వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

నిత్యావసర వస్తువుల ధరల అంచనా, విశ్లేషణలో భారత్ ముందడుగు 22 రకాల నిత్యావసర వస్తువుల ధరల పర్యవేక్షణకు యాప్ ను ప్రారంభించిన వినియోగదారుల వ్యవహారాల విభాగం

దేశం వివిధ ప్రాంతాలలో 127 కేంద్రాల నుంచి టోకు చిల్లర ధరలపై తాజాసమాచారం సగటు ధరలను లెక్కించడానికి సామర్ధ్యం కలిగిన జియో ట్యాగ్ చేయబడిన యాప్

యాప్ సహకారంతో నిత్యావసర వస్తువుల ధరల పర్యవేక్షణ, విశ్లేషణ మరింత పటిష్టంగా నియంత్రణ, పర్యవేక్షణకు వినియోగదారుల వ్యవహారాల విభాగానికి సాంకేతిక సహకారం అందించడానికి డిఈఎ సంసిద్ధత

Posted On: 28 FEB 2021 2:13PM by PIB Hyderabad

మొబైల్ యాప్ ద్వారా 22 రకాల నిత్యావసర వస్తువుల ధరల అంచనా వేసి వాటిని విశ్లేషించడంలో భారత్ ముందడుగు వేసింది. వినియోగదారుల వ్యవహారాల విభాగం రూపొందించిన యాప్ ద్వారా దేశం వివిధప్రాంతాలలో వున్న 127 కేంద్రాల నుంచి నిత్యావసర వస్తువుల ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ వాటిని విశ్లేషించే కార్యక్రమం దేశంలో అమలు జరుగుతోంది.


వస్తువుల ధరలపై రోజువారీగా సమాచారం అందిస్తున్న కేంద్రాలకు ధరల వివరాలను ఖచ్చితంగా అందించడానికి వినియోగదారుల వ్యవహారాల విభాగం 2021 జనవరి 21వ తేదీన మొబైల్ యాప్ ను ఆవిష్కరించింది.


ఈ యాప్ ద్వారా మరింత సమర్ధంగా ధరలను పర్యవేక్షించి విశ్లేషించడానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించాలని  డిఈఎ కు, కరెస్ పథకం కింద నిధులను విడుదల చేయాలని కోరుతూ  వినియోగదారుల వ్యవహారాల విభాగం
ప్రతిపాదనలను పంపింది.


సాంకేతిక సహాయంతో ప్రస్తుత ధరల  పర్యవేక్షణ పోర్టల్ ను మరింత మెరుగు పరచి ,ధరల నివేదిక కేంద్రాలు, ధర పర్యవేక్షణ సెల్ సామర్ధ్యాన్ని పెంపొందించడంతో పాటు  ఆహార వస్తువుల సరఫరా వ్యవస్థను పటిష్టం చేసి దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మార్కెట్ సామర్ధ్యాన్ని మెరుగుపరచాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు డిఇఓ ఆమోదం తెలిపింది. 22 రకాల నిత్యావసర వస్తువులు... బియ్యం, గోధుమలు, అట్టా (గోధుమలు), గ్రామదళ్,కందిపప్పు  / అర్హార్ దళ్, మినపప్పు, మూంగ్ దళ్, పెసరపప్పు , చక్కెర, పాలు, వేరుశనగ నూనె, ఆవ నూనె  , వనస్పతి, సోయా ఆయిల్, పొద్దుతిరుగుడు నూనె, పామాయిల్, గుర్, టీ, ఉప్పు, బంగాళాదుంప, ఉల్లిపాయ మరియు టమోటా ధరలను వినియోగదారుల వ్యవహారాల విభాగం పర్యవేక్షిస్తూ విశ్లేషిస్తుంది.


చిల్లర మరియు టోకు ధరల రోజువారీ నివేదికను దేశవ్యాప్తంగా రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరా విభాగాలలో ఉన్న 127 ధర రిపోర్టింగ్ కేంద్రాల నుంచి తీసుకుంటున్నారు.   బఫర్ నుండి నిల్వలను విడుదల చేయడం,  ఎగుమతి-దిగుమతి విధానం రూపొందించడానికి  రోజువారీ ధరల నివేదిక మరియు సూచిక ధరల పోకడలు విశ్లేషించబడతాయి.


మొబైల్ యాప్ ను జియో టాగ్ చేయడం వల్ల మార్కెట్ వున్న ప్రాంతం నుంచి ధరలను తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. నివేదికలో ధరల నివేదిక అందే మార్కెట్ ప్రాంతం కూడా తెలుస్తుంది. యాప్ ను ఉపయోగించడం వల్ల కార్యాలయాల్లో కూర్చుని నివేదికలను పంపడానికి అవకాశం ఉండదు.  మొబైల్ యాప్‌ ద్వారా సమాచారాన్ని పంపడానికి ధరల నివేదికలో మార్కెట్ వున్న ప్రాంతం, మార్కెట్ లో వున్న దుకాణాలు, మార్కెట్ల వివరాలను తప్పనిసరిగా పొందుపరచవలసి
ఉంటుంది.


రిటైల్ ధర నివేదికల  మార్గదర్శకాల ప్రకారం ఒకే రకమైన వస్తువుల ధరలను మూడు మార్కెట్ల నుంచి సేకరించవలసి ఉంటుంది.  అధిక ఆదాయ మార్కెట్, మధ్య ఆదాయ మార్కెట్ మరియు తక్కువ ఆదాయ మార్కెట్ల నుంచి సేకరించే మూడు ధరల  సగటు ధరను నివేదికలో పొందుపరచడం జరుగుతుంది. ధరలను, సగటు ధరను మొబైల్ యాప్ లెక్కించగలుగుతుంది దీనివల్ల గణనలో మానవ తప్పిదాలను నివారించడానికి అవకాశం కలుగుతుంది.


ధరల విశ్లేషణలో అగ్మార్క్‌నెట్, అగ్రివాచ్, నాఫెడ్ మరియువాణిజ్య సంఘాల నుంచి అందే సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.  మార్కెట్ సమాచార సేకరణ  ధరల అంచనా విశ్లేషణ మరియు ధర అంచనా నమూనాను అభివృద్ధి చేయడానికి అగ్రివాచ్ సేవలను ఈ విభాగం ఉపయోగిస్తోంది.

***


(Release ID: 1701543) Visitor Counter : 294