పర్యటక మంత్రిత్వ శాఖ

కోవిడ్ అన్‌లాక్ దశ నేపథ్యంలో దేఖో అప్నా దేశ్ ప్రచారంలో భాగంగా పర్యాటక మంత్రిత్వ శాఖ వివిధ పర్యాటక ప్రదర్శనలను నిర్వహిస్తోంది

Posted On: 28 FEB 2021 10:33AM by PIB Hyderabad

భారతదేశం ఇప్పుడు అన్‌లాక్ దశలో ఉన్నందున కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖతో పాటు ఆ శాఖ క్షేత్ర కార్యాలయాలు దేఖో అప్నాదేశ్ ప్రచారం కింద వివిధ పర్యాటక ప్రోత్సాహక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఆయా విభాగాల సిబ్బందితో పాటు ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో దేశంలోని వివిధ పర్యాటక ప్రదర్శనలను మరియు ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.


పర్యాటక మంత్రిత్వ శాఖ ఇండియన్ టూరిజం కొచ్చి కార్యాలయం కేరళ హోన్ స్టేస్ అండ్ టూరిజం సొసైటీ (హాట్స్) తో కలిసి హోమ్‌స్టే / బి అండ్ బి యూనిట్ల కోసం  ఒక వర్క్‌షాప్‌ను ఇటీవల నిర్వహించింది. ఈ వర్క్‌షాప్‌లో ఆతిథ్య పరిశ్రమ కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన నిధి & సాతి కార్యక్రమంపై సమాచారం అందించారు. ఈ వర్క్‌షాప్‌లో కొచ్చితో పాటు పొరుగు జిల్లాలకు చెందిన 54 హోమ్‌స్టేలు / బి అండ్ బి యూనిట్ యజమానులు పాల్గొన్నారు. మరో కార్యక్రమంలో ఇండియాటూరిజం కొచ్చి, జిల్లా పర్యాటక ప్రోత్సాహక మండలి ఎర్నాకుళంతో కలిసి కేరళ  13 వ ఎడిషన్ ఉల్సవం యొక్క ఉత్సవ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించింది. కేరళ యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవంలో కేరళకు చెందిన  28 కళా రూపాలు ప్రదర్శించారు. ఇందులో 200 మంది కళాకారులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాన్ని పార్లమెంటు సభ్యుడు శ్రీ హిబీ ఈడెన్ నేతృత్వంలో కొచ్చిన్ కార్పొరేషన్ మేయర్ ప్రారంభించారు.


(ఇండియాటూరిజం  కార్యాలయం, కొచ్చి)


భారత పర్యాటక మంత్రిత్వ శాఖ బెంగళూరు కార్యాలయం “దేఖో అప్నాదేశ్” చొరవతో ఉత్తర ప్రదేశ్ లోని బౌద్ధ సర్క్యూట్లు మరియు పుణ్యక్షేత్రాల పర్యాటక ప్రదేశాలపై అవగాహన కల్పించడానికి  2021 ఫిబ్రవరి 22 న బెంగళూరులో దేశీయ పర్యాటక రోడ్ షోను నిర్వహించింది. బౌద్ధ ఇన్‌బౌండ్ టూరిజం ఫ్రాటెర్నిటీ (బిఐటిఎఫ్) నుండి 16 టూర్ ఆపరేటర్లు రోడ్‌షోలో పాల్గొన్నారు. అలాగే కర్ణాటక ట్రావెల్ ఏజెంట్లు / టూర్ ఆపరేటర్లతో బి 2 బి సమావేశాలు జరిగాయి.


(ఇండియాటూరిజం కార్యాలయం, బెంగళూరు )

2021 ఫిబ్రవరి 23-24 వరకూ పూణేలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ (ఐఐటిఎమ్) లో పర్యాటక మంత్రిత్వ శాఖ, ముంబై కార్యాలయం  పాల్గొంది. కార్యక్రమంలో భాగంగా భారతదేశంలోని వివిధ పర్యాటక ఉత్పత్తులను ప్రదర్శించింది. అలాగే సందర్శకులకు అవసరమైన సమాచారాన్ని అందించింది. వెస్ట్రన్ రీజియన్‌లో ఇది 2 వ ప్రదర్శన. పర్యాటక ప్రదేశాలను తిరిగి తెరిచిన తర్వాత ఇండియాటూరిజం ముంబై ఫిజికల్ మోడ్‌లో పాల్గొంటుంది.

పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క ఇండియాటూరిజం హైదరాబాద్ మరియు వారణాసి కార్యాలయాలు సంయుక్తంగా "ఉత్తర ప్రదేశ్ సందర్శించండి" అనే పేరుతో రోడ్‌షోను 2021 ఫిబ్రవరి 24 న హైదరాబాద్‌లో దేఖో అప్నా దేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాయి. బౌద్ధ ఇన్‌బౌండ్ టూరిజం ఫ్రాటెర్నిటీ (బిఐటిఎఫ్) నుండి 17 మంది ట్రావెల్ ట్రేడ్ ప్రతినిధులు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి ట్రావెల్ ట్రేడ్‌ రోడ్‌షోలో పాల్గొన్నారు.


(ఇండియాటూరిజం కార్యాలయం- హైదరాబాద్ & వారణాసి)

పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా టూరిజం ఢిల్లీ కార్యాలయం సుందర్ నర్సరీకి ప్రాంతీయ స్థాయి గైడ్‌ల కోసం ఫీల్డ్ ట్రిప్ కమ్ బూరల్ ఆఫ్ మోరల్ నిర్వహించింది. ఇందులో 70 ఆర్‌ఎల్‌జి పాల్గొంది.  దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో పర్యాటక మంత్రిత్వ శాఖ చొరవ గురించి మరియు వారి అనుభవాన్ని పంచుకోవడంలో ఆర్‌ఎల్‌జీలు పాల్గొనడం గురించి ప్రాంతీయ డైరెక్టర్ వారికి వివరించారు. నేతాజీ సుభాస్ చంద్రబోస్ జీవితంపై క్విజ్ పోటీ కూడా వారి కోసం నిర్వహించారు.


(ఇండియాటూరిజం కార్యాలయం, ఢిల్లీ)

నదీ టూరిజంపై వర్క్‌షాప్ 2021 ఫిబ్రవరి 22 న గువహటిలో పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఈ వర్క్‌షాప్‌లో 35 మంది వాటాదారులు పాల్గొన్నారు.  ఈశాన్య ప్రాంతంలో మరియు భారతదేశంలో రివర్ క్రూయిసెస్ / క్రూయిస్ టూరిజం యొక్క ప్రాముఖ్యతను ఈ కార్యక్రమంలో వివరించారు.


(ఇండియాటూరిజం కార్యాలయం, గువహటి)



(Release ID: 1701495) Visitor Counter : 151