స్కార్పీన్ జలాంతర్గాములు ఒకటిగా వున్నాయి. ఈ తరగతి జలాంతర్గాములు ప్రపంచంలోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో పనిచేస్తాయి. ఈ తరగతికి చెందిన గత జలాంతర్గాముల కంటే రహస్యంగా శక్తివంతంగా ఇవి రూపుదిద్దుకున్నాయి. ఈ జలాంతర్గాములు సముద్రపు ఉపరితలం పైన లేదా క్రింద ఏదైనా ముప్పును నిర్వీర్యం చేయగల శక్తివంతమైన ఆయుధాలు మరియు సెన్సార్లను కలిగి ఉంటాయి.
సొంతంగా యుద్ధ నౌకలను తయారుచేసుకోవడానికి భారత నావికాదళం చేస్తున్న ప్రయత్నాలలో ఐఎన్ఎస్ కరంజ్ మరో మైలు రాయిగా ఉంటుంది. ప్రపంచంలో ప్రముఖ ఓడ మరియు జలాంతర్గామి బిల్డింగ్ యార్డుగా మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండిఎల్) శక్తి సామర్థ్యాలు మరోసారి ఐఎన్ఎస్ కరంజ్ నిర్మాణం ద్వారా వెల్లడయ్యాయి. రక్షణ ఉత్పత్తి రంగంలో ప్రాజెక్ట్-75 ద్వారా ఎండిఎల్ మరో అడుగు ముందుకు వేసింది.
***
(Release ID: 1703814)
Visitor Counter : 264