ప్రధాన మంత్రి కార్యాలయం

గుజ‌రాత్ ఉన్న‌త న్యాయ‌స్థానం వ‌జ్రోత్స‌వ సూచ‌కంగా ఈ నెల 6న నిర్వహించే కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన మంత్రి‌

Posted On: 04 FEB 2021 7:55PM by PIB Hyderabad

గుజ‌రాత్ ఉన్న‌త న్యాయ‌స్థానం వ‌జ్రోత్స‌వానికి గుర్తు గా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ‌నివారం  అంటే, ఈ నెల 6న, ఉద‌యం 10 గంట‌ల 30 నిమిషాల‌ కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సంగించ‌నున్నారు.  ఈ ఉన్న‌త న్యాయ‌స్థాయం ఏర్పాటై అరవై సంవ‌త్స‌రాలు పూర్తి అయిన ఘ‌ట‌న ను సూచించే ఒక స్మార‌క త‌పాలా బిళ్ళ‌  ను కూడా ఆయ‌న ఆవిష్క‌రిస్తారు.

ఈ కార్యక్రమం లో చ‌ట్టం, న్యాయం శాఖ కేంద్ర‌ మంత్రి, స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం న్యాయ‌మూర్తులు, గుజ‌రాత్ ఉన్న‌త న్యాయ‌స్థానం న్యాయ‌మూర్తులతో పాటు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి కూడా పాలుపంచుకోనున్నారు.  గుజ‌రాత్ న్యాయ స‌ముదాయం స‌భ్యులు సైతం ఈ కార్య‌క్ర‌మం లో పాల్గొంటారు.



 

***


(Release ID: 1695408) Visitor Counter : 113