ప్రధాన మంత్రి కార్యాలయం
నాస్‌కామ్ టెక్నాలజీ ఎండ్ లీడర్‌శిప్ ఫోరమ్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
కష్ట కాలం లో, మీ కోడ్ పట్టు విడువకుండా ఉండేటట్లు చేసిందని ఐటి పరిశ్రమ కు చెప్పిన ప్రధాన మంత్రి
అవసర లేనటువంటి నియమాల బారి నుంచి సాంకేతిక పరిశ్రమ ను విముక్తం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది: ప్రధాన మంత్రి
యువ నవ పారిశ్రామికవేత్తల కు కొత్త అవకాశాల ను ఉపయోగించుకొనే స్వేచ్ఛ ఉండాలి: ప్రధాన మంత్రి
Posted On:
17 FEB 2021 3:07PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాస్‌కామ్ టెక్నాలజీ ఎండ్ లీడర్‌శిప్ ఫోరమ్ (ఎన్‌టిఎల్ఎఫ్) ను ఉద్దేశించి బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, కరోనా కాలం లో ఐటి పరిశ్రమ మొక్కవోని దీక్ష తో పాటుపడినందుకు గాను వారిని కొనియాడారు. ‘‘కష్టకాలం లో మీ కోడ్ పట్టు విడువకుండా ఉండేటట్టు చేసింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రతికూల వృద్ధి తాలూకు భయాందోళన ల మధ్య ఈ రంగం లో 2 శాతం వృద్ధి తో పాటు 4 మిలియన్ డాలర్ ల అదనపు ఆదాయం నమోదు అయిందని ఆయన అన్నారు.
నేటి కాలపు భారతదేశం ప్రగతి ని సాధించడానికి ఉవ్విళ్ళూరుతోంది, ఈ భావన ను ప్రభుత్వం ఆకళింపు చేసుకొంది అని ప్రధాన మంత్రి అన్నారు. మనం శరవేగం గా ముందుకు సాగిపోయేందుకు 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష లు మనకు ప్రేరణ ను అందిస్తున్నాయని ఆయన అన్నారు. ‘న్యూ ఇండియా’ కు సంబంధించిన అపేక్ష లు ప్రభుత్వం నుంచి వ్యక్తం అవుతున్న మాదిరి గానే ప్రైవేటు రంగం నుంచి కూడా వ్యక్తం అవుతున్నాయని ఆయన నొక్కి చెప్పారు. రాబోయే కాలం తాలూకు నాయకత్వం అభివృద్ధి చెందడానికి ఆంక్ష లు అనేవి అంతగా అనుకూలం కాదు అన్న సంగతి ప్రభుత్వాని కి తెలుసు అని ఆయన అన్నారు. ప్రభుత్వం అనవసరపు నియమాల బారి నుంచి సాంకేతిక పరిశ్రమ ను విముక్తం చేసేందుకు కృషి చేస్తోందని ఆయన అన్నారు.
నేశనల్ కమ్యూనికేశన్ పాలిసీ, భారతదేశాన్ని గ్లోబల్ సాఫ్ట్‌వేర్ ప్రోడక్ట్ హబ్ గా మలచడానికి రూపొందించిన విధానం, అదర్ సర్వీస్ ప్రొవైడర్ (ఒఎస్‌పి) మార్గదర్శక సూత్రాలు వంటి ఇటీవలి కాలం లో తీసుకొన్న చర్యల ను గురించి ప్రధాన మంత్రి ఒక్కటొక్కటి గా ప్రస్తావించారు. ఒఎస్ పి మార్గదర్శకాలను కరోనా కాలం లో జారీ చేయడం జరిగింది. సమాచార సేవల ను 12 చాంపియన్ సర్వీస్ సెక్టర్ లలో చేర్చడం అనేది ఫలితాల ను అందించడం మొదలుపెట్టింది అని ఆయన తెలిపారు. మ్యాపులకు, జియో-స్పేశల్ డేటా కు సంబంధించి ఇటీవలే సరళతరం చేసినటువంటి నియమావళి విజ్ఞాన రంగం లో స్టార్ట్-అప్ ఇకో సిస్టమ్ ను, మరింత విస్తృత లక్ష్యాలు కలిగినటువంటి ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ ను పటిష్ట పరుస్తుంది అని ఆయన చెప్పారు.
కొత్త కొత్త అవకాశాల ను వినియోగించుకొనేందుకు యువ నవ పారిశ్రామికవేత్తల కు స్వేచ్ఛ అనేది ఉండాలి అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. స్టార్ట్-అప్ లన్నా, నూతన ఆవిష్కర్తలన్నా ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. స్వీయ ధ్రువీకరణపత్రం జారీ, పరిపాలన లో ఐటి ఆధారిత పరిష్కార మార్గాల ను ఉపయోగించుకోవడం, డిజిటల్ ఇండియా ద్వారా సమాచార నిధి ప్రజాస్వామ్యీకరణ ల వంటి చర్యలు ప్రక్రియ ను ముందుకు తీసుకుపోయాయని ఆయన వివరించారు.
పరిపాలన లో పారదర్శకత్వానికి ప్రాముఖ్యాన్ని కట్టబెట్టడాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం పట్ల ప్రజల కు నమ్మకం పెరుగుతోందన్నారు. పరిపాలన ను ఫైళ్ళ లో నుంచి డాశ్ బోర్డు కు తీసుకు రావడమైంది, పౌరులు సరి అయిన పర్యవేక్షణ చేయడానికే ఇలా చేయడం జరిగింది అని ఆయన అన్నారు. ప్రక్రియ లోను, జిఇఎమ్ (GeM) పోర్టల్ ద్వారా ప్రభుత్వ కొనుగోళ్ళ లోను పారదర్శకత్వం మెరుగుపడిన సంగతి ని కూడా ఆయన ప్రస్తావించారు.
