ప్రధాన మంత్రి కార్యాలయం

తమిళ నాడు డాక్టర్ ఎమ్‌.జి.ఆర్. వైద్య విశ్వ‌విద్యాల‌యం 33వ స్నాత‌కోత్స‌వం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగ పాఠం

పిఐబి, దిల్లీ ద్వారా 2021 ఫిబ్రవరి 26న మ‌ధ్యాహ్నం 12:14 గంటల కు పోస్టు చేయడమైంది

Posted On: 26 FEB 2021 12:14PM by PIB Hyderabad

త‌మిళ‌ నాడు గ‌వ‌ర్న‌ర్‌, ఈ విశ్వ‌విద్యాల‌యం చాన్స్ లర్ శ్రీ బన్ వారీలాల్ పురోహిత్, వైస్ చాన్స్ లర్ సుధా శేష‌య్య‌న్‌, అధ్యాప‌కులు, సిబ్బంది, నా ప్రియ విద్యార్థులారా,

మీరు ఈ విశ్వ‌విద్యాల‌యం 33వ స్నాత‌కోత్స‌వాన్ని జరుపుకొంటూ ఉండగా, వైద్యం, దంత వైద్యం, ఆయుష్‌, పారామెడిక‌ల్ విభాగాల లో డిగ్రీల‌ ను, డిప్లొమా ల‌ను అందుకోబోతున్న వేళ మీతో భేటీ కావ‌డం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది.  ఈ రోజు న 21 వేల మంది అభ్య‌ర్థుల కు పైగా డిగ్రీల‌ ను, డిప్లొమా ల‌ను ప్ర‌దానం చేయ‌డం జ‌రుగుతోంద‌ని నా దృష్టి కి తీసుకు వ‌చ్చారు.  అయితే, నేను ప్ర‌త్యేకం గా ప్ర‌స్తావించ‌వ‌ల‌సిన య‌థార్థమంటూ ఒకటి ఉంది.  ఈ సంఖ్య‌లు సూచిస్తున్న ప్రకారం సుమారు 30 శాతం మంది పురుషులు కాగా 70 శాతం మంది వ‌ర‌కు మ‌హిళ‌లు.  ప‌ట్ట‌భ‌ద్రులైన వారిని అంద‌రిని నేను అభినందిస్తున్న క్ర‌మం లో, నేను మ‌హిళా అభ్య‌ర్థుల విష‌యం లో వారిని ప్ర‌త్యేకం గా అభినందిస్తున్నాను కూడా.  ఏ రంగం లో అయినా మ‌హిళ‌లు ముందు ఉండి నాయ‌క‌త్వం వ‌హించ‌డం అనేది ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మైందే.  ఇది జ‌రిగిన‌ప్పుడు అది ఒక గ‌ర్వ‌కార‌క‌మైన, ఆనంద‌దాయ‌క‌మైన త‌రుణం అవుతుంది.

మిత్రులారా,

మీరంతా సాధించిన సాఫ‌ల్యం, ఈ సంస్థ సాధించిన సాఫ‌ల్యం మ‌హ‌నీయుడు ఎమ్‌ జిఆర్ కు ఎంతో సంతోషాన్ని ఇచ్చి ఉంటాయి.  

