వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్ పై జరిగిన మొదటి ఇండియా -ఇయు ఉన్నతస్థాయి చర్చలు
Posted On:
06 FEB 2021 9:36AM by PIB Hyderabad
ట్రేడ్ , ఇన్వెస్ట్‌మెంట్‌పై ఇండియా -ఇయు మొదటి ఉన్నత స్థాయి చర్చలు (హెచ్.ఎల్.డి) ఫిబ్రవరి 5, 2021 న జరిగాయి. దీనికి వాణిజ్య ,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ , యూరోపియన్ యూనియన్ ఎక్సిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ , ట్రేడ్ కమిషనర్ వి.డామ్‌బ్రోవ్‌స్కిస్ సహ అధ్యక్షత వహించారు.
2020 జూలై లో జరిగిన 25 వ ఇండియా- ఇయు నాయకుల సమావేశం ఫలితంగా ఈ చర్చలు జరపాలన్న సంకల్పం చెప్పుకున్నారు. ద్వైపాక్షిక వాణిజ్య , పెట్టుబడుల సంబంధాల దిశగా మంత్రిత్వస్థాయి మార్గనిర్దేశం లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు.
హెచ్.ఎల్.డి లో చర్చల సందర్భంగా , కోవిడ్ -19 అనంతర పరిస్థితులలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరాన్ని ఈ సమావేశంలో మంత్రులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇందుకు వరుసగా క్రమం తప్పకుండా చర్చలు జరుపుతుండాలన్నారు. ప్రస్తుత కఠిన సమయాలలో సత్వర ఫలితాలు ఇచ్చే లక్ష్యంతో దీనిని చేపట్టాలన్నారు.
పలు ద్వైపాక్షిక అంశాలు, పెట్టుబడి సహకారం, ద్వైపాక్షిక రెగ్యులేటరీ చర్చలపై ఏకాభిప్రాయసాధన, మరింత సహకారానికి సంబంధించి ఇండియా - యూరోపియన్ యూనియన్ మధ్య బహుళ పక్ష చర్చలకు సంబంధించిన అంశాల విషయమై
రాగల మూడు నెలల్లో మరోసారి కలుసుకోవాలని మంత్రులు నిర్ణయించారు.
ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల ఒప్పందాలకు సంబంధించి తాత్కాలిక ఒప్పందంతో ప్రారంభించేందుకు క్రమంతప్పకుండా సంప్రదింపులు జరిపే అంశంపై చెప్పుకోదగిన ముందడుగు పడింది.
ఇండియా-యూరోపియన్ యూనియన్ మధ్య పూర్తి స్థాయిలో వాణిజ్య ఆర్ధిక భాగస్వామ్యానికి సంబంధించిన సామర్థ్యాలను పునరుద్ధరించేందుకు నిబద్ధత, విశ్వాసాన్ని మంత్రులు వ్యక్తం చేశారు.
***
(Release ID: 1695873)
Visitor Counter : 212