మంత్రిమండలి
ఇండియాలో అంతర్జాతీయ స్థాయికి చేరనున్న టెలికం తయారీ
అంతర్జాతీయ టెలికం తయారీ హబ్‌గా భారత్ రూపొందేందుకు పిఎల్ ఐ పథకాన్ని ప్రవేశపెట్టిన ఇండియా
టెలికం రంగానికి ఉద్దేశించిన పిఎల్ఐ పథకం , టెలికం రంగాన్ని ముందుకు తీసుకుపోనుంది. అలాగే ఇండియాలో నెటక్‌వర్కింగ్ ఉపకరణాల తయారీని ప్రోత్సహించనుంది.
టెలికం తయారీ రంగం ఐదేళ్ల కాలంలో రూ 12195 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రగతి సాధించనుంది.
దీనితో 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉత్పత్తి పెరగనుంది.
Posted On:
17 FEB 2021 3:50PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ టెలికం నెట్‌వర్కింగ్ ఉత్పత్తులకు 12,195 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుబడితో ఉత్పాదకతతో ముడిపడిన ఇన్సెంటివ్ పథకానికి (పిఎల్ఐ) ఆమోదం తెలిపింది.
ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహక పథకం (పిఎల్ ఐ) పథకం , టెలికం , నెట్ వర్కింగ్ ఉత్పత్తుల తయారీని ఇండియాలో ప్రోత్సహించేందుకు ఉద్దేశించినది. ఇది ఆర్ధిక రాయితీలను దేశృయ ఉత్పత్తిని పెంచేందుకు, టెలికం నెట్‌వర్కింగ్ ఉత్పత్తులకు సంబంధించి నిర్డేశిత రంగాలలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించేందుకు ఉద్దేశించినది.
ఈ పథకం ఇండియాలో తయారైన టెలికం, నెట్‌వర్కింగ్ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించినది.
ఈ పథకం కింద దేశంలో ప్రత్యేక టెలికం, నెట్ వర్కింగ్ ఉత్పత్తుల రంగంలోని కంపెనీలు సంస్థలకు మద్దతునివ్వనున్నారు.
నాలుగు సంవత్సరాల వ్యవధిలో సంచిత పెట్టుబడి పెరుగుదల కనీస పరిమితిని సాధించడానికి, బేస్ ఇయర్ 2019-2020లో పన్నుల తయారీ వస్తువుల నికర (వర్తక వస్తువుల అమ్మకాలకు భిన్నంగా) అమ్మకాలకు లోబడి ఉంటుంది.క్యుములేటివ్ పెట్టుబడి ఒకే సారి పెట్టవచ్చు. అయితే ఇది నాలుగు సంవత్సరాలకు నిర్దేశించిన వార్షిక సంచిత మొత్తాన్ని అనుసరించాల్సి ఉంటుంది.
అంతర్జాతీయంగా టెలికం నెట్‌వర్కింగ్ ఉత్పత్తుల ఎగుమతుల మార్కెట్ అవకాశాలు సుమారు 100 బిలియన్ అమెరికన్ డాలర్లు గా ఉన్నాయి. దీనిని ఇండియా అందిపుచ్చుకోవచ్చు. ఈ పధకం మద్దతుతో ఇండియా , అంతర్జాతీయ సంస్థలనుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు, అదే సమయంలో దేశీయంగా ఛాంపియన్ కంపెనీలను రాగల అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇండియా తగిన ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు ఈ సంస్థలు ఎగుమతుల మార్కెట్‌లో పెద్ద సంస్థలుగా అవతరించేందుకు అవకాశాలు కల్పించనుంది.
ఇండియా తయారీ రంగ సామర్ధ్యాన్ని పెంచేందుకు,ఆత్మనిర్భర భారత్ వ్యూహానికి కొనసాగింపుగా , అలాగే ఎగుమతులు పెంచేందుకు ఈ పథకం వివిధ పథకాల సమాహారంలో భాగంగా ఉంది. దీనిని 2020 నవంబర్‌లొ కేంద్ర కేబినెట్ ఆమొదించింది. డిపార్టమెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్‌తో సహా వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాల కింద పి.ఎల.ఐ అమలుకు దీనిని ఆమోదించారు.
ఎం.ఎస్.ఎం.ఇలకు కనీస ఇన్వెస్టమెంట్ త్రెషోల్డ్ రూ 10 కోట్ల రూపాయలుగా ఉంది. దీనికి రాయితీ ఏడు శాతం నుంచి 4 శాతం వరకు ఉంది. ఇతరులకు 100 కోట్లుగా ఉంది. రాయితీ బేస్ సంవత్సరంపైన 5 సంవత్సరాల వరకు 6 శాతం నుంచి 4 శాతం వరకు ఉంది. ఎం.ఎస్.ఎం.ఇ కింద నిర్దేశిత మొత్తానికి మించి భారీ పెట్టుబడులు పెట్టే దరఖాస్తుదారులు, అలాగే ఎం.ఎస్.ఎం. ఇ యేతర విభాగానికి చెందిన వారిని పారదర్శక విధానంలో ఎంపిక చేయనున్నారు.
ఈ పథకంతో ఇండియ అంతర్జాతీయంగా టెలికం, నెట్‌వర్కింగ్ ఉత్పత్తులకు సంబంధించి గ్లోబల్ హబ్‌గా రూపుదిద్దుకోనుంది. రాగల 5 సంవత్సరాలలో ఇంక్రిమెంటల్ ఉత్పత్తి సుమారు 2 లక్షల కోట్ల రూపాయల వరకు సాధించనుంది. మరోవైపు ఇండియా తయారీ రంగంలో తన పోటీతత్వాన్ని అదనపు విలువ జోడింపు ద్వారా మెరుగు పరచుకోనుంది.
ఈ పథకం కింద సుమారు రూ 3000 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి., ఇది ప్రత్యక్షంగా , పరోక్షంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించనుంది.
ఈ పథకం కింద ఇండియ స్వావలంబన దిశగా ముందుకు సాగనుంది. దేశంలో భారీ తయారీ రంగానికి రాయితీలు కల్పించడం ద్వారా దేశీయంగా విలువ జోడింపు క్రమంగా పెరగనుంది. ఎం.ఎస్.ఎం.ఇ రంగానికి ఎక్కువ రాయితీలు కల్పించడం వల్ల ఇది దేశీయ టెలికం తయారీదారులు అంతర్జాతీయ సరఫరా చెయిన్‌లో భాగస్వాములు కావడానికి దోహదపడుతుంది.
***
(Release ID: 1698852)
Visitor Counter : 277
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam