ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
రోజువారీ కేసులు పెరుగుతున్న మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్నాటక
ఈ రోజు ఉదయం 7 గంటల వరకు మొత్తం 1.66 కోట్ల టీకా డోసులు
గత 24 గంటల్లో 10 లక్షలకు పైగా డోసులు
Posted On:
04 MAR 2021 11:45AM by PIB Hyderabad
మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లో రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో కేసులు మొత్తం కోవిడ్ కేసుల్లో 85.51% వాటా నమొదైంది. గత 24 గంటలలో 17,407 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో గత 24 గంటలలో అత్యధికంగా 9,855 కేసులు రాగా, గత అక్టోబర్ 18న 10,259 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత స్థానంలో ఉన్న కేరళలో 2,765 మంది, పంజాబ్ లో 772 కొత్త కేసులు వచ్చాయి.
భారత్ లో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసులు 1,73,413 కు చేరాయి. ఇవి మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసులలో 1.55%. మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, లో ఎక్కువ కేసులు వస్తున్నాయి.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో గత 24 గంటలలో చికిత్సలో ఉన్న కేసులలో మార్పును ఈ క్రింది చిత్రపటం చెబుతుంది. కేరళ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, అస్సాంలో చికిత్సలో ఉన్న కేసులు గత నాలుగు గంటలలో తగ్గుతూ ఉండగా మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్ లో పెరుగుతూ ఉన్నాయి.
భారతదేశంలో కోలుకుంటున్నవారి సంఖ్య బాగా పెరుగుతోంది. మార్చి4 ఉదయం 7 గంటల వరకు చికిత్సలో ఉన్న కేసులు, మరణాలు, కోలుకుంటున్నవారి సంఖ్యను చూపే చిత్రపటం దిగువన ఉంది.
ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం3,23,064 శిబిరాల ద్వారా 1,66,16,048 టీకా డోసుల పంపిణీ జరిగింది. అందులో 67,90,808 మొదటిడోస్ ఆరోగ్య సిబ్బంది, 28,72,725 రెండో డోస్ ఆరోగ్య సిబ్బంది, 58,03,856 కోవిడ్ యోధుల మొదటి డోస్, 4,202 కోవిడ్ యోధుల రెండో డోస్, 1,43,759 మంది లబ్ధిదారులు 45 ఏళ్ళు పైబడ్డ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, 10,00,698 మంది లబ్ధిదారులు 60 ఏళ్ళు పైబడ్డవారు ఉన్నారు.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45 -60 ఏళ్ళమధ్య దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
67,90,808
|
28,72,725
|
58,03,856
|
4,202
|
1,43,759
|
10,00,698
|
1,66,16,048
|
టీకాలు మొదలైన 47వ రోజైన మార్చి 3వ తేదీన దాదాపు 10 లక్షల (9,94,452) టీకా డోసులిచ్చారు. అందులో 8,31,590 మంది లబ్ధిదారులకు 10,849 శిబిరాల ద్వారా ఆరోగ్య సిబ్బందికి, కోవిడ్ యోధులకు మొదటి డోస్ ఇవ్వగా 1,62,862 మంది ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు రెండో డోస్ తీసుకున్నారు.
తేదీ: మార్చి 3, 2021
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45 -60 మధ్య దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
48,205
|
1,59,494
|
2,33,522
|
3,368
|
71,860
|
4,78,003
|
8,31,590
|
1,62,862
|
గత 24 గంటలలో 89 మంది కోవిడ్ బాధితులు మరణించారు. అందులో 88.76% మంది ఆరు రాష్ట్రాలకు చెందినవారే. అత్యధిక మరణాలు మహారాష్ట్రలో (42) నమోదు కాగా కేరళలో 15 మంది, పంజాబ్ లో 12 మంది చనిపోయారు.
గత 24 గంటలలో 23 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: మధ్య ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, జమ్మూ-కశ్మీర్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, జార్ఖండ్, పుదుచ్చేరి, అస్సాం, లక్షదీవులు, నాగాలాండ్, సిక్కిం, లద్దాఖ్, త్రిపుర, అండమాన్-నికోబార్ దీవులు, మణిపూర్, మిజోరం, మేఘాలయ, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, అరుణాచల్ ప్రదేశ్
****
(Release ID: 1702577)
Visitor Counter : 308