పరిపాలన లో సాంకేతికత ను వినియోగించవలసిన అవసరాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి వక్కాణించారు. మౌలిక సదుపాయాల కల్పన సంబంధిత ఉత్పాదనల కు పేద ప్రజల కు ఉద్దేశించిన గృహాలు, ఇంకా ఆ తరహా పథకాలకు జియో ట్యాగింగ్ ను గురించి ఆయన ఉదాహరణలు ఇస్తూ, ఇలా చేసినందువల్ల వాటిని సకాలం లో పూర్తి చేయవచ్చు అన్నారు. పన్నుల కు సంబంధించిన విషయాల లో పారదర్శకత్వాన్ని మెరుగు పరచడానికి గాను గ్రామీణ కుటుంబాల వివరాల ను సేకరించడం లో డ్రోన్ ల వినియోగాన్ని గురించి, మనుషుల జోక్యాన్ని తగ్గించడాన్ని గురించి కూడా ఆయన వివరించారు. స్టార్ట్-అప్ ల వ్యవస్థాపకులు తమను తాము కేవలం వెలకట్టడానికి, నిష్క్రమణ వ్యూహాల కు మాత్రమే పరిమితం చేసుకోకూడదని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. ‘‘ఈ శతాబ్దం ముగిసిన తరువాత సైతం మనుగడ సాగించేటటువంటి సంస్థల ను ఏ విధంగా తీర్చిదిద్దగలుగుతారో అనే దానిని గురించి మీరు ఆలోచించండి. ప్రావీణ్యం లో ప్రపంచ శ్రేణి గీటురాయి ని నిర్దేశించేటటువంటి ఉత్పత్తుల ను ఏ విధంగా ఆవిష్కరించగలరనే దానిని గురించి మీరు ఆలోచించండి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సాంకేతిక రంగ ప్రముఖులు వారు ఆవిష్కరించే సాల్యూశన్స్ లో ‘మేక్ ఇన్ ఇండియా’ ముద్ర ఉండేటట్లుగా శ్రద్ధ వహించాలి అని కూడా ప్రధాన మంత్రి సూచించారు. భారతదేశ సాంకేతికపరమైన నాయకత్వాన్ని, నలుగురి తో పాటు ముందుకు సాగిపోవడానికి గాను స్పర్ధ తాలూకు కొత్త పరామితుల ను నిర్దేశించాలని ఆయన పిలుపునిచ్చారు. అదే విధం గా సర్వశ్రేష్టత్వానికి సంబంధించిన సంస్కృతి ని, సంస్థాగత నిర్మాణాన్ని గురించి కూడా ఆయన నొక్కి వక్కాణించారు.
దేశం 2047వ సంవత్సరం వచ్చేసరికల్లా వందేళ్ళ స్వాతంత్య్రం దిశ లో ముందుకు సాగిపోతూ ఉన్న క్రమం లో ప్రపంచ శ్రేణి ఉత్పత్తుల ను, నేతల ను అందించడాన్ని గురించి ఆలోచించండి అంటూ వారికి ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. మీ లక్ష్యాలు ఏమిటో అన్నది నిర్ణయించుకోండి, దేశం మీ వెన్నంటి నిలుస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
భారతదేశాని కి 21వ శతాబ్ది లో ఎదురు కాగల సవాళ్ళ ను ఎదుర్కొనేందుకు ఏదైనా ఒక అంచనావేసినటువంటి పరిణామం సంభవించే కంటే ముందే దానిని తట్టుకొని నిలబడగలిగేందుకు తీసుకొనేటటువంటి సాంకేతికపరమైన పరిష్కార మార్గాల ను అందజేయవలసిన బాధ్యత టెక్ ఇండస్ట్రీ భుజస్కంధాల పైన ఉందని ప్రధాన మంత్రి అన్నారు. వ్యవసాయ రంగానికి కీలకమైన జల సంబంధి అవసరాలను, ఎరువుల అవసరాల ను తీర్చేటటువంటి పరిష్కార మార్గాల తో పాటు ఆరోగ్యం, వెల్‌నెస్, టెలి మెడిసిన్, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల లో పరిష్కార మార్గాల ను అన్వేషించేందుకు పాటుపడవలసిందిగా వారిని ఆయన కోరారు. జాతీయ విద్య విధానం, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, అటల్ ఇన్ క్యుబేశన్ సెంటర్ ల వంటి చర్య లు నైపుణ్యాల సాధన ను, నూతన ఆవిష్కరణ ను ప్రోత్సహిస్తున్నాయని, వాటికి పరిశ్రమ రంగం వైపు నుంచి సమర్ధన అవసరమని ఆయన అన్నారు. సిఎస్ఆర్ కార్యకలాపాల ఫలితాల విషయం లో శ్రద్ధ వహించవలసిందని కూడా ఆయన పిలుపునిచ్చారు. సిఎస్ ఆర్ కార్యక్రమాలలో వెనుకబడిన ప్రాంతాల పైనా, డిజిటల్ మాధ్యమం లో విద్య బోధన పైనా దృష్టి ని కేంద్రీకరించాలని ఆయన కోరారు. నవ పారిశ్రామికవేత్తల కు, నూతన ఆవిష్కర్తల కు రెండో అంచె, మూడో అంచె నగరాల లో అందివస్తున్న అవకాశాలను గురించి కూడా ఆయన విడమరచి చెప్పారు.
***
(Release ID: 1698770)
Visitor Counter : 218
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam