ప్రధాన మంత్రి కార్యాలయం

"2025 నాటికి క్షయ రహిత భారతదేశం" - ప్రధాన మంత్రి స్వప్నం

క్షయవ్యాధికి వ్యతిరేకంగా జన్-ఆందోళన్ ప్రారంభించడం కోసం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన - డాక్టర్ హర్ష వర్ధన్

"2021 ని క్షయ వ్యాధి నివారణ సంవత్సరంగా పాటించాలని అనుకుంటున్నాము"

Posted On: 24 FEB 2021 6:19PM by PIB Hyderabad

క్షయవ్యాధికి వ్యతిరేకంగా, సలహా, సమాచార ప్రసారం, సామాజిక సమీకరణ (ఏ.సి.ఎస్.ఎం) విధానం ద్వారా, జన్-ఆందోళన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, ఇతర అభివృద్ధి భాగస్వాములతో, ఈ రోజు, నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశానికి,  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, అధ్యక్షత వహించారు. 

ముందుగా డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ, క్షయ వ్యాధిని ఎదుర్కోవడంలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (ఎన్.‌టి.ఈ.పి) కింద భారత ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలను వివరించారు. "2021 ని క్షయ వ్యాధి నివారణ సంవత్సరంగా పాటించాలని అనుకుంటున్నాము" అని మంత్రి ప్రకటిస్తూ, గత కొన్నేళ్లుగా రోగులందరికీ ఉచిత ఖర్చుతో, అధిక నాణ్యత గల టి.బి. సంరక్షణ కల్పించడంలో, దేశం సాధించిన అద్భుతమైన పురోగతిని వివరించారు.  ఈ ప్రయోజనాలు, సేవలకు డిమాండు పెరిగి, వ్యాధిని తగ్గించడంతో పాటు, 2025 నాటికి టి.బి. రహిత భారతదేశాన్ని ఏర్పాటు చేయాలనే  లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడతాయని, ఆయన తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వ్యాధిని సమగ్రంగా పరిష్కరించడానికి కొత్త విధానాల యొక్క ప్రాముఖ్యత గురించీ, టి.బి.  రహిత భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి వేగవంతమైన, నిరంతర దృష్టి పెట్టవలసిన అవసరాన్ని గురించీ, కేంద్ర మంత్రి, ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, "టి.బి. నిర్వహణ మరియు సేవలు అందించడాన్ని, మరింత బలోపేతం చేయడానికి, జాతీయ క్షయ నివారణ కార్యక్రమం, ఎప్పటికప్పుడు, తన ప్రయత్నాలను పెంచుతూనే ఉంది. అయితే, పెద్ద సంఖ్యలో ప్రజలు, ప్రజాస్వామ్యం యొక్క సారాన్ని ఉపయోగించి,  అవగాహన కల్పన ద్వారా జన్-ఆందోళన్ యొక్క స్ఫూర్తి, ఆయా వర్గాలలో ప్రవర్తన కోరుకునే ఆరోగ్య సంరక్షణ ప్రోత్సాహంతో పాటు, టి.బి. కళంకాన్ని పోగొట్టుకున్నప్పుడు మాత్రమే,  వ్యాధికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం విజయవంతమవుతుంది.", అని పేర్కొన్నారు.  టి.బి. ప్రతిస్పందన యొక్క వివిధ దశల్లో కమ్యూనిటీలతో పాటు, కమ్యూనిటీ-ఆధారిత సమూహాల పూర్తి భాగస్వామ్యం మరియు సహకారానికి అనాది నుంచీ మూల స్తంభంగా నిలుస్తున్న, పెద్ద సంఖ్యలో జనాభాను త్వరగా చేరుకోవల్సిన ఆవశ్యకతను ఆయన ఎత్తి చూపారు.

కోవిడ్-19 నిర్వహణలోని పాఠాల నుండి పొందిన ప్రేరణ గురించి ప్రస్తావిస్తూ,  భారతదేశం,  ఈ సమయంలో,  మహమ్మారిని కేవలం విజయవంతంగా పరిష్కరించడం మాత్రమే కాదు, పరిష్కారాలు, విశ్లేషణలు, టీకాల కోసం ప్రపంచం మొత్తం  భారతదేశం వైపు ఆశతో చూసేటట్లు,  దారిచూపిందని, డాక్టర్ హర్ష వర్ధన్ అభివర్ణించారు. “ఖచ్చితమైన సమాచారం, తగిన ప్రవర్తనలతో పాటు పరిశుభ్రత పద్ధతులు, కఠినమైన సందేశాల పాత్రపై, మహమ్మారి, దృష్టి సారించింది.  టి.బి. లక్షణాలపై దేశవ్యాప్తంగా ఇలాంటి సందేశాలు, ప్రకటనల స్థాయిలను పెంచుతాయి, దేశంలో టి.బి. వ్యాధి వ్యాప్తి నియంత్రణకు సంబంధించిన ముందుజాగ్రత్త ప్రవర్తనపై అవగాహన పెంచుతాయి.” అని ఆయన చెప్పారు.  ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో, పోలియోకు వ్యతిరేకంగా అవగాహన కల్పించడం కోసం, పరిసరాల్లోని మందుల షాపుల భాగస్వామ్యాన్ని కల్పిస్తూ, ఆయన తీసుకున్న చర్యలను, డాక్టర్ హర్ష వర్ధన్, ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

జాతీయ సాంకేతిక సహాయ యూనిట్ (ఎన్.‌టి.ఎస్.‌యు) ఏర్పాటు గురించి జరిపిన చర్చలకు ఆయన అధ్యక్షత వహించారు. టి.బి. నివారణ కార్యక్రమం కింద లభించే సేవలపై డిమాండ్‌ ను రూపొందించడానికి, అవగాహన కల్పించడానికి వివిధ సలహా, సంప్రదింపుల, సమాచార విధానాలను ఉపయోగించడం ద్వారా క్షేత్ర స్థాయిలో కార్యక్రమాల నిర్వహణను బలోపేతం చేయడం కోసం, జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రాలలోనూ, కేంద్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు మద్దతుగా అభివృద్ధి భాగస్వాములతో కలిసి ఈ యూనిట్ ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం జరిగింది. 

ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న, క్షయ వ్యాధి నివారణ కార్యక్రమంలో పనిచేస్తున్న అభివృద్ధి భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా వారి పని ప్రభావాన్ని తెలియజేయడంతో పాటు, ప్రతిపాదిత జన్-ఆందోళన్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి వారి భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.

ఈ సమావేశంలో -  కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్; కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి ఆర్తి అహుజా; డి.జి.హెచ్.ఎస్. డాక్టర్ సునీల్ కుమార్ తో పాటు మంత్రిత్వశాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమానికి,  ఇంకా - డబ్ల్యూ.హెచ్.ఓ. భారత దేశ ప్రతినిధి డాక్టర్ రోడెరికో ఆఫ్రిన్ తో పాటు, బి.ఎం.జి.ఎఫ్. మరియు యు.ఎస్.ఏ.ఐ.డి. వంటి అభివృద్ధి భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. 

 

*****



(Release ID: 1700658) Visitor Counter : 224