ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి లోక్‌సభలో సమాధానమిచ్చిన ప్రధానమంత్రి
Posted On:
10 FEB 2021 6:16PM by PIB Hyderabad
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు లోక్‌సభలో సమాధానమిచ్చారు.
రాష్ట్రపతి ప్రసంగం భారత దేశ సంకల్ప శక్తిని ప్రతిబింబించిందని ఆయన అన్నారు. ఆయన మాటలు భారతదేశ ప్రజలలో విశ్వాసాన్ని నింపాయని అన్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పార్లమెంటు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పెద్ద సంఖ్యలో మహిళా పార్లమెంటు సభ్యులు చర్చలో పాల్గొన్నారని అంటూ ప్రధానమంత్రి, వారి ఆలోచనల ద్వారా సభ చర్చల స్థాయిని పెంచినందుకు ఆయన వారిని అభినందించారు.
ప్రపంచ యుద్ధాల అనంతరం ప్రపంచగతి కి సంబంధించిన చరిత్రను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, కోవిడ్ అనంతర ప్రపంచం పూర్తి భిన్నంగా ఉండనున్నదని అన్నారు. ఇలాంటి సమయాలలో అంతర్జాతీయ పరిణామాలకు దూరంగా ఏకాకిగా ఉండడం వ్యతిరేక ఫలితాలనిస్తుందని ఆయన అన్నారు. అందువల్ల ఇండియా ఆత్మనిర్భర భారత్ నిర్మాణం దిశగా పనిచేస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. ఇండియా మరింత బలపడుతోందని, ఆత్మనిర్భర్ ప్రపంచానికి మంచిదని ఆయన అన్నారు. స్ధానిక ఉత్పత్తులకు ప్రాధాన్యతనిచ్చే వోకల్ ఫర్ లోకల్ అనేది ఎవరో ఒక నాయకుడికి సంబంధించినది కాదని, ఇది దేశం నలుమూలలా ప్రతిధ్వనిస్తున్నదని అన్నారు. కరోనాను అదుపుచేసిన ఘనత 130 కోట్ల మంది భారతీయులకు చెందుతుందని అన్నారు. మన వైద్యులు, నర్సులు,కోవిడ్ వారియర్లు, సఫాయి కర్మచారి, అంబులెన్సులు నడిపేవారు,....ఇలాంటి ఎందరెందరో భగవత్‌స్వరూపంగా మారి కోవిడ్ మహమ్మారిపై ఇండియా సాగిస్తున్న పోరాటాన్ని బలోపేతం చేశారని ప్రధానమంత్రి అన్నారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రభుత్వ , బాధిత ప్రజలకు ప్రత్యక్షనగదు బదిలీ పథకం ద్వారా 2 లక్షల కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాలలో జమచేయడం జరిగిందని ఆయన తెలిపారు.మన జన్ ధన్- ఆధార్ -మొబైల్ (జెఎఎం) మూడూ ప్రజల జీవితాలలో సానుకూల మార్పును తీసుకువచ్చాయని అన్నారు. ఇది నిరుపేదలకు, అట్టడుగు వర్గాలు,అణగారిన వర్గాలకు, ఎంతో సాయం చేసిందని అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా సంస్కరణలు కొనసాగాయని, ఇది మన ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చాయని అన్నారు.ఇది రెండంకెల వృద్ధి జరగగలదన్న ఆకాంక్షను ఆయన అన్నారు.
రైతుల నిరసనల గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, వ్యవసాయ బిల్లులపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న రైతుల పట్ల ఈ సభకు, ప్రభుత్వానికి గౌరవం ఉందని ఆయన అన్నారు. అందువల్లే ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి మంత్రులు నిరంతరం వారితొ చర్చలు జరుపుతున్నారని అన్నారు. రైతుల పట్ల అత్యంత గౌరవం ఉందని ఆయన అన్నారు. వ్యవసాయానికి సంబంధించిన చట్టాలను పార్లమెంటు ఆమోదించిన తర్వాత ఏ మండీ కూడా మూతపడలేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే కనీస మద్దతు ధర కొనసాగుతున్నదన్నారు. ఎం.ఎస్.పి ఆధారంగా ప్రొక్యూర్ మెంట్ కొనసాగుతున్నదన్నారు. మండీలను బలోపేతం చేసేందుకు బడ్జెట్‌లొ ప్రతిపాదించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ వాస్తవాలను విస్మరించడానికి వీలులేదని ఆయన చెప్పారు. సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్న వారు ఒక వ్యూహాత్మక పథకం ప్రకారం ఆ పనిచేస్తున్నారని ఆయన అననారు. ప్రజలు వాస్తవాలను గ్రహించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని ప్రధానమంత్రి అన్నారు. వారు తమ ఆటల ద్వారా ప్రజల విశ్వాసాన్ని ఎన్నటికీ పొందలేరని ఆయన అన్నారు. కోరకుండానే ప్రభుత్వం ఎందుకు సంస్కరణలు ముందుకు తెస్తున్నదన్న వాదనను ప్రధానమంత్రి తోసిపుచ్చారు. ఇదంతా ఐచ్ఛికమని , అయితే అడిగేవరకు మనం వేచి ఉండలేమని ఆయన అన్నారు. చాలా ప్రగతిదాయక చట్టాలు ఆయా కాలల అవసరాలను బట్టి తీసుకురావడం జరిగిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దేశ అవసరాలకు అనుగుణంగా ప్రజల సంక్షేమానికి పనిచేసే బాధ్యతను మనం తీసుకోవాలని ఆయన అన్నారు. దేశంలో మార్పుకోసం మనం పనిచేశామని మన ఉద్దేశాలు మంచివైతే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి అని ఆయన అన్నారు.
