ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రాష్ట్రాల ఆరోగ్య పథకాలతో ఆయుష్మాన్ భారత్ యోజన సమ్మేళ‌న‌ము

Posted On: 02 FEB 2021 4:25PM by PIB Hyderabad

'ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన' (ఏబీ-పీఎంజేఏవై) ఒక కేంద్ర ప్ర‌భుత్వం ప్రాయోజిత పథకం. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా 32 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో (యుటీ) అమలు చేయబడుతోంది. ఈ వైద్య పథకం రూపకల్పన ప్రకారం, ఏబీ-పీఎంజేఏవైను అమలు చేస్తున్న రాష్ట్రాలు/ ‌కేంద్రపాలిత ప్రాంతాలు తమ సొంత ఆరోగ్య సంరక్షణ పథకాలను ఏబీ-పీఎంజేఏవైతో కలిసి వారి స్వంత ఖర్చుతో నడుపుకునే సౌలభ్యం కూడా ఉంది. ఈ అమరిక ప్రకారం రాష్ట్రాలు/ యుటీలు ఆరోగ్య‌పు ప్ర‌యోజ‌న ప్యాకేజీలు, సాధారణ ఐటీ వేదిక‌ల‌ను మరియు పీఎమ్‌జేఏవై  గుర్తింపు పొందిన (ఎంపానెల్డ్) ఆసుప‌త్రుల నెట్‌వర్క్‌ల‌ను‌ కూడా వినియోగించుకోవచ్చు. ఈ పథకానికి గాను నిధుల‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల క‌లిసి పంచుకుంటాయి. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలు, శాసనసభతో కూడి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలు మినహా అన్ని రాష్ట్రాలు కేంద్రం ఈ వాటా నిష్పత్తి.. 60:40గా ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలు మరియు హిమాలయ రాష్ట్రాలకు ఈ నిష్పత్తి 90:10. శాసనసభలు లేని ఇత‌ర కేంద్రపాలిత ప్రాంతాలలో 100 శాతం ప్రీమియంను కేంద్రం భ‌రిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రూ.19,506 కోట్ల విలువైన 1.57 కోట్ల ఆస్పత్రిలో చేరిక కేసులు ఏబీ-పీఎంజేఏవైలోన‌మోదు అయ్యాయి. కొన్ని రాష్ట్రాలు/ యుటీలచే విస్తరించిన లబ్ధిదారుల విస్తృతి పోలిన డేటా వినియోగం కూడా ఇందులో ఉంది. అధీకృత ఆసుపత్రుల‌లో ప్రవేశాల ప్రత్యేకత వారీగా వివ‌రాలు ఇక్క‌డ జతచేయబడినాయి. ఆయా రాష్ట్రాల‌ ఆరోగ్య పథకాలతో పోల్చడానికి స‌మాచారం అందుబాటులో లేదు. వైద్య ప్ర‌త్యేక‌త వారీగా ఆసుప్ర‌తుల్లో చిక‌త్స కొర‌కు చేరికల‌ సంఖ్య, వైద్య మొత్తం

***


(Release ID: 1694743) Visitor Counter : 184