రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

110 మందితో ఆరంభ‌మైన నేశన‌ల్ డిఫెన్స్ కాలేజి 61వ కోర్సు

Posted On: 02 FEB 2021 3:52PM by PIB Hyderabad

నేష‌న‌ల్ డిఫెన్స్ కాలేజి (ఎన్‌డిసి) లో 61వ కోర్సు 110 మంది అభ్య‌ర్ధుల‌ తో ఈ నెల 1న మొద‌లైంది.  అంత‌క్రితం నిర్వ‌హించిన కోర్సు కంటే ఈ సారి 10 మంది అభ్య‌ర్ధులు ఎక్కువ‌గా  ఉన్నారు.  పెంచిన సీట్ల‌లో చాలా వ‌ర‌కు సీట్ల‌ను మిత్ర‌పూర్వ‌కంగా మెల‌గుతున్న విదేశాల కు చెందిన అధికారుల కు కేటాయించ‌డం జ‌రిగింది.  ఉజ్బెకిస్తాన్‌, తాజికిస్తాన్, ఫిలిపీన్స్, మాల్దీవ్స్ ల‌కు చెందిన అధికారులు చెప్పుకోద‌గ్గ విరామం అనంత‌రం ఈ కోర్సు లో పాల్గొంటున్నారు.  

మొట్ట‌మొద‌టి ఎన్‌డిసి కోర్సు ను 1960వ సంవ‌త్స‌రం లో నిర్వ‌హించారు.  ఇంత‌వ‌ర‌కు ప‌రిశీలిస్తే, ఈ కాలేజీ లో 3,899 మంది పూర్వ విద్యార్థులు ఉండగా వారిలో 835 మంది  69 మిత్ర‌పూర్వ‌క విదేశాల‌కు చెందిన వారు.  సివిల్ స‌ర్వీసుల‌ లో రెండు ఖాళీ లు పెరిగాయి.  ఎన్‌డిసి 61వ కోర్సు లో 19 మంది సివిల్ స‌ర్వీసుల అభ్య‌ర్ధులు ఉన్నారు.

61వ కోర్సు కు విదేశీ అధికారుల సంఖ్య పెర‌గ‌డాన్ని ఎన్‌డిసి క‌మాండెంట్ ఎయ‌ర్ మార్ష‌ల్ శ్రీ డి. చౌధురి స్వాగ‌తించారు. ఎన్‌డిసి ఇదివ‌ర‌క‌టి సంవ‌త్స‌రాల‌ లో ఎదురైన స‌వాళ్ళ‌ను అవ‌కాశాలుగా మార్చుకోగ‌ల‌ద‌న్న విశ్వాసాన్ని ఆయన వ్య‌క్తం చేశారు. ఇటీవ‌లే స్థాపించిన ‘ప్రెసిండెంట్స్ చైర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఆన్ నేశ‌న‌ల్ సెక్యూరిటీ’ ఎన్‌డిసి లో విద్య ప‌ర‌మైన ప్రావీణ్యానికి మెరుగులు దిద్ద‌డం లో తోడ్ప‌డ‌నుంద‌న్నారు.

నేష‌న‌ల్ డిఫెన్స్ కాలేజీ (ఎన్‌డిసి) తాలూకు వ‌జ్రోత్స‌వ సంవ‌త్స‌రాన్ని స్మ‌రించుకోవ‌డం కోసం 2020వ సంవ‌త్స‌రం న‌వంబ‌రు 2వ తేదీన ఈ చైర్ ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రప‌తి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు.  ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప‌ద‌విలో తొలి అధికారిగా ఎయ‌ర్ వైస్ మార్ష‌ల్ డాక్ట‌ర్ అర్జున్ సుబ్ర‌మ‌ణియ‌మ్ (ఎవిఎస్ఎమ్‌, రిటైర్డ్‌) ను నియ‌మించ‌డం జ‌రిగింది.


 

***



(Release ID: 1694494) Visitor Counter : 166