సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
'సమాచార సాంకేతికత (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళి) నిబంధనలు-2021' కింద సమాచార నిరోధం
Posted On:
27 FEB 2021 4:27PM by PIB Hyderabad
'సమాచార సాంకేతికత (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళి) నిబంధనలు-2021', డిజిటల్ మీడియా వ్యవస్థపై వార్త ప్రచురణ సంస్థలు, ఓటీటీ మాధ్యమాలకు సంస్థాగత విధానాన్ని అందిస్తాయి. అత్యవసర పరిస్థితి వంటి సందర్భంలో, 'సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ' కార్యదర్శి మధ్యంతర నిషేధ ఆదేశాలు జారీ చేయవచ్చన్న 'నిబంధనల మూడో భాగంలోని 16వ నిబంధన'పై కొన్ని సందేహాలు తలెత్తాయి.
'సమాచార సాంకేతికత (ప్రజలు సమాచారం పొందకుండా నిరోధించే విధానం, భద్రతలు) నిబంధనలు-2009' ప్రకారం గత పదకొండేళ్లుగా 'ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ' కార్యదర్శి పైన పేర్కొన్న నిబంధనను అమలు చేస్తున్నట్లు తెలియజేయడమైనది.
'సమాచార సాంకేతికత (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళి) నిబంధనలు-2021'లోని మూడో భాగం 'సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ' ద్వారా అమలవుతుంది కాబట్టి, 'ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ' కార్యదర్శి ఇచ్చిన సూచనను 'సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ' కార్యదర్శి భర్తీ చేశారు.
కొత్తగా నిబంధన రూపొందించలేదు.
***
(Release ID: 1701399)
Visitor Counter : 220