వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పరిశ్రమలకు ఏకగవాక్ష అనుమతుల వ్యవస్థ
Posted On:
05 FEB 2021 3:06PM by PIB Hyderabad
దేశంలో పరిశ్రమలకు అనుమతులు, ఆమోదాల కోసం ఏకగవాక్ష పద్ధతిని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. భారత్‌లోనూ, రాష్ట్రాలలోనూ ఏకగవాక్ష అనుమతుల కోసం పలు ఐటి వేదికలు పెట్టుబడులు పెట్టినప్పటికీ, పెట్టుబడిదారులు వివిధ భాగస్వాముల నుంచి సమాచారాన్ని సేకరించడానికి, అనుమతులు పొందడానికి వివిధ వేదికలకు వెళ్ళ వలసి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు, పెట్టుబడులకు ముందస్తు సలహా, భూబ్యాంకులకు సంబంధించిన సమాచారం, కేంద్ర, రాష్ట్ర స్థాయిలో అనుమతుల సదుపాయం, సహా ఎండ్ టు ఎండ్ సదుపాయ మద్దతు కేంద్రీకృత పెట్టుబడుల అనుమతి కేంద్రాన్ని సృష్టించాలని ప్రతిపాదించడం జరిగింది. దీనినే 2020-21 బడ్జెట్లో ప్రకటించడం జరిగింది.
భారతదేశంలో వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడానికి అవసరమైన అనుమతులు/ ఆమోదాలను కేంద్ర, రాష్ట్ర స్థాయిలో పొందేందుకు ఈ కేంద్రాన్ని ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాంగా ఈ కేంద్రాన్ని రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భారత ప్రభుత్వంలోని, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు/ డిపార్ట్‌మెంట్లకు సంబంధించి ఉనికిలో ఉన్న మంత్రిత్వ శాఖల ఐటి పోర్టల్స్‌ను ఏరకంగా విఘాతం కలుగకుండా ఈ అనుమతుల వ్యవస్థలను సమగ్రం చేసి ఏక, ఏకీకృత అప్లికేషన్ ఫార్మ్ ద్వారా సమగ్రం చేసే జాతీయ పోర్టల్‌గా ఈ పెట్టుబడుల అనుమతుల కేంద్రం పని చేస్తుంది. దీని కారణంగా పెట్టుబడిదారులు సమాచార సేకరణకు, వివిధ భాగస్వాముల నుంచి అనుమతులు పొందడానికి బహుళ ప్లాట్‌ఫాంలను/ కార్యాలయాలను దర్శించాల్సిన అవసరం లేకుండా, నిర్ణీతకాలంలో పెట్టుబడిదారులకు ఆమోదాలను, వాస్తవ స్థితిలో పరిస్థితిని తాజాపరచడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఈ సమాచారాన్ని, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ శుక్రవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖిత సమాధానంలో ఈ సమాచారాన్ని ఇచ్చారు.
***
(Release ID: 1695539)