ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్ లో కొత్త కేసుల పెరుగుదల

చికిత్సలో ఉన్నవారు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచన
దాదాపు కోటిన్నర కోవిడ్ టీకా డోసుల పంపిణీ
19 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లో గత 24 గంటల్లో కోవిడ్ మరణాలు సున్నా

Posted On: 02 MAR 2021 12:06PM by PIB Hyderabad

భారతదేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 1,68,358 కు చేరింది. ఇందులో గత 24 గంటలలో అదనంగా చేరినవారు  12,286 మంది ఉన్నారు.  చికిత్సలో ఉన్నవారు మొత్తం కోవిడ్ బాధితులలో 1.51% మంది కొత్తగా కోవిడ్ బారిన పడినవారిలో 80.33% మంది ఐదు రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు.మహారాష్ట్రలో అత్యధికంగా ఒక రోజులో 6,397 కొత్త కేసులు

రాగా, కేరళలో 1,938, పంజాబ్ లో 633 కేసులు వచ్చాయి.కేవలం మహారాష్ట్ర, కేరళ కలిసి మొత్తం కేసుల్లో   67.84% వాటా ఉండటం గమనార్హం.

 

చికిత్సలో ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల విషయంలో కేంద్రం అప్రమతంగాగా వ్యవహరిస్తోంది. నిఘా పెంచుతూ కోవిడ్ వ్యాప్తిని సమర్థంగా నియంత్రించాలని రాష్ట్రాలను కోరింది.  పరీక్షలు పెంచటం, ఆచూకీ కోసం నిఘా పెంచటం, వ్యాధి సోకినవారిని ఐసొలేషన్ కి తరలించటం సరైన చికిత్స అందించటం  ద్వారా

కోవిడ్ ను కట్టడి చేయాలని సూచించింది.   రోజువారీ కొత్త కేసులు ఎనిమిది రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి.

 

దేశంలో చికిత్సలో ఉన్న మొత్తం కోవిడ్ కేసులలో 84.16% కేవలం ఐదు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 46.82% ఉండగా ఆ తరువాత స్థానంలో ఉన్న కేరళలో  28.61% కేసులున్నాయి.

 

 

ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వారపు పాజిటివ్ శాతం జాతీయ సగటు అయిన 2.00% కంటే ఎక్కువ నమోదైంది. అన్నిటి కంటే ఎక్కువగా మహారాష్ట్రలో వారపు పాజిటివ్ శాతం 10.02% గా నమోదైంది.  . 

 

ఈ రోజు ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారాన్ని బట్టి ఇప్పటిదాకా 1,48,54,136 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో 67,04,613 ఆరోగ్య సిబ్బంది మొదటి డోస్ అందుకోగా , 25,97,799 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ తీసుకున్నారు.

53,44,453 మంది కోవిడ్ యోధులు మొదటి డోస్ తీసుకోగా  24,279 మంది 45 ఏళ్ళు పైబడ్డ దీర్ఘకాల వ్యాధి బాధితులున్నారు. 1,82,992 మంది లబ్ధిదారులు 60 ఏళ్లు పైబడినవారు. 

 

రెండో డోస్ కోవిడ్ టీకాల కార్యక్రమం ఫిబ్రవరి 13న మొదలైంది. మొదటి డోస్ తీసుకున్న ఆరోగ్య సిబ్బంది 28 రోజులు పూర్తయ్యాక రెండో డోస్ కు అర్హత పొందారు. కోవిడ్ యోధులకు టీకాలివ్వటం  ఫిబ్రవరి 2న మొదలైంది.  కోవిడ్ బారిన పడినవారిలో ఇప్పటిదాకా 1,07,98,92 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో 12,464 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.భారత్ లో కోలుకున్నవారి శాతం 97.07% ప్రపంచంలోనే అత్యధికస్థాయిగా కొనసాగుతోంది.   

 

కొత్త కేసులలో 86.55% కేవలం ఆరు రాష్ట్రాలలో కేంద్రీకృతమయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా ఒకే రోజులో 5,754 మంది కోలుకోగా కేరళలో   3,475 మంది, తమిళనాడులో 482 మంది కోలుకున్నారు.

గత 24 గంటలలో మొత్తం 91 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. అందులో  85.71% ఆరు రాష్ట్రాలదే. మహారాష్ట్రలో అత్యధికంగా 30 మంది చనిపోగా పంజాబ్ లో 18 మంది, కేరళలో 13 మంది చనిపోయారు.  

 

గత 24 గంటలలో 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి:   పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరాఖండ్, బీహార్, లక్షదీవులు, లద్దాఖ్, సిక్కిం, త్రిపుర, మణిపూర్, మిజోరం, మేఘాలయ, నాగాలాండ్, అండమాన్-నికోబార్ దీవులు, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, అరుణాచల్ ప్రదేశ్      

****                        


(Release ID: 1701962) Visitor Counter : 220