ఆర్థిక మంత్రిత్వ శాఖ

పునరుద్ధరించిన సంస్కరణల ఆధారిత ఫలితం-అనుసంధాన విద్యుత్ పంపిణీ రంగంకోసం రూ .3, 05,984 కోట్ల పథకం ప్రారంభించనున్నారు

గ్రీన్ పవర్ వనరుల నుంచి హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయడం కొరకు2021-22లో హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ ప్రారంభించబడుతుంది.

పంపిణీ సంస్థల నుంచి ఎంచుకోవడానికి వినియోగదారులకు ప్రత్యామ్నాయాలుఇవ్వడానికి పోటీ ముసాయిదా

Posted On: 01 FEB 2021 1:52PM by PIB Hyderabad

 

   గడచిన ఆరేళ్లలో విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడంతోపాటు ఎన్నో విజయాలు నమోదయ్యాయి. ఆ మేరకు 139 గిగావాట్ల మేరకు అదనపు ఉత్పాదక సామర్థ్యం జోడించబడింది. అలాగే అదనంగా 1.41 లక్షల కిలోమీటర్ల మేర సరఫరా లైన్లను విస్తరించగా, 2.8 కోట్ల అదనపు నివాసాలకు విద్యుత్ సరఫరా సదుపాయం కల్పించబడింది.

 

Power Sector - Copy.jpg

   ఈ నేపథ్యంలో పంపిణీ కంపెనీ (డిస్కమ్)ల నిర్వహణ సాధ్యతపై ఆర్థికశాఖ మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఫలితాలతో అనుసంధానించిన పునర్నవీకృత సంస్కరణలతో కూడిన విద్యుత్ పంపిణీరంగ పథకాన్ని ప్రవేశపెడతామని ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఐదేళ్ల కాలానికిగాను రూ.3,05,984 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక మెరుగుదలతో ముడిపడిన ప్రీ-పెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, వ్యవస్థల ఉన్నతీకరణ, ఫీడర్ల విభజన, తదితర మౌలిక సదుపాయాల కల్పన దిశగా ఈ పథకం డిస్కమ్‌లకు తోడ్పడుతుంది.

 

***


(Release ID: 1694207) Visitor Counter : 299