సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కుటుంబ పెన్షన్ల సీలింగ్ నెలకు రూ .45,000 నుండి 1,25,000 కు పెంపు: డాక్టర్ జితేంద్ర సింగ్


Posted On: 12 FEB 2021 3:32PM by PIB Hyderabad

కుటుంబ పెన్షన్లకు సంబంధించి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సంస్కరణల్లో భాగంగా  గరిష్ఠ పరిమిత  నెలకు రూ .45,000 నుండి 1,25,000 రూపాయలకు పెంచినట్టు ఈశాన్య ప్రాంతం అభివృద్ధి (డోనెర్), పిఎంఓ, సిబ్బంది, ప్రజా సమస్యలు, పెన్షన్లు, అణుశక్తి మరియు అంతరిక్షం సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్  వెల్లడించారు.

ఈ చర్య మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు "సులభతర జీవనాన్ని" తీసుకువస్తుందని, వారికి తగిన ఆర్థిక భద్రత కల్పిస్తుందని ఆయన అన్నారు. ఒక పిల్లవాడు తన / ఆమె తల్లిదండ్రుల మరణం తరువాత రెండు కుటుంబ పెన్షన్లు తీసుకోవడానికి అర్హతపై, పెన్షన్ & పెన్షనర్ల సంక్షేమ శాఖ (డిఓపిపిడబ్ల్యు) అనుమతించదగిన మొత్తంపై వివరణ ఇచ్చిందని మంత్రి చెప్పారు. కుటుంబ పింఛన్ల మొత్తాన్ని ఇప్పుడు నెలకు 1,25,000 రూపాయలకు పరిమితం చేస్తామని, ఇది మునుపటి పరిమితి కంటే రెండున్నర రెట్లు ఎక్కువ అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్ 1972 లోని రూల్ 54 లోని సబ్-రూల్ (11) ప్రకారం, భార్య మరియు భర్త ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఆ నియమం యొక్క నిబంధనల కిందకు వస్తే, వారి మరణం తరువాత, బతికున్న చిన్నారి, మరణించిన తల్లిదండ్రులకు సంబంధించి రెండు కుటుంబ పెన్షన్లకు అర్హత ఉంటుంది. మునుపటి సూచనల ప్రకారం అటువంటి సందర్భాలలో మొత్తం రెండు కుటుంబ చెల్లింపులు నెలకు రూ .45,000 / - మరియు నెలకు 27,000 / - రూపాయలు అంటే రేటు వరుసగా 50% మరియు 30% చొప్పున నిర్ణయించబడతాయి, ఇవి 6 వ సిపిసి సిఫారసుల ప్రకారం అత్యధిక జీతం చెల్లింపు రూ. 90,000 / - పరిగణలోకి తీసుకుంటే ఈ విధంగా ఉండేది.

అత్యధిక వేతనం 7 వ సిపిసి సిఫారసుల అమలు తర్వాత నెలకు రూ.2,50,000 సవరించడంతో సిసిఎస్ (పెన్షన్) నిబంధనల రూల్ 54 (11) లో సూచించిన మొత్తాన్ని కూడా నెలకు రూ .1,25,000 / - కు సవరించడం వల్ల ఇది  50,000 / - లో 50%, మరియు నెలకు 75000 / - సవరించడం వల్ల  రూ. 2,50,000 / - లో 30% ఉండేలా నిబంధనలలో మార్పు తెచ్చారు.

వివిధ మంత్రిత్వ శాఖ / శాఖ నుండి వచ్చిన సూచనలపై పై వివరణ ఇవ్వబడింది. ప్రస్తుత నియమం ప్రకారం, తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారిలో ఒకరు సర్వీస్ లో ఉన్నప్పుడు లేదా పదవీ విరమణ తర్వాత మరణిస్తే, మరణించినవారికి సంబంధించి కుటుంబ పెన్షన్ జీవించి ఉన్న జీవిత భాగస్వామికి చెల్లించబడుతుంది మరియు జీవిత భాగస్వామి మరణించిన సందర్భంలో, మరణించిన తల్లిదండ్రులకు సంబంధించి ఇతర అర్హత షరతుల నెరవేర్పుకు లోబడి ఉన్న పిల్లలకి రెండు కుటుంబ పెన్షన్లు మంజూరు చేయబడతాయి.

****



(Release ID: 1697569) Visitor Counter : 249