ఆర్థిక మంత్రిత్వ శాఖ
13 రంగాలలో పిఎల్ఐ పథకాల కోసం 2021-22 ఆర్థిక సంవత్సరం మొదలుకొని రాబోయే 5 సంవత్సరాల కాలంలో 1.97 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంచేసేందుకు కంకణం కట్టుకున్న ప్రభుత్వం
మూడేళ్ళలో కొత్తగా 7 టెక్స్ టైల్ పార్కులను ప్రారంభించడం జరుగుతుంది
Posted On:
01 FEB 2021 1:41PM by PIB Hyderabad
కీలకమైన రంగాలను విస్తరించడానికి, ప్రపంచ స్థాయి లో అగ్రగామి సంస్థలుగా నిలువగలిగిన వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసి, వాటిని పెంచి పోషించడానికి, మన యువతకు ఉద్యోగాలు కల్పించడానికి 2021-22 ఆర్థిక సంవత్సరం మొదలుకొని రాబోయే 5 సంవత్సరాల కాలం లో సుమారు గా 1.97 లక్షల కోట్ల రూపాయల మేరకు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్ కేంద్ర బడ్జెటు ను సోమవారం దిల్లీ లో పార్లమెంటులో ప్రవేశపెడుతూ ఈ మేరకు ప్రతిపాదన చేశారు.
5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ గా భారతదేశం రూపొందాలంటే భారతదేశ తయారీ కంపెనీ లు, ప్రపంచ సరఫరా వ్యవస్థలలో ఒక భాగం గా రూపొందవలసిన అవసరంతో పాటు కీలకమైన సామర్ధ్యాన్ని, అత్యాధునిక సాంకేతిక విజ్ఞానాన్ని అందుకోవలసిన అవసరం కూడా ఉందని, దీనికి గాను మన తయారీ రంగం స్థిర ప్రాతిపదికన రెండంకెల వృద్ధి ని సాధించాలని శ్రీమతి సీతారమణ్ అన్నారు. దీనిని సాధించడానికి ఒక ‘ఆత్మనిర్భర్ భారత్’ ను ఆవిష్కరించేందుకు తయారీ రంగం లో ప్రపంచ స్థాయి లో విజేతలుగా నిలచే వ్యాపార సంస్థలను తీర్చిదిద్దడానికి 13 రంగాలలో ఉత్పత్తితో ముడిపెట్టి అందించే ప్రోత్సాహకం (పిఎల్ఐ) పథకాలను ప్రకటించడం జరిగిందని ఆమె వివరించారు.
రాబోయే మూడేళ్ళలో 7 నూతన టెక్స్ టైల్ పార్కులను ప్రారంభించడం జరుగుతుంది
పిఎల్ఐ కి అదనం గా, వస్త్ర పరిశ్రమ ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగాను, భారీ పెట్టుబడులను ఆకర్షించేటట్లుగాను, ఉద్యోగ కల్పనకు ఉత్తేజాన్ని అందించడానికి గాను మెగా ఇన్వెస్ట్ మెంట్ టెక్స్ టైల్స్ పార్క్స్ (ఎమ్ఐటిఆర్ఎ) పథకాన్ని కూడా ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఇది ఎగుమతులలో ప్రపంచ స్థాయి విజేతలను ఆవిష్కరించడానికి వీలుగా ప్లగ్ ఎండ్ ప్లే సౌకర్యం తో కూడిన ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలను నిర్మించగలుగుతుందని శ్రీమతి సీతారమణ్ అన్నారు. రాబోయే 3 సంవత్సరాల లోపల 7 టెక్స్ టైల్ పార్కులను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆర్థిక మంత్రి అన్నారు.
***
(Release ID: 1694084)
Visitor Counter : 270