ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశవ్యాపిత 2021 పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
' పోలియో ఆదివారం' సందర్భంగా 17 కోట్లకు పైగా పిల్లలకు పోలియో చుక్కలు
దశాబ్ద కాలంగా ఒక్క పోలియో కేసు లేదు : చివరి కేసు 2011లో నమోదు-డాక్టర్ హర్షవర్ధన్
'' రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఆరోగ్య కార్యకర్తలు వాలంటీర్లు ప్రజాసంఘాల సమిష్టి కృషి వల్ల దేశంలో పోలియో 30 సంవత్సరాలుగా పోలియో రహిత దేశంగా భారతదేశం''
Posted On:
30 JAN 2021 6:26PM by PIB Hyderabad
దేశంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో అయిదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలను వేసి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీ అశ్వినీకుమార్ సమక్షంలో ప్రారంభించారు.
జాతీయ పోలియో నిర్మూలనా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి తన సతీమణి శ్రీమతి సవితా కోవింద్ తో కలసి పిల్లలకు పోలియో చుక్కలను వేశారు. జనవరి 31వ తేదీ (ఆదివారం) జాతీయ పోలియో నిర్మూలనా దినోత్సవంగా నిర్వహించనున్నారు. దీనిని పోలియో ఆదివారంగా కూడా పిలుస్తారు. దేశాన్ని పోలియో రహిత దేశంగా కొనసాగించడానికి దేశవ్యాపితంగా ఐదేళ్లలోపు వయస్సు వున్న 17 కోట్ల మంది పిల్లలకు పోలియో చుక్కలను వేయడం జరుగుతుంది. ఈ భారీ కార్యక్రమంలో 24లక్షల మంది వాలంటీర్లు, 1.5 లక్షల మంది సూపర్వైజర్లు, పౌరసంఘాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునెస్కో, రోటరీ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. ఆరోగ్య కార్యకర్తలు రెండు కోట్లకు పైగా గృహాలను దర్శించి అయిదేళ్ల లోపు వయస్సు వున్న ప్రతి ఒక్కరూ పోలియో చుక్క తీసుకొనేలా చూస్తారు.
కార్యక్రమ ప్రారంభకార్యక్రమంలో మాట్లాడిన డాక్టక్ హర్షవర్ధన్ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ సమయంలో కూడా రాష్ట్రపతి దంపతులు ఈ కార్యక్రామానికి హాజరై నివారించగల వ్యాధుల నుంచి పిల్లలందరిని రక్షించే అంశంలో భారతదేశం కనబరుస్తున్న చిత్తశుద్ధిని చాటారని మంత్రి అన్నారు.
తాను ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో పోలియో నిర్మూలనకు అమలుచేసిన కార్యక్రమాన్ని డాక్టర్ హర్షవర్ధన్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ప్రపంచంలో నమోదైన పోలియో కేసులలో 60% భారతదేశంలో నమోదు అయ్యేవని మంత్రి చెప్పారు. '' పోలియోను నిర్మూలించడానికి అనుసరించవలసి వున్న వ్యూహాన్ని 1993 రూపొందించడం జరిగింది. 1994 అక్టోబర్ రెండవ తేదీన పోలియో రాకుండా చూడడానికి వాక్సిన్ ఇవ్వడంతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. ఒకేరోజున 4000 కేంద్రాలలో 12 లక్షల మందికి చుక్కలను వేయడం జరిగింది. ఈ కార్యక్రమం వల్ల ఢిల్లీలో విజయవంతం కావడంతో జాతీయ స్థాయిలో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. మరో ఏడాది తరువాత ఈ వ్యూహాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా దేశాలలో అమలు చేయడం ప్రారంభించింది. ఆఫ్రికాలో ' పోలియోని ఆఫ్రికా నుంచి తన్ని తగిలేయాలి' నినాదంతో శ్రీ నెల్సన్ మండేలా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు' అంటూ డాక్టర్ హర్షవర్ధన్ గతాన్ని గుర్తు చేసుకున్నారు.
'' ఈ కార్యక్రమం ప్రారంభం కాకముందు ప్రపంచంలో నమోదయిన పోలియో కేసులలో 60 శాతం భారతదేశంలోనే నమోదుఅయ్యేవి. కార్యక్రమం విజయవంతం కావడంతో పోలియో రహిత దేశంగా భారతదేశం గుర్తింపు పొందింది. చివరిగా 2011 జనవరి 13వ తేదీన హౌరాలో ఆఖరి పోలియో కేసు నమోదయింది. గత దశాబ్దకాలంగా పోలియో రహిత దేశంగా భారతదేశం వుంది'' అని మంత్రి వివరించారు.
