సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఎస్సీ కమ్యూనిటీ నుండి దేవేంద్ర కుల వెల్లలార్ కమ్యూనిటీని తొలగించిన వార్తా అంశానికి సంబంధించి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ స్పష్టీకరణ
Posted On:
15 FEB 2021 3:07PM by PIB Hyderabad
ఎస్సీ కమ్యూనిటీ నుండి దేవేంద్ర కుల వెల్లలార్ వర్గాన్ని తొలగించడం గురించి మీడియాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుడు సమాచారం అని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వార్తలు దేవేంద్ర కుల వెల్లలార్ వర్గాన్ని తప్పుదారి పట్టించేవని, వాస్తవిక స్థితిని ప్రతిబింబించనివని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఏడు (7) ఎస్సీ వర్గాలను దేవేంద్ర కులా వెల్లలార్‌గా వర్గీకరించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది, ఇది తమిళనాడు షెడ్యూల్డ్ కులాల జాబితాలో భాగం అవుతుందని కేంద్రం తెలిపింది. దీంతో వారు ఎస్సీల నుండి తొలగించబడతారని మరియు ఓబిసిలుగా మారుతారనే ప్రకటన పూర్తిగా తప్పుడుదని, ఆ ప్రకటన వాస్తవికతను ప్రతిబింబించదని స్పష్టం చేసింది. ఎస్సీ జాబితా కింద ఏడు (7) ఎస్సీ వర్గాలను దేవేంద్ర కులా వెల్లలార్‌గా తమిళనాడు రాష్ట్రంకు వర్గీకరించే బిల్లును ఇప్పటికే లోక్‌సభలో ప్రవేశపెట్టినట్టు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
****
(Release ID: 1698258)
Visitor Counter : 282