ఆయ‌న పాల‌న అంతా పేద‌ల ప‌ట్ల క‌రుణ‌ తో నిండిపోయింది.  ఆరోగ్య సంర‌క్ష‌ణ, విద్య, మ‌హిళ‌లకు సాధికారిత కల్పన అనేవి ఆయ‌న‌ కు ప్రీతి ని క‌లిగించేవి.   ఎమ్‌ జిఆర్ జ‌న్మించిన శ్రీ లంక కు నేను కొన్ని సంవ‌త్స‌రాల కింద‌ట వెళ్ళాను.  శ్రీ లంక లో ఆరోగ్య రంగం లో మ‌న త‌మిళ సోద‌రీమ‌ణులు, సోద‌రుల కోసం కృషి చేస్తూ ఉండ‌ట‌మ‌నేది భార‌త‌దేశాని కి ద‌క్కిన ఒక గౌర‌వం.  భార‌త‌దేశం ఆర్థిక స‌హాయాన్ని అందించిన ఒక ఉచిత ఎమ్‌బ్యులన్స్ స‌ర్వీసు ను త‌మిళ స‌ముదాయం విరివి గా ఉప‌యోగించుకొంటోంది.  డికోయా  లో ఆసుప‌త్రి ప్రారంభోత్స‌వాన్ని నేను ఎన్న‌టికీ మ‌రువలేను.  అది ఎంత మందికో సాయ‌ప‌డేట‌టువంటి ఆధునిక వైద్య శాల‌.  ఆరోగ్య సంర‌క్ష‌ణ దిశ లో సాగుతున్న ఈ ప్ర‌య‌త్నాలు.. అది కూడాను త‌మిళ స‌ముదాయాన్ని ఉద్దేశించి జ‌రుపుతున్న ఈ ప్ర‌యాస‌ లు.. ఎమ్‌ జిఆర్ కు ఎంతో సంతోషాన్ని ఇచ్చి ఉంటాయి.
 
విద్యార్థి మిత్రులారా,

మీరు జీవితం లో ఒక ముఖ్య‌మైన ద‌శ నుంచి మ‌రొక ముఖ్య‌మైన ద‌శ కు ప‌రివ‌ర్త‌న చెందే కాలమిది.

ఈ కాలం లో మీరు నేర్చుకోవ‌డం నుంచి న‌యం చేసే దిశ గా ప‌య‌నిస్తారు.  ఇది మీరు మీ ప‌రీక్ష‌ల‌ లో మార్కులు సంపాదించుకొనే ద‌శ నుంచి స‌మాజం లో ఒక స్థాయి ని సంపాదించుకొనే ద‌శ కు పయనించే త‌రుణం.
 
మిత్రులారా,

కోవిడ్-19 మ‌హ‌మ్మారి అనేది ప్ర‌పంచం లో ఎంత మాత్ర‌మూ ఊహించ‌న‌టువంటి ప‌రిణామం అని చెప్పాలి.  దేనికీ ముంద‌స్తుగా నిర్దేశించిన సూత్రం అంటూ లేదు.  అటువంటి కాలం లో భార‌త‌దేశం ఒక కొత్త దారి ని ఏర్ప‌ర‌చ‌డం ఒక్క‌టే కాకుండా అందులో ఇత‌రులు సైతం న‌డ‌వ‌టానికి తోడ్ప‌డింది.  భార‌త‌దేశం లో అతి త‌క్కువ గా మ‌ర‌ణాల రేటు లు న‌మోదు అయ్యాయి.  రిక‌వ‌రీ రేటు లు కూడా అధికం గా ఉన్నాయి.  భార‌త‌దేశం ప్ర‌పంచం కోసం మందుల ను, టీకా మందుల‌ ను ఉత్పత్తి చేస్తోంది.  భార‌త‌దేశ వైద్య వృత్తి నిపుణుల‌న్నా, శాస్త్రవేత్త‌లన్నా , ఔష‌ధ నిర్మాణ రంగ వృత్తి నిపుణులన్నా గొప్ప గౌర‌వం, అభిమానం వ్య‌క్త‌మ‌వుతున్న కాలం లో మీరు ప‌ట్ట‌భ‌ద్రులు అవుతున్నారు.  మొత్తం మీద భార‌త‌దేశ హెల్థ్‌ ఇకోసిస్ట‌మ్ ను ఇంత వ‌ర‌కు చూసిన ప‌ద్ధ‌తి లో కాకుండా కొత్త దృష్టి కోణం తో, కొత్త‌దైన గౌర‌వం తో, వినూత్న‌మైన విశ్వ‌స‌నీయ‌త తో గ‌మ‌నించ‌డం జ‌రుగుతోంది.  ఏమైనప్పటికీ, దీని అర్థం ప్ర‌పంచానికి మీ పైన గొప్ప అంచ‌నాలు ఉన్నాయి అని కూడా చెప్పుకోవాలి.  ఇది యువ‌కులైన మీ భుజాల మీద వ‌చ్చి ప‌డిన ఒక బాధ్య‌త‌.  ఈ మ‌హ‌మ్మారి నేప‌థ్యం లో నేర్చుకొన్న అంశాలు టిబి వంటి ఇత‌ర వ్యాధుల తో మ‌న పోరాటం లో సాయం చేస్తాయి
 