వ్యవసాయం అనేది మన సమాజం, సంస్కృతి, మన పండగలలో అంతర్భాగమని .అన్ని సందర్భాలూ నాట్లు, నూర్పిడులతో ముడిపడినవని ఆయన అన్నారు. దేశంలో 80 శాతం ప్రజానీకాన్ని, చిన్న రైతులను విస్మరించడానికి లేదని ఆయన అన్నారు. చిన్న చిన్న కమతాలుగా ఏర్పడడం ఆందోళన కలిగిస్తున్నదని, దీనివల్ల రైతులు తమ భూములపై మెరుగైన రాబడి పొందలేకపోతున్నారని ఆయన అన్నారు. దీనితో వ్యవసాయ రంగంలో పెట్టుబడి దెబ్బతింటున్నదని ఆయన తెలిపారు. చిన్న రైతుల కోసం చర్యలు అవసరమని ప్రధానమంత్రి అన్నారు. ఇందుకు అనుగుణంగా మన రైతులు ఆత్మనిర్భర్ సాధించేందుకు వారు తమ పంటను ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛను ఇవ్వడం ద్వారా పంటలలో వైవిధ్యానికి దోహదం చేసేందుకు మనం కృషి చేయవలసి ఉందని అన్నారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడివ మరింత ఉపాధికి అవకాశం కల్పిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. మనం వారికి సానుకూల వాతావరణం కల్పించినట్టయితే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించి వారిలో నమ్మకాన్ని పాదుకొల్పాలని అన్నారు. ఇందుకు సానుకూల ఆలోచనలు అవసరమని , పాత పద్ధతులు, పాత ప్రమాణాలు పనిచేయవని ప్రధానమంత్రి అన్నారు.
ప్రభుత్వరంగం ఆవశ్యకమేనని అయితే ప్రైవేటురంగం పాత్ర కూడా కీలకమేనని శ్రీ నరేంద్ర మోడీ అన్నారు. ఏ రంగమైనా తీసుకోండి. అది టెలికం, ఫార్మా ఏదైనా కానివ్వండి, మనం ప్రైవేటు రంగం పాత్రను చూస్తాం. ఇండియా మానవాళికి సేవ చేయగలుగుతున్నదంటే అది ప్రైవేటు రంగం పాత్ర వల్లేనని ఆయన అన్నారు. ప్రైవేటు రంగానికి వ్యతిరేకంగా అనుచితపదాలు వాడడం వల్ల కొద్దిమందికి గతంలో ఓట్లు వచ్చి ఉండవచ్చునేమో కాని , అలాంటి కాలం పోయింది. ప్రైవేటు రంగాన్ని దూషించే సంస్కృతి ఇక ఎంతమాత్రం మంచిది కాదు. మన యువతను ఇలా అవమానించడాన్న సహించలేమని ప్రధానమంత్రి అన్నారు.
కిసాన్ ఆందోళన్ లో హింసజరగడం పట్ల ప్రధానమంత్రి విమర్శలు చేశారు. కిసాన్ ఆందోళన్ నునేను పవిత్రమైనదిగా భావిస్తాను. అయితే ఆందోళన జీవులు పవిత్ర ఆందోళనలను హైజాక్‌చేసి, తీవ్ర నేరాలకు పాల్పడి జైలు పాలైన వారి ఫోటోలు ప్రదర్శించుకోవడం ఏమైనా ఫలితాన్ని స్తుందా? టోల్ ప్లాజాలు పనిచేయనివ్వకుండా చేయడం, టెలికం టవర్లను ధ్వంసం చేయడం వంటివి పవిత్ర ఆందోళన్ ప్రయోజనాన్ని నెరవేరుస్తాయా ? అని ప్రధానమంత్రి ప్రశ్నించారు. సరైన విషయాలు మాట్లాడేవారు కొందరు ఉన్నారని , అయితే ఈ మాటలను చేతల్లో చూపాల్సిన సందర్భంలో వారు విఫలమవుతున్నారని ఆయన అన్నారు. ఎన్నికల సంస్కరణల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారు ,ఒక దేశం, ఒక ఎన్నిక ను వ్యతిరేకిస్తున్నారన్నారు. స్త్రీ, పురుష సమానత్వం గురించి వారు మాట్లాడతారని , అదే సమయంలో ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకిస్తారని అన్నారు. ఇలాంటివారు దేశాన్ని తప్పుదారి పట్టిస్తారని ప్రధానమంత్రి అన్నారు.
పేదలు, మధ్యతరగతికి కొత్తవకాశాలు కల్పించేందుకు మౌలికసదుపాయాలు బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు.ప్రభుత్వం దేశాన్ని సమతుల అభివృద్ధి దిశగా తీసుకువెళ్లడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నదని చెప్పారు.
భారతదేశ తూర్పుప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం మిషన్‌మోడ్‌లో పనిచేస్తున్నదని ప్రధానమంత్రి తెలిపారు. పెట్రోలియం ప్రాజెక్టులు, రోడ్లు, విమానాశ్రయాలు, జలమార్గాలు, సిఎన్జి,ఎల్‌పిజి కవరేజ్ ,నెట్ అనుసంధానత ప్రాజెక్టులనుఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
సరిహద్దులలో మౌలికసదుపాయాల కల్పన విషయంలో జరిగిన చారిత్రక నిర్లక్ష్యాన్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. రక్షణ బలగాలు మన సరిహద్దులను కాపాడడంలో తమ బాధ్యతలను నెరవేరుస్తున్నాయనిఆయన అన్నారు. సైనికుల అసమాన ధైర్యసాహసాలు, బలం, వారి త్యాగాలను ప్రధానమంత్రి కొనియాడారు.
***
(Release ID: 1696942)
Visitor Counter : 180
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam