భారత ఎన్నికల సంఘం
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29 ఎ కింద రాజకీయ పార్టీల నమోదు - పబ్లిక్ నోటీసు కాలం
Posted On:
02 MAR 2021 4:42PM by PIB Hyderabad
రాజకీయ పార్టీల నమోదు ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29 ఎ పరిధిలో ఉంటుంది. పేర్కొన్న సెక్షన్ కింద కమిషన్‌లో నమోదు చేసుకోవాలనుకునే పార్టీ లు- పార్టీ ఏర్పడిన తేదీ నుంచి 30 రోజుల లోపు కమిషన్‌కు దరఖాస్తును సమర్పించవలసి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29 ఎ ఇచ్చిన అధికారాలకు ఉపయోగిస్తూ కమిషన్ ఏర్పరచిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ జరగాలి. ప్రస్తుతం ఉనికిలో ఉన్న మార్గదర్శకాల ప్రకారం, దరఖాస్తుదారు సంఘం పార్టీ ప్రతిపాదిత పేరును కమిషన్‌లో నమోదు చేసుకునే విషయంలో ఎవరికైనా ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రకటన ఇచ్చిన 30 రోజుల లోపు తెలియ చేయాలని రెండు జాతీయ దినపత్రికలలోనూ, రెండు స్థానిక దిన పత్రికలలోనూ ప్రకటించాలి. అలా ప్రచురించిన నోటీసును కమిషన్ వెబ్‌సైట్‌లో కూడా ఉంచుతారు.
కమిషన్ పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి శాసన సభలకు ఎన్నికల తేదీలను 26.02.2021న ప్రకటించింది. కాగా, కోవిడ్ -19 కారణంగా ప్రస్తుతమున్న నిబంధనల దృష్ట్యా ఇటువంటి పార్టీలు నమోదు చేసుకోవడానికి దరఖాస్తుల కదలికలో జాప్యం జరుగుతోందని, దీనికారణంగా రాజకీయ పార్టీ నమోదులో కూడా జాప్యం జరిగిందని కమిషన్ దృష్టికి తేవడం జరిగింది. కనుక, ఈ వ్యవహారాన్ని అన్ని కోణాలలో పరిగిణించిన తర్వాత, 26-02-2021న లేక అంతక ముందు నోటీసును ప్రచురించిన పార్టీలకు నోటీసు కాలాన్ని 30 నుంచి 7 రోజులకు తగ్గిస్తూ కమిషన్ నిబంధనలను సడలించింది. అన్ని పార్టీలూ, 26-02-2021కి 7 రోజుల కన్నా తక్కువ కాలంలో పబ్లిక్ నోటీసును ప్రకటించిన పార్టీలు సహా, అభ్యంతరాలు ఏమైనా ఉంటే, 02.03.2021 సాయంత్రం 5.30 గంటలకల్లా లేక ముందుగా ఇచ్చిన 30 రోజుల కాలపరిమితి పూర్తై ఉండి ఉంటే - ఏది ముందు అయితే దానిని పరిగణలోకి తీసుకుని వాటిని సమర్పించవలసి ఉంటుంది.
ఈ సడలింపు 19.03.2021 వరకు, అంటే అస్సాం, తమిళనాడు, కేరళ శాసన సభల ఎన్నికలకు నామినేషన్లకు ఆఖరి రోజు వరకూ అమలులో ఉంటాయి. పశ్చిమ బెంగాల్‌లో శాసన సభ ఎన్నికలకు నామినేషన్లకు ఆఖరి రోజూన 07.04.2021 వరకు ఈ సడలింపులు అమలులో ఉంటాయి.
***
(Release ID: 1702007)
Visitor Counter : 510