మిత్రులారా,

తిరువళ్ళువ‌ర్ అన్నారు.. జ‌బ్బుపడ్డ వారు, వైద్యుడు, మందు, ఉప‌చారం చేసే వ్య‌క్తి.. ఈ నాలుగింటి ని చికిత్స తనలో ఇముడ్చుకొంటుంది అని.  మ‌హ‌మ్మారి కొన‌సాగుతూ వ‌చ్చిన‌టువంటి కాలం లోనే అంత వ‌ర‌కు ఉన్న స్థితి ఒక్క‌సారిగా మారిపోయిన క్ర‌మం లో కూడా ఈ నాలుగు స్తంభాల లో ప్ర‌తి ఒక్క స్తంభం అజ్ఞాత శ‌త్రువు తో యుద్ధం చేయ‌డం లో అగ్ర‌భాగాన నిల‌చింది.  వైర‌స్ తో పోరాడిన వారంద‌రూ మాన‌వ జాతి క‌థానాయ‌కులు గా పేరు తెచ్చుకొన్నారు.

మిత్రులారా,

మేము యావ‌త్తు వైద్య విద్య‌ ను, ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగాన్ని మార్చుతున్నాము.  నేశ‌న‌ల్ మెడిక‌ల్ క‌మిశ‌న్ గొప్ప పారద‌ర్శ‌క‌త‌ ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది.  అది కొత్త వైద్య క‌ళాశాల‌ ల‌ను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన నియ‌మాల‌ ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తుంది.  అది ఈ రంగం లో మాన‌వ వ‌న‌రుల వాసి ని, రాశి ని కూడా మెరుగు ప‌రుస్తుంది.  గ‌త ఆరేళ్ళ లో ఎంబిబిఎస్ సీట్లు 30 వేల కు పైగా పెరిగాయి.  ఇది 2014వ సంవత్సరం నుంచి చూస్తే 50 శాతం క‌న్నా ఎక్కువ వృద్ధి అవుతోంది.  పిజి సీట్ల సంఖ్య 24 వేల వ‌ర‌కు పెరిగింది.  ఇది 2014వ సంవత్సరం నుంచి చూస్తే సుమారుగా 80 శాతం వృద్ధి గా లెక్క‌ కు వ‌స్తుంది.

2014వ సంవ‌త్స‌రం లో దేశం లో ఎఐఐఎమ్ఎస్ లు 6  ఉండగా,  గ‌త 6 సంవ‌త్స‌రాల‌ లో మేము దేశ‌వ్యాప్తం గా మ‌రో 15 ఎఐఐఎమ్ఎస్ ల‌కు ఆమోదం తెలిపాము.  త‌మిళ‌ నాడు వైద్య విద్య‌కు గాను ప్ర‌సిద్ధి ని పొందింది.  ఈ రాష్ట్రం లోని మ‌న యువ‌త‌ కు మ‌రింత‌ గా సాయ‌ప‌డ‌టానికి గాను మా ప్ర‌భుత్వం ఈ రాష్ట్రం లో 11 కొత్త వైద్య క‌ళాశాల‌ ల స్థాప‌న కు అనుమ‌తి ఇచ్చింది.  ఈ నూత‌న వైద్య క‌ళాశాల ల‌ను ప్ర‌స్తుతానికి ఒక్క వైద్య క‌ళాశాల అయినా లేన‌టువంటి జిల్లాల‌ లో నెల‌కొల్ప‌డం జ‌రుగుతుంది.  ఒక్కొక్క క‌ళాశాల కు భార‌త ప్ర‌భుత్వం 2 వేల కోట్ల రూపాయ‌ల‌ కు పైగా నిధుల‌ ను ఇస్తుంది.