ఇంతవరకు సాధించిన ప్రగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి వ్యాధి నిరోధక చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. '2014 మార్చి 27వ తేదీన భారతదేశంతో పాటు ఆగ్నేయాసియా దేశాలను పోలియో రహిత దేశాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించడం ప్రజారోగ్యరంగంలో సాధించిన గొప్ప విజయం. అయితే, పోలియో పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రపంచం పోలియో నుంచి పూర్తిగా విముక్తి పొందేంత వరకు వ్యాధి నిరోధక చర్యలను అమలు చేయవలసి ఉంటుంది. మన పొరుగు దేశాలతో పాటు కొన్ని దేశాలలో పోలియో వైరస్ ప్రభావం వుంది. ఇది మనకు కూడా పాకే ప్రమాదం ఉందని గుర్తించాలి. తూర్పు మధ్యధరా ప్రాంతానికి చెందిన పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలలో ఇప్పటికీ పోలియో కేసులు నమోదు అవుతున్నాయి'' అని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.
పోలియోతో పాటు ఇతర వ్యాధుల నుంచి పిల్లలను రక్షించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ నేతృత్వంలో కేంద్రప్రభుత్వం చర్యలను అమలు చేస్తున్నదని మంత్రి అన్నారు. న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్, రోటవైరస్ వ్యాక్సిన్ మరియు మీజిల్స్-రుబెల్లా వ్యాక్సిన్ వంటి అనేక కొత్త వ్యాక్సిన్లను ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపిన మంత్రి ఇంజెక్షన్ల ద్వారా పోలియో వాక్సిన్ ను ప్రవేశపెట్టి పిల్లలకు కేంద్రం అదనపు రక్షణ కల్పిస్తున్నదని మంత్రి తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలను వివరించిన మంత్రి “మా పిల్లలను మరింత వ్యాధుల నుండి రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఈ కార్యక్రమం కింద అన్ని టీకాలు మన దేశంలో ప్రతి ఒక్క బిడ్డకు చేరడం చాలా ముఖ్యం. పోలియో కార్యక్రమం కింద సాధించిన అనుభవాలను మిషన్ ఇంద్రధనుష్, గ్రామ్ స్వరాజ్ అభియాన్, ఎక్స్టెండెడ్ గ్రామ్ స్వరాజ్ అభియాన్ మరియు ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ I మరియు II లలో అమలు చేస్తూ సాధారణ రోగనిరోధక శక్తిని ఎక్కువ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. దీనివల్ల 2018 నాటికి దేశంలో 90% రోగనిరోధకత శక్తి సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. ఆ తరువాత కూడా ఇది అమలు జరుగుతుంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో గుర్తించిన లోపాలను సవరించి 2021 ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో దేశంలోని 250 హై రిస్క్ జిల్లాల్లో ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ తదుపరి దశ అమలు జరుగుతుంది. దీనితో పాటు వ్యాక్సిన్ ద్వారా నివారించగల వ్యాధుల సమాచారం రాష్ట్రాలకు అందించడం జరిగింది'' అని మంత్రి వివరించారు.
పోలియో కార్యక్రమానికి ఇతర రోగనిరోధకత కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ మరియు రోటరీ ఇంటర్నేషనల్ వంటి సహాయక సంస్థల అందిస్తున్న సహకారాలను ఆరోగ్య మంత్రి ప్రశంసించారు. దేశాన్ని పోలియో రహితంగా ఉంచడంలో చేసిన కృషికి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది వాలంటీర్లు, ఫ్రంట్లైన్ కార్మికులు మరియు ఆరోగ్య అధికారులు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. "టీకా కోసం తమ పిల్లలను పోలియో బూత్‌లకు తీసుకువచ్చిన మరియు తీసుకువచ్చిన ఆ తల్లులందరికీ నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికిఅన్ని విధాలుగా సహకరించిన దేశంలోని పురుషులు మరియు మహిళలందరికీ నా కృతజ్ఞతలు ”అని డాక్టర్ హర్ష్ వర్ధన్ పేర్కొన్నారు.
కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, డాక్టర్ అదనపు కార్యదర్శి మనోహర్ ఆగనాని, ఈ కార్యక్రమంలో డాక్టర్ రోడెరికో ఓర్ఫిన్ సెక్యూరిటీ (హెల్త్), మోహెచ్ఎఫ్డబ్ల్యు, డబ్ల్యూహెచ్ఓ దేశ ప్రతినిధి, యునిసెఫ్ దేశ ప్రతినిధి డాక్టర్ యాస్మిన్ అలీ హక్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 1693652)
Visitor Counter : 296