ఆర్థిక మంత్రిత్వ శాఖ

జి.ఎస్.టి నష్టపరిహార కొరతను తీర్చడానికి, 16వ విడత గా రాష్ట్రాలకు 5,000 కోట్ల రూపాయలు విడుదల


అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 95,000 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి

రాష్ట్రాలకు మంజూరు చేసిన 1,06,830 కోట్ల రూపాయల అదనపు రుణ అనుమతికి ఇది అదనం

Posted On: 15 FEB 2021 5:12PM by PIB Hyderabad

జి.ఎస్.టి. పరిహార కొరతను తీర్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, వ్యయ విభాగం, 16వ వారం వాయిదా కింద రాష్ట్రాలకు 5,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ మొత్తంలో, జి.ఎస్.టి. మండలి లో సభ్యత్వం కలిగిన 23 రాష్ట్రాలకు, 4597.16 కోట్ల రూపాయలు, 402.84 కోట్ల రూపాయలను శాసనసభతో ఉన్న 3 కేంద్ర పాలిత ప్రాంతాలు (యు.టి), ఢిల్లీ, జమ్మూ-కశ్మీర్, పుదుచ్చేరి లకు విడుదల చేయడం జరిగింది. మిగిలిన 5 రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల్లో జీ.ఎస్.టీ. అమలు చేయడం ద్వారా ఆదాయంలో అంతరం లేదు.

ఇప్పటి వరకు, మొత్తం అంచనా వేసిన జి.ఎస్.టి. నష్టపరిహారంలో 86 శాతం రాష్ట్రాలు మరియు శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేయడం జరిగింది. ఇందులో రాష్ట్రాలకు 86,729.93 కోట్ల రూపాయలు విడుదల కాగా, శాసనసభతో కూడిన 3 కేంద్రపాలిత ప్రాంతాలకు 8,270.07 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది.

జి.ఎస్.టి. అమలు కారణంగా, ఆదాయంలో సంభవించే, 1.10 లక్షల కోట్ల రూపాయల అంచనా లోటును భర్తీ చేయడానికి, భారత ప్రభుత్వం 2020 అక్టోబర్ లో ఒక ప్రత్యేక రుణ విండోను ఏర్పాటు చేసింది. ఈ విండో ద్వారా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల తరఫున, భారత ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. 2020 అక్టోబర్, 23వ తేదీ నుంచి ఇప్పటి వరకు 16 విడతలుగా రుణాలు సేకరించడం జరిగింది.

ఈ వారం రాష్ట్రాలకు 16వ విడతగా ఈ మొత్తాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ వారం విడుదల చేసిన ఋణ మొత్తాన్ని 4.6480 శాతం వడ్డీరేటుతో తీసుకున్నారు. ఇప్పటి వరకు, ఈ ప్రత్యేక ఋణ గవాక్షం ద్వారా, కేంద్ర ప్రభుత్వం, 4.7831 శాతం సగటు వడ్డీరేటుతో, 95,000 కోట్ల రూపాయల మేర రుణాలు సేకరించింది.

జి.ఎస్.టి. అమలు కారణంగా ఆదాయంలో సంభవించే కొరతను తీర్చడానికి ప్రత్యేక రుణ విండో ద్వారా నిధులు సమకూర్చడంతో పాటు, ఇందుకోసం, ఆప్షన్-1 ని ఎంచుకున్న రాష్ట్రాలకు, అదనపు ఆర్థిక వనరులను సమీకరించడంలో సాయపడటం కోసం, స్థూల రాష్ట్రాల అంతర్గత ఉత్పత్తి (జి.ఎస్.డి.పి) లో 0.50 శాతానికి సమానమైన అదనపు రుణ అనుమతిని కూడా, భారత ప్రభుత్వం మంజూరు చేసింది. అన్ని రాష్ట్రాలు ఆప్షన్ -1 కు తమ ప్రాధాన్యతనిఇచ్చాయి. ఈ నిబంధన కింద 28 రాష్ట్రాలకు 1,06,830 కోట్ల రూపాయల మేర (జీ.ఎస్.డీ.పీ. లో 0.50 శాతం) మొత్తం అదనపు రుణాన్ని పొందడానికి అనుమతి మంజూరు చేసింది.

28 రాష్ట్రాలకు మంజూరు చేసిన అదనపు రుణ అనుమతి మొత్తం మరియు ప్రత్యేక విండో ద్వారా సేకరించి, ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసిన నిధుల మొత్తం వివరాలను అనుబంధంలో పొందుపరచడమైంది.

రాష్ట్రాల వారీగా జీ.ఎస్.డీ.పీ. లో 0.50 శాతం అనుమతించిన అదనపు రుణాలు మరియు 15.02.2021 వరకు ప్రత్యేక విండో ద్వారా సేకరించి రాష్ట్రాలు / యు.టి. లకు అందజేసిన నిధుల మొత్తం

(రూపాయలు కోట్లలో)

 

క్రమ సంఖ్య

రాష్ట్రాలు /

కేంద్ర పాలిత

ప్రాంతాల పేరు

రాష్ట్రాలకు

అనుమతించిన 0.50 శాతం అదనపు

రుణాలు
 

ప్రత్యేక విండో ద్వారా సేకరించి రాష్ట్రాలు / యు.టి. లకు

అందజేసిన నిధి మొత్తం

1

ఆంధ్రప్రదేశ్

5051

2167.20

2

అరుణాచల్ ప్రదేశ్ *

143

0.00

3

అస్సాం

1869

932.42

4

బీహార్

3231

3661.70

5

ఛత్తీస్ గఢ్

1792

1833.65

6

గోవా

446

787.61

7

గుజరాత్

8704

8647.89

8

హర్యానా

4293

4081.14

9

హిమాచల్ ప్రదేశ్

877

1610.17

10

ఝార్ఖండ్

1765

996.13

11

కర్ణాటక

9018

11634.88

12

కేరళ

4,522

3729.00

13

మధ్య ప్రదేశ్

4746

4259.37

14

మహారాష్ట్ర

15394

11231.97

15

మణిపూర్ *

151

0.00

16

మేఘాలయ

194

104.97

17

మిజోరాం *

132

0.00

18

నాగాలాండ్ *

157

0.00

19

ఒడిశా

2858

3584.17

20

పంజాబ్

3033

5405.84

21

రాజస్థాన్

5462

3622.50

22

సిక్కిం *

156

0.00

23

తమిళనాడు

9627

5852.85

24

తెలంగాణ

5017

1703.56

25

త్రిపుర

297

212.15

26

ఉత్తర ప్రదేశ్

9703

5633.14

27

ఉత్తరాఖంఢ్

1405

2172.07

28

పశ్చిమ బెంగాల్

6787

2865.55

 

మొత్తం (ఏ):

106830

86729.93

1

ఢిల్లీ

వర్తించదు

5499.96

2

జమ్మూ & కశ్మీర్

వర్తించదు

2130.51

3

పుదుచ్చేరి

వర్తించదు

639.60

 

మొత్తం (బి):

వర్తించదు

8270.07

 

మొత్తం (ఏ +బి)

106830

95000.00

 

* ఈ రాష్ట్రాలకు జీ.ఎస్.టి. పరిహారంలో అంతరం లేదు.

*****

 


(Release ID: 1698285) Visitor Counter : 224