మేము బ‌డ్జెటు లో 64 వేల కోట్ల రూపాయ‌ల‌ కు పైగా వ్య‌యం తో ‘పిఎం ఆత్మ‌నిర్భ‌ర్ స్వ‌ాస్థ్ భార‌త్ యోజ‌న’ ను ప్ర‌క‌టించాం.  ఇది కొత్త వ్యాధుల ను, రూపాంత‌రం చెందుతున్న వ్యాధుల ను గుర్తించడానికి, వాటిని నయం చేయడానికి ప్రాథ‌మిక‌, మాధ్య‌మిక, తృతీయ ఆరోగ్య సంర‌క్ష‌ణ సంబంధి సామ‌ర్ధ్యాల ను పెంపొందిస్తుంది.  వైద్య ప‌ర‌మైన‌టువంటి, శ‌స్త్ర చికిత్స పరమైనటువంటి సుమారు 1600 ప్రక్రియల లో 50 కోట్ల మంది ప్ర‌జ‌ల కు నాణ్య‌మైన సంర‌క్ష‌ణ ను అందించ‌డానికి ఉద్దేశించినమ‌న ‘ఆయుష్మాన్ భార‌త్’ ప్ర‌పంచం లోనే అతి పెద్ద ఆరోగ్య భ‌రోసా కార్య‌క్ర‌మం గా ఉంది.

మందుల ను చాలా చౌక రేటుల కు అందించే విధం గా జ‌న్ ఔష‌ధీ కేంద్రాల సంఖ్య ను విస్తరించి 7000 కంటే పైకి తీసుకుపోవడమైంది.  స్టెంట్ లు, మోకాలి చిప్ప మార్పిడి పరికరాలు మొదలైన వైద్య పరికరాల ను దేశం లో బాగా చౌక అయిన‌వి గా చేసి, వాటి ద్వారా కోట్ల కొద్దీ ఆప‌న్నుల‌ కు సాయ‌ప‌డ‌టం జ‌రుగుతోంది.

మిత్రులారా,

మ‌న దేశం లో అమిత గౌర‌వాన్ని అందుకొంటున్న వృత్తి నిపుణుల‌ లో వైదులు కూడా ఉన్నారు.  ప్ర‌స్తుతం మ‌హ‌మ్మారి అనంత‌ర కాలం లో ఈ ఆద‌ర‌ణ భావం మ‌రింత అధికం అయింది.  ఈ స‌మ్మానం దేనికంటే ప్ర‌జ‌ల‌ కు మీ వృత్తి తాలూకు గంభీర‌త ఎటువంటిది అన్న‌ది తెలుసును కాబట్టి.  ఈ వృత్తి లో చాలా సార్లు ఎవ‌రో ఒక వ్య‌క్తి కి అక్ష‌రాలా చావు బ్ర‌తుకుల మ‌ధ్య ఊగిస‌లాడే స్థితి ఎదుర‌వుతుంది.  ఏమైన‌ప్ప‌టికీ గంభీరం గా ఉండ‌టం వేరు, గంభీరం గా ఉన్న‌ట్లు క‌నిపించ‌డం వేరు.  నేను మిమ్మ‌ల్ని అభ్య‌ర్ధించేది ఒక్క‌టే.. అది.. మీరు మీ లోప‌లి హాస్య‌ ప్రియ‌త్నాన్ని ప‌దిలం గా అట్టిపెట్టుకోవాలి అనేదే.  అది మిమ్మ‌ల్ని మీ రోగుల‌ ను ఉల్లాస‌ప‌రిచేందుకు కూడా మీకు సాయ‌ప‌డుతుంది.  వారి స్థైర్యాన్ని మీరు ఉన్న‌తం గా ఉంచ‌గ‌లుగుతారు.   కొంత మంది వైద్యులు వారి ప‌ని విష‌యం లో శ్రేష్ఠులుగా ఉంటూనే ఇటు రోగుల తో, అటు సిబ్బంది తో హాస్య స్పోర‌క‌మైన సంభాష‌ణల ను జ‌ర‌ప‌డం ద్వారా ఆసుప‌త్రి ప‌రిస‌రాల ను ఆహ్లాద‌క‌రం గా మార్చివేస్తూ ఉంటారు.  అటువంటి వైద్యులను నేను చూశాను. ఇది ప్ర‌జ‌ల లో ఆశ‌ ను రేకెత్తిస్తుంది.  మ‌రి వారు వ్యాధి నుంచి కోలుకోవ‌డానికి ఇది ఎంతో కీల‌కం అవుతుంది.  మీ లోప‌లి హాస్యప్రియ‌త్వాన్ని ఆరోగ్య దాయ‌కం గా అట్టిపెట్టుకోవ‌డం, స్వ‌యం గా మీకు శారీరిక‌ స్వస్థత ను, మాన‌సిక‌ ఆరోగ్యాన్ని అందిస్తుంది.  మీరు వృత్తిప‌రం గా  బాగా ఎక్కువ ఒత్తిడి ని ఎదుర్కొంటూ ఉన్న‌ప్పుడు కూడా దేశ ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని గురించి శ్ర‌ద్ధ వ‌హించే మ‌నుషులు.  మీరు మీ ఆరోగ్యం పట్ల‌, మీ శారీరక దృఢ‌త్వం ప‌ట్ల ధ్యానమగ్నులై ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ఈ ప‌ని ని చేయ‌గ‌లుగుతారు.  యోగ‌, ధ్యానం, ప‌రుగెత్త‌డం, సైకిల్ స్వారీ.. వీటిలో ఏదో ఒక నియ‌మాన్ని ఎంపిక చేసుకోండి.  అది మీ క్షేమానికి కూడా దోహ‌ద‌కారి కావాలి.

మిత్రులారా,

స్వామి వివేకానందుల వారి గురువు శ్రీ రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస అనే వారు.  ‘‘శివ జ్ఞానే జీవ సేవ’’ అని. ఈ మాట‌ల‌ కు.. ప్ర‌జ‌ల‌ కు సేవ చేయ‌డం అనేది శివుని కి లేదా దైవాని కి చేసే సేవ తో స‌మానం.. అని భావం.  ఇంత‌టి ప‌విత్ర‌మైన ఆద‌ర్శం తో అచ్చం గా జీవించే మ‌హ‌ద‌వ‌కాశం ఎవ‌రికి అయినా ల‌భించింది అంటే గ‌నుక అది వైద్య వృత్తి లోని వారికే.  మీ దీర్ఘకాల ఉద్యోగి జీవితం లో వృత్తిరీత్యా ఎద‌గండి.  అదే కాలం లో మీ స్వీయ వృద్ధి ని ఎన్న‌టికీ మ‌ర‌చిపోకండి.  స్వార్ధ‌ప‌ర‌త్వాని కి అతీతం గా వర్ధిల్లండి.  అలా చేయడం మిమ్మల్ని భ‌యం అంటే ఎరుగ‌ని వారు గా తీర్చిదిద్దుతుంది.

మిత్రులారా,

ఈ రోజు న డిగ్రీల ను సంపాదించుకొన్న వారికి మ‌రొక్క‌ సారి అభినంద‌న‌ లు.  ఈ మాట‌ల తో నేను నా ప్ర‌సంగాన్ని ముగిస్తున్నాను.  ఈ ఉత్సాహ‌భ‌రిత‌మైన‌టువంటి త‌రుణం లో ఒక ఉద్దేశ్య‌భ‌రిత‌మైన‌టువంటి, ఆశ్చ‌ర్య‌జ‌న‌క‌మైన‌టువంటి, త‌ర‌చుగా స‌వాళ్ళ ను రువ్వే‌ట‌టువంటి జీవిత గ‌మ‌నం మిమ్మ‌ల్ని వ‌రించాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను.
 

మీకు నా ధ‌న్య‌వాదాలు.




 

***


(Release ID: 1701102) Visitor Counter : 206