సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
స్వేచ్ఛా దేశం అనే స్థాయి నుండి భారత్ క్షీణిస్తోందంటూ ఫ్రీడమ్ హౌస్ నివేదికకు ఖండన
Posted On:
05 MAR 2021 5:02PM by PIB Hyderabad
, స్వేచ్ఛా దేశంగా భారతదేశ స్థితి "పాక్షికంగా స్వేచ్ఛ" క్షీణించిందని "డెమోక్రసీ అండర్ సీజ్" పేరుతో ఫ్రీడమ్ హౌస్ నివేదిక , తప్పుదోవ పట్టించేదిగాను, అవాస్తవంగాను, తప్పుడుగాను ఉంది.
భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు సమాఖ్య స్ఫూర్తితో, జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు కాకుండా, స్వేచ్ఛాయుతమైన మరియు న్యాయమైన మరియు స్వతంత్ర ఎన్నికల సంస్థ నిర్వహించే ఎన్నికల ప్రక్రియ ద్వారా పాలన సాగుతోంది. ఇది శక్తివంతమైన ప్రజాస్వామ్యం పని విధానాన్ని ప్రతిబింబిస్తుంది, ఇది విభిన్న అభిప్రాయాలను కలిగి ఉన్నవారికి స్థానం కల్పించేదిగా ఉంది.
నిర్దిష్టాంగా వివిధ అంశాలకు ఖండన: -
- భారతదేశంలో ముస్లింలు మరియు ఈశాన్య ఢిల్లీలో అల్లర్లలో వివక్షత లేని విధానాలు- భారత ప్రభుత్వం తన పౌరులందరినీ దేశ రాజ్యాంగంలో పొందుపరిచినట్లుగా సమానంగా పరిగణిస్తుంది మరియు అన్ని చట్టాలు వివక్ష లేకుండా వర్తింపజేస్తుంది.
ఆరోపణ చేసిన ప్రేరేపకుడి గుర్తింపుతో సంబంధం లేకుండా, శాంతిభద్రతలకు సంబంధించిన విషయాలలో చట్టం యొక్క సరైన ప్రక్రియ అనుసరించడం జరుగుతుంది. 2019 జనవరిలో జరిగిన ఈశాన్య ఢిల్లీ అల్లర్ల గురించి నిర్దిష్ట సూచనతో, చట్టాలను అమలు చేసే యంత్రాంగం నిష్పాక్షికంగా మరియు న్యాయమైన రీతిలో వేగంగా వ్యవహరించింది. పరిస్థితిని నియంత్రించడానికి అనుపాత మరియు తగిన చర్యలు తీసుకున్నారు. చట్టం మరియు విధానాల ప్రకారం, వచ్చిన అన్ని ఫిర్యాదులు / కాల్‌లపై చట్ట అమలు యంత్రాంగం అవసరమైన చట్టపరమైన మరియు నివారణ చర్యలు తీసుకుంది.
- దేశద్రోహ చట్టం వినియోగం –
- “పబ్లిక్ ఆర్డర్” మరియు ‘పోలీస్’ భారతదేశ సమాఖ్య నిర్మాణ పాలనలో ఉన్న రాష్ట్ర అంశాలు. దర్యాప్తు, రిజిస్ట్రేషన్ మరియు నేరాల విచారణ, ప్రాణ, ఆస్తి రక్షణ మొదలైన వాటితో సహా శాంతిభద్రతల నిర్వహణ బాధ్యత ప్రధానంగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. అందువల్ల, ప్రజా భద్రతను పరిరక్షించడానికి చట్టాలు అమలు చేసే అధికారులు చర్యలు తీసుకుంటారు.
- లాక్డౌన్ ద్వారా కోవిడ్-19 కు ప్రభుత్వ స్పందన – మార్చి 16 నుండి 23 వరకు, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్రపాలిత ప్రాంతాలు కోవిడ్-19 పరిస్థితిని అంచనా వేయడం ఆధారంగా ఆయా రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాలలో పాక్షిక లేదా పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేశాయి. ఈ వాస్తవాలు, ప్రపంచ అనుభవం మరియు దేశవ్యాప్తంగా వివిధ నియంత్రణ చర్యల విధానం మరియు అమలులో స్థిరత్వం యొక్క అవసరాన్ని పరిగణనలోకి తీసుకొని, దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించబడింది. అనివార్యమైన లాక్డౌన్ కాలంలో, ప్రజలు అనవసరమైన బాధలను ఎదుర్కోకూడదని ప్రభుత్వం పూర్తిగాఅవగాహనలో ఉంది. దీని గురించి తెలుసుకున్న ప్రభుత్వం పరిస్థితిని పరిష్కరించడానికి వివిధ చర్యలు తీసుకుంది; (1) ఆహారం, ఆరోగ్య సంరక్షణ, నిరాశ్రయులకు మరియు వలస కార్మికులకు ఆశ్రయం కల్పించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డిఆర్‌ఎఫ్) ను ఉపయోగించుకోవడానికి భారత ప్రభుత్వం అనుమతించింది.
(2) వలస కార్మికులను కంటైనేషన్ జోన్ల వెలుపల వివిధ కార్యకలాపాలలో నిమగ్నం చేయడానికి ప్రభుత్వం అనుమతించింది, ఇది వారికి జీవనోపాధిని కల్పిస్తుంది (3) ప్రభుత్వం రూ. 1.7 లక్షల కోట్లు సహాయ నిధిని ప్రకటించింది, ఇది వలస కార్మికులను కూడా కవర్ చేసింది (4) తమ గ్రామాలకు తిరిగి వచ్చే వలస కార్మికులకు ఉపాధి మరియు జీవనోపాధి అవకాశాలను పెంచడానికి ప్రభుత్వం ఒక మిషన్ ప్రారంభించింది (5) జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద సుమారు 80 కోట్ల మంది లబ్ధిదారులకు 5 కిలోల గోధుమలు లేదా బియ్యం, 1 కిలో పప్పులు ప్రతి నెల -2020 నవంబర్ వరకు ఉచితంగా అందించారు.(6) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) కింద రోజువారీ వేతనాలు పెంచబడ్డాయి, ఇది తిరిగి వచ్చే వలస కార్మికులను కూడా కవర్ చేస్తుంది. లాక్డౌన్ కాలం ప్రభుత్వానికి మాస్కులు, వెంటిలేటర్లు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పిపిఇ) కిట్లు మొదలైన వాటి యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి మరియు తద్వారా మహమ్మారి వ్యాప్తిని సమర్థవంతంగా నిరోధించడానికి అనుమతించింది. భారతదేశం, తలసరి ప్రాతిపదికన, ప్రపంచవ్యాప్తంగా క్రియాశీల కోవిడ్-19 కేసులు మరియు సంబంధిత మరణాలలో అతి తక్కువ రేటును నమోదు చేసింది.
- మానవ హక్కుల సంస్థలపై ప్రభుత్వ స్పందన – మానవ హక్కుల పరిరక్షణ కోసం మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 తో సహా వివిధ చట్టాల ప్రకారం తగిన రక్షణ భారత రాజ్యాంగం నిర్దేశిస్తుంది. మానవ హక్కుల మెరుగైన రక్షణ కోసం మరియు ఈ విషయానికి సంబంధించిన విషయాల కోసం రాష్ట్రాలలో జాతీయ మానవ హక్కుల కమిషన్ మరియు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ల ఏర్పాటుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. జాతీయ కమిషన్ రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఉంది మరియు దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన ఉందని తేలిన కేసులలో విచారణ, దర్యాప్తు మరియు సిఫార్సులు చేయడానికి ఒక యంత్రాంగంగా పనిచేస్తుంది.
- విద్యావేత్తలు మరియు జర్నలిస్టులను బెదిరించడం మరియు మీడియా ద్వారా అసమ్మతిని వ్యక్తం చేయడంపై అణిచివేత – ఆర్టికల్ 19 కింద భారత రాజ్యాంగం భావ ప్రకటనా స్వేచ్ఛను అందిస్తుంది. చర్చ, సమాలోచన మరియు భిన్నాభిప్రాయాలు భారత ప్రజాస్వామ్యంలో భాగం. జర్నలిస్టులతో సహా దేశంలోని అన్ని నివాసితుల భద్రత మరియు రక్షణకు భారత ప్రభుత్వం అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తుంది. మీడియా వ్యక్తుల భద్రత మరియు రక్షణను నిర్ధారించడానికి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని అభ్యర్థిస్తూ జర్నలిస్టుల భద్రతపై భారత ప్రభుత్వం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక సూచనలు ఇచ్చింది.
