ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులు కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, తమిళనాడు, గుజరాత్ లో పెరుగుదల
కోవిడ్ కేసులు పెరుగుతున్న 8 రాష్ట్రాలతో సమీక్షిస్తున్న కాబినెట్ కార్యదర్శి
Posted On:
27 FEB 2021 11:46AM by PIB Hyderabad
భారతదేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 1,59,590 కు చేరింది. ఇది ఇప్పటివరకు నమోదైన మొత్తం కోవిడ్ కేసులలో 1.44%. ఆరు రాష్టాలు – మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్నాటక, తమిళనాడు, గుజరాత్ గత 24 గంటలలో కొత్త కేసులు పెరగటానికి కారణమయ్యాయి. మహారాష్ట్రలో అత్యధిక కోవిడ్ కేసులు నమోదు కావటం కొనసాగుతోంది. ఒక్క రోజులో 8,333 కేసులు రాగా కేరళలో 3,671, పంజాబ్ లో 622 నమోదయ్యాయి. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 16,488 కొత్త కేసులు నమోదయ్యాయి. అందులో 85.75% కేసులు కేవలం ఆరు రాష్ట్రాలకు చెందినవే కావటం గమనార్హం.
ఎనిమిది రాష్ట్రాలు రోజువారీ కొత్త కేసులలో పెరుగుదల చూపుతున్నాయి.
గత రెండు వారాలలో కేరళలో చికిత్సలో ఉన్న కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఫిబ్రవరి 14న 63,847 కేసులు ఉండగా నేడు ఆ సంఖ్య 51,679కు చేరింది. అదే సమయంలో మహారాష్ట్రలో పెరుగుదల అత్యధికంగా నమోదైంది. ఫిబ్రవరి 14న అది 34,449 ఉండగా నేటికి 68,810 కి చేరింది.
కాబినెట్ కార్యదర్శి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిపి కేసులు పెరుగుతున్న రాష్ట్రాలతో పరిస్థితి సమీక్షించాలని నిర్ణయించారు. ఆ రాష్ట్రాలలో తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, జమ్మూ-కశ్మీర్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన తాత్కాలిక సమాచారం ప్రకారం మొత్తం 2,92,312 శిబిరాల ద్వారా 1,42,42,547 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో మొదటి డోస్ అందుకున్న 66,68,974 మంది ఆరోగ్య సిబ్బంది, 24,53,878 మంది రెండో డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, 51,19,695 మంది మొదటి డోస్ అందుకున్న కోవిడ్ యోధులు ఉన్నారు. 2021 ఫిబ్రవరి 13న రెండో డోస్ మొదలుకాగా మొదటి విడత టీకాలు తీసుకొని 28 రోజులు గడిచిన ఆరోగ్య సిబ్బంది దీనికి అర్హులయ్యారు. కోవిడ్ యోధులకోసం ఫిబ్రవరి2న టీకాలు మొదలయ్యాయి.
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం
|
టీకా లబ్ధిదారులు
|
మొదటి డోస్
|
రెండో డోస్
|
మొత్తం డోసులు
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
6,134
|
2,422
|
8,556
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
5,29,607
|
1,39,337
|
6,68,944
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
25,379
|
6,741
|
32,120
|
4
|
అస్సాం
|
1,95,906
|
27,675
|
2,23,581
|
5
|
బీహార్
|
5,60,158
|
79,212
|
6,39,370
|
6
|
చండీగఢ్
|
20,890
|
1,712
|
22,602
|
7
|
చత్తీస్ గఢ్
|
3,77,834
|
51,791
|
4,29,625
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
5,352
|
432
|
5,784
|
9
|
డామన్, డయ్యూ
|
2,371
|
287
|
2,658
|
10
|
ఢిల్లీ
|
3,72,906
|
37,053
|
4,09,959
|
11
|
గోవా
|
18,722
|
2,072
|
20,794
|
12
|
గుజరాత్
|
8,33,722
|
1,67,448
|
10,01,170
|
13
|
హర్యానా
|
2,21,841
|
71,983
|
2,93,824
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
1,01,504
|
20,924
|
1,22,428
|
15
|
జమ్మూ, కశ్మీర్
|
2,40,817
|
16,255
|
2,57,072
|
16
|
జార్ఖండ్
|
2,84,371
|
23,837
|
3,08,208
|
17
|
కర్నాటక
|
6,04,954
|
2,13,768
|
8,18,722
|
18
|
కేరళ
|
4,82,445
|
1,04,866
|
5,87,311
|
19
|
లద్దాఖ్
|
9,226
|
829
|
10,055
|
20
|
లక్షదీవులు
|
2,368
|
710
|
3,078
|
21
|
మధ్యప్రదేశ్
|
6,50,684
|
1,60,632
|
8,11,316
|
22
|
మహారాష్ట్ర
|
10,41,97
|
1,60,233
|
12,02,180
|
23
|
మణిపూర్
|
52,420
|
2,545
|
54,965
|
24
|
మేఘాలయ
|
30,465
|
1,726
|
32,191
|
25
|
మిజోరం
|
21,997
|
5,659
|
27,656
|
26
|
నాగాలాండ్
|
29,806
|
5,497
|
35,303
|
27
|
ఒడిశా
|
4,60,554
|
1,58,267
|
6,18,821
|
28
|
పుదుచ్చేరి
|
9,920
|
1,224
|
11,144
|
29
|
పంజాబ్
|
1,54,449
|
36,351
|
1,90,800
|
30
|
రాజస్థాన్
|
7,98,447
|
2,24,760
|
10,23,207
|
31
|
సిక్కిం
|
16,951
|
1,361
|
18,312
|
32
|
తమిళనాడు
|
3,88,896
|
56,432
|
4,45,328
|
33
|
తెలంగాణ
|
2,89,772
|
1,30,019
|
4,19,791
|
34
|
త్రిపుర
|
89,449
|
21,529
|
1,10,978
|
35
|
ఉత్తరప్రదేశ్
|
11,70,925
|
3,10,058
|
14,80,983
|
36
|
ఉత్తరాఖండ్
|
1,42,340
|
19,446
|
1,61,786
|
37
|
పశ్చిమబెంగాల్
|
9,61,416
|
1,44,765
|
11,06,181
|
38
|
ఇతరములు
|
5,81,724
|
44,020
|
6,25,744
|
మొత్తం
|
1,17,88,669
|
24,53,878
|
1,42,42,547
|
టీకాల కార్యక్రమం మొదలైన 42వ రోజైన ఫిబ్రవరి 27న మొత్తం 7,64,904 టీకా డోసులిచ్చారు. అందులో 3,49,020 మంది లబ్ధిదారులకు 13,397 శిబిరాలలో మొదటి డోస్ ( ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు) ఇవ్వగా 4,20,884 మంది ఆరోగ్య సిబ్బందికి రెండో డోస్ ఇచ్చారు. రెండో డోస్ తీసుకున్నవారిలో 62.75% మంది ఎనిమిది రాష్ట్రాలకు చెందినవారున్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 12.64% (3,10,058) మంది టీకాలు తీసుకున్నారు.
మొదటి డోస్ కు రిజిస్టర్ చేసుకున్న ఆరోగ్య సిబ్బందిలో 60% కంటే తక్కువ మంది టీకలు తీసుకున్న రాష్టాలు 9 ఉన్నాయి. అవి : అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, లద్దాఖ్, చండీగఢ్, నాగాలాండ్, పంజాబ్, పుదుచ్చేరి.
కోవిడ్ యోధులలో 65% పైగా మొదటి డోస్ తీసుకున్న రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 12 ఉన్నాయి. అవి: లద్దాఖ్, ఉత్తరాఖండ్, చత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశామ్ త్రిపుర, మధ్యప్రదేశ్, గుజరాత్, లక్షదీవులు, రాజస్థాన్, కేరళ, దాద్రా-నాగర్ హవేలి
12 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కొవిడ్ యోధులలో 40% లోపు మంది మాత్రమే టీకాలు తీసుకున్నారు. అవి: పుదుచ్చేరి, అండమాన్-నికోబార్ దీవులు, మేఘాలయ, అస్సాం, తమిళనాడు, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, నాగాలాండ్, గోవా, మిజోరం.
ఇప్పటిదాకా కోవిడ్ నుంచి 1,07,63,451మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 12,771 మంది కోలుకోగా భారత్ లో కోలుకున్నవారి శాతం 97.17%. ఇది ప్రపంచంలోనే అత్యధికం. కొత్తగా కోలుకున్నవారిలో 84.79% మంది ఆరు రాష్టాల్లోనే కేంద్రీకృతమై ఉన్నారు. మహారాష్ట్రలో ఒక రోజులో అత్యధికంగా 4,936 మంది కోలుకోగా కేరళలో 4,142మంది, కర్నాటకలో 642 మంది కోలుకున్నారు.
గత 24 గంటలలో 113 మరణాలు నమోదయ్యాయి. అందులో 82.3% ఆరు రాష్ట్రాల్లోనే కాగా మహారాష్ట్రలో 48 మంది, పంజాబ్ లో 15 మంది, కేరళలో 14 మంది చనిపోయారు.
గత 24 గంటలలో 17 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: గుజరాత్, ఒడిశా, చందీగఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, మణిపూర్, మిజోరం, లక్షదీవులు, లద్దాఖ్, సిక్కిం, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, అండమాన్-నికోబార్ దీవులు. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్
****
(Release ID: 1701406)
|