అంతరిక్ష విభాగం

అంతరిక్ష సాంకేతికతపై ప్రధాని దృక్పథం ఆ రంగంలో భారీ ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది:డా.జితేంద్ర సింగ్

నాడు పోస్టు చేయడమైనది: 04 FEB 2021 1:41PM by PIB Hyderabad

అంతరిక్ష రంగంలో భారతదేశ సామర్థ్యాన్ని వెలికితీయడానికి; నైపుణ్యం, సామర్థ్యం, సృజనాత్మకతతో స్వావలంబన, ఆధునిక సాంకేతిక దేశంగా అవతరించడానికి అంతరిక్ష సాంకేతికతపై ప్రధాని దృష్టి పెట్టారని కేంద్ర అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డా.జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. ఈ విషయాన్ని లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభకు  వెల్లడించారు. ప్రధాని దృక్పథం అంతరిక్ష రంగంలో భారీ ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని మంత్రి తెలిపారు. విధాన నిర్ణయాలతో ప్రైవేట్ రంగానికి మార్గనిర్దేశం చేయడం, ప్రోత్సహించడం ద్వారా, అంతర్జాతీయ అంతరిక్ష సాంకేతికత కేంద్రంగా, అంతరిక్ష ఆస్తుల సామాజిక-ఆర్థిక వినియోగ పురోగతిలో భారత్‌ ప్రోత్సాహక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

    సామర్థ్యం, సృజనాత్మక నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ, జాతీయ వనరుల గరిష్టస్థాయి వినియోగం కోసం, సరఫరా ఆధారితం నుంచి డిమాండ్‌ ఆధారితం దిశగా అంతరిక్ష రంగ విధానాన్ని ప్రధాని దృక్పథం అడుగులు వేయిస్తుంది. పరిశోధన&అభివృద్ధి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంతరిక్షంలో సరికొత్త సరిహద్దులు సృష్టించడం, అంతరిక్ష అన్వేషణ, భవిష్యత్ తరాల సామర్థ్యాన్ని ఆకర్షించి, సంపూర్ణంగా వినియోగించుకోవడానికి మానవసహిత అంతరిక్షయానంపై దృష్టిని పెంచుతుంది.
    
    సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అందే ప్రజా సేవలను మరింత వేగంగా, చౌకగా, సమర్థవంతంగా మార్చడం ద్వారా, ప్రజలకు మెరుగైన ప్రయోజనాలను ప్రధాని అంతరిక్ష రంగ దృక్పథం అందిస్తుంది.

 

****


(రిలీజ్ ఐడి: 1695140) సందర్శకుల సూచీ సంఖ్య : : 240
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , Bengali , Manipuri , Punjabi , Tamil , Malayalam