ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆరోగ్య ఫలితాలపై పిఎంజెఎవై బలమైన, సానుకూల ఫలితాలను చూపిస్తున్నట్టు వెల్లడించిన ఆర్థిక సర్వే 2020-21 కీలక పరిశీలనలు
లాక్‌డౌన్ సమయంలో కూడా పిఎంజెఎవై ఆధారపడిన ప్రజలు
ఆరోగ్య బీమా కవరేజ్‌ను చెప్పుకోదగిన రీతిలో పెంచిన పిఎంజెఎవై
పిఎంజెఎవైని అమలు చేస్తున్న, చేయని రాష్ట్రాల మధ్య పోలిక ఆయా రాష్ట్రాలలో ఆరోగ్య ఫలితాలలో ఉన్న తేడాలను బలంగా రుజువు చేశాయి
Posted On:
29 JAN 2021 3:44PM by PIB Hyderabad
దేశంలో అత్యంత బలహీనవర్గాలకు ఆరోగ్య సంరక్షణను అందించాలన్న లక్ష్యంతో భారత ప్రభుత్వం 2018లో ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ యోజనలో కీలకమైన, ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పిఎంజెఎవై), ఈ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాలలో ఆరోగ్య సంరక్షణ ఫలితాలపై బలమైన సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ అంశాన్ని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ శుక్రవారం విడుదల చేసిన ఆర్థిక సర్వే ఈ విషయాన్ని పేర్కొంది.
అత్యంత తరచుగా, తక్కువ ఖర్చుతో కూడిన ఈ ఆరోగ్య సేవలను సాధారణంగా ఉద్యోగించుకునేందుకు పిఎంజెఎవైని వినియోగించుకుంటున్నారని సర్వే ప్రముఖంగా పేర్కొంది. కోవిడ్ మహమ్మారి సమయంలోనూ, లాక్‌డౌన్ కాలంలోనూ కూడా డయాలసిస్ వంటి సేవలను ఎటువంటి ఆటంకం లేకుండా వినియోగించుకున్న విషయాన్ని పట్టి చూపింది. మొత్తం క్లెయిములలో సగం ఉండే ప్రధాన చికిత్సా సంబంధిత జనరల్ మెడిసిన్, లాక్ డౌన్ సమయంలో భారీగా పడి, డిసెంబర్ 2020కి కోవిడ్ ముందు స్థాయిని చేరుకుంది, దాని గ్రాఫ్ వి ఆకారంలో పడి, లేచిన దాఖలాలను స్పష్టంగా చూపింది. నానాటికీ డయాలసిస్ క్లెయిములు పెరుగుతున్న క్రమంలో నేషనల్ డయాలసిస్ మిషన్‌ను పిఎంజెఎవైలో విలీనం చేయవచ్చని ఆర్థిక సర్వే పట్టి చూపింది.
పిఎంజెఎవై, ఆరోగ్య ఫలితాలుః అంతరంలో అంతరం
అంతరంలో అంతరం విశ్లేషణ ఆధారంగా ఆరోగ్య ఫలితాలపై పిఎంజెఎవై ప్రేరణాత్మక ప్రభావాన్ని అంచనా వేసేందుకు తన కీలక విశ్లేషణలో ఆర్థిక సర్వే యత్నించింది. పిఎంజెఎవైను 2018 మార్చిలో అమలు చేయడం ప్రారంభించినందున, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలు 4 (2015-16లో) 5 (2019-2020లో) నిర్వహించినందున, అంతకు ముందు- తర్వాత డాటా ప్రభావాన్ని అంచనా వేయడానికి అందుబాటులో ఉంది. బడ్జెట్ ముందస్తు సర్వే పిఎంజెఎవై అమలు చేసిన రాష్ట్రాలను, పథకాన్ని అమలు చేయని వాటితో పోల్చింది.