- ఇంటర్నెట్ నిలిపివేత –భారతీయ టెలిగ్రాఫ్ చట్టం, 185 లోని నిబంధనల ప్రకారం జారీ చేయబడిన టెలికాం సేవల తాత్కాలిక సస్పెన్షన్ (పబ్లిక్ ఎమర్జెన్సీ లేదా పబ్లిక్ సేఫ్టీ) నిబంధనలు, 2017 లోని నిబంధనల ప్రకారం ఇంటర్నెట్‌తో సహా టెలికాం సేవలను తాత్కాలికంగా నిలిపివేయడం జరుగుతుంది. ఈ తాత్కాలిక సస్పెన్షన్లకు కేంద్ర ప్రభుత్వ విషయానికి వస్తే, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అధికారిక అనుమతి అవసరం; లేదా రాష్ట్ర ప్రభుత్వ విషయంలో హోంశాఖ కార్యదర్శి లేదా ఆ శాఖ ఇంచార్జి అనుమతి అవసరం. అంతేకాకుండా, అటువంటి ఉత్తర్వులను కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సమీక్ష కమిటీ, భారత ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శి లేదా సంబంధిత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన, నిర్ణీత వ్యవధిలో సమీక్షిస్తుంది. అందువల్ల, టెలికాం / ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయడం అనేది కఠినమైన భద్రత చర్యల క్రింద శాంతిభద్రతలను నిర్వహించడం అనే అత్యున్నత ఉద్దేశ్యంతో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.
- అమ్నెస్టీ ఇంటర్నేషనల్ యొక్క ఆస్తులను స్తంభింపచేయడానికి దారితీసిన ఎఫ్సిఆర్ఏ సవరణ వల్ల ర్యాంకింగ్‌లో క్షీణతకు దారితీసింది –అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఎఫ్సిఆర్ఏ చట్టం క్రింద ఒక్కసారి మాత్రమే అనుమతి పొందింది మరియు అది కూడా 20 సంవత్సరాల క్రితం (19.12.2000). అప్పటి నుండి అమ్నెస్టీ ఇంటర్నేషనల్, పదేపదే దరఖాస్తులు ఉన్నప్పటికీ, చట్టం ప్రకారం అటువంటి ఆమోదం పొందటానికి అర్హత లేనందున, తరువాతి ప్రభుత్వాలు ఎఫ్సిఆర్ఏ ఆమోదాన్ని నిరాకరించాయి. ఏదేమైనా, ఎఫ్‌సిఆర్‌ఎ నిబంధనలను అధిగమించడానికి, అమ్నెస్టీ యు.కె. భారతదేశంలో నమోదు చేసుకున్న నాలుగు సంస్థలకు తప్పుడు వర్గీకరణ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ)గా పంపించింది. ఎఫ్సిఆర్ఏ క్రింద ఎంహెచ్ఏ అనుమతి లేకుండా గణనీయమైన విదేశీ డబ్బును అమ్నెస్టీ ఇండియాకు పంపించారు. ఈ వక్ర మార్గం డబ్బును తిరిగి మార్పిడి చేయడం అనేది చట్టపరమైన నిబంధనలకు విరుద్ధంగా ఉంది. అమ్నెస్టీ యొక్క ఈ చట్టవిరుద్ధ పద్ధతుల కారణంగా, గత ప్రభుత్వం విదేశాల నుండి నిధులను స్వీకరించడానికి అమ్నెస్టీ పదేపదే దాఖలు చేసిన దరఖాస్తులను తిరస్కరించింది. ఇది ఆ కాలంలో కూడా అమ్నెస్టీ తన కార్యకలాపాలను ఒకసారి నిలిపివేసింది.
***
(Release ID: 1702774)
Visitor Counter : 314