ప్రధాన మంత్రి కార్యాలయం

ఫిబ్ర‌వ‌రి 20 న నీతి ఆయోగ్ 6 వ‌ గ‌వర్నింగ్ కౌన్సిల్ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 18 FEB 2021 7:09PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ , 2021 ఫిబ్ర‌వ‌రి 20  వ‌తేదీ ఉద‌యం 10.30 గంట‌ల‌కు, నీతి ఆయోగ్ 6 వ‌ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్  స‌మావేశానికి  వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా అధ్య‌‌క్ష‌త వ‌హించ‌నున్నారు. వ్య‌వ‌సాయం, మౌలిక‌స‌దుపాయాలు, త‌యారీ , మాన‌వ‌వ‌న‌రుల అభివృద్ధి, క్షేత్ర‌స్థాయిలో సేవ‌లు అందించ‌డం, ఆరోగ్యం, పౌష్టికాహారం త‌దిత‌ర అంశాల‌పై ఈ స‌మావే|శంలో చ‌ర్చంచ‌నున్నారు.


వివిధ రంగాలకు సంబంధించి, వివిధ విభాగాల‌కు సంబంధించి, ఫెడ‌ర‌ల్ అంశాలూ చ‌ర్చించేందుకు గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ఒక వేదిక ను కల్పిస్తుంది .ఇందులో ప్ర‌ధాన‌మంత్రితో పాటు  వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, లెజిస్లేచ‌ర్ క‌లిగిన‌ కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య‌మంత్రులు, ఇత‌ర కేంద్ర పాలిత ప్రాంతాల‌  లెఫ్టినెంట్‌గ‌వ‌ర్న‌ర్లు  ఇందులో స‌భ్యులుగా ఉంటారు. ఈ ఆర‌వ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ స‌మావేశంలో తొలిసారిగా ల‌ద్దాక్ పాల్గొన‌నుంది. కేంద్ర‌పాలిత ప్రాంతంగా జ‌మ్ముకాశ్మీర్ పాల్గొంటున్న‌ది.


ఈ సారి ఇత‌ర అడ్మినిస్ట్రేట‌ర్లు నాయ‌క‌త్వంవ‌హిస్తున్న కేంద్ర‌పాలిత ప్రాంతాల‌ను కూడా ఇందులో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఈ స‌మావేశంలో గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ఎక్స్ అఫిషియో స‌భ్యులు , కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్‌ వైస్ ఛైర్మ‌న్‌, స‌భ్యులు, నీతి ఆయోగ్ సి.ఇ.ఒ, భార‌త ప్ర‌భుత్వానికి చెందిన ఇత‌ర సీనియ‌ర్ అధికారులు పాల్గొన నున్నారు.

 

***(Release ID: 1699225) Visitor Counter : 144