పొరుగు రాష్ట్రాలతో పశ్చిమ బెంగాల్ పోలిక
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి వచ్చిన డాటాను, దాని పొరుగు రాష్ట్రాలైన బీహార్, అస్సాం, సిక్కింతో పోలుస్తూ, 2015-16 నుంచి 2019-20 వరకు బీహార్, అస్సాం, సిక్కింలలో ఆరోగ్య బీమా కలిగిన కుటుంబాల సంఖ్య 89% పెరగ్గా, అదే కాలంలో పశ్చిమ బెంగాల్‌లో 12% తగ్గిందని ఆర్థిక సర్వే నిరూపించింది. అదనంగా, 2015-16 నుంచి 2019-20 వరకు పశ్చిమ బెంగాల్‌లో శిశు మరణాల రేటు 20% తగ్గిందని, పొరుగు మూడు రాష్ట్రాలలో అది 28%గా ఉందని పేర్కొంది. అలాగే, 5 ఏళ్ళకన్నా తక్కువ వయసు ఉన్న వారి మరణాలు పశ్చిమ బెంగాల్‌లో 20% తగ్గగా, పొరుగు రాష్ట్రాలలో అది 27%గా ఉంది. గర్భ నిరోధకతలో ఆధునిక పద్ధతులు, మహిళా వంధ్యీకరణం (స్టెరిలైజేషన్), మాత్రల వాడకం పొరుగున ఉన్న మూడు రాష్ట్రాలలో వరుసగా 36%, 22%, 28% పెరగ్గా, పశ్చిమ బెంగాల్ తత్సంబంధిత మార్పులు అతితక్కువగా ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా పిల్లలను కనడానికి మధ్య పాటించవలసిన కాలం విషయంలో పశ్చిమ బెంగాల్ చెప్పుకోదగిన తగ్గుదల చూపలేదు, కాగా, పొరుగు మూడు రాష్ట్రాలలో అది 37%కి పడిపోయినట్టు నమోదైంది. మాతా శిశు సంరక్షణలో వివిధ కొలమానాలు పశ్చిమ బెంగాల్‌లో కంటే పొరుగు రాష్ట్రాలలో మెరుగుపడినట్టు వెల్లడి అయింది.
పిఎంజెఎవై అమలు చేయని రాష్ట్రాలతో చేస్తున్న రాష్ట్రాలను పొల్చడం
పిఎంజెఎవైను అమలు చేస్తున్న రాష్ట్రాలను, చేయని రాస్ట్రాలతో ఆర్థిక సర్వే పోల్చింది. పిఎంజెఎవైని అమలు చేయని రాష్ట్రాల కన్నా అమలు చేస్తున్న రాష్ట్రాలలో అనేక ఆరోగ్య ఫలితాలు చెప్పుకోదగినట్టుగా మెరుగుపడిన విషయం సర్వేలో ప్రతిఫలించింది. పిఎంజెఎవైని అమలు చేయని రాష్ట్రాలలో కన్నా చేస్తున్న రాష్ట్రాలలో ఆరోగ్య బీమా ఎక్కువగా చొచ్చుకుపోవడమే కాక, శిశు, బాలల మరణాల రేట్లు తగ్గడం, కుటుంబ నియంత్రణ సేవల మెరుగ్గా అందుబాటులోకి రావడాన్ని సాధించడం, వినియోగించడం, హెచ్ ఐవి/ ఎయిడ్స్ పట్ల మరింత చైతన్యం ఉన్నదని వార్షిక సర్వే పేర్కొంది. ఇందులో అనేక ప్రభావాలు బీమా కవరేజ్ కారణంగా పెరిగిన సంరక్షణ ఫలితంగా ప్రత్యక్షంగా పరిణమించాయని, మిగిలినవి దాని ప్రభావం కారణంగా వచ్చిన వాటికి ప్రాతినిధ్యం వహిస్తాయి. దానిని ప్రవేశపెట్టి కొద్ది కాలమే అయినప్పటికీ, సర్వే గుర్తించిన ప్రభావాలు ప్రత్యేకంగా బలహీనవర్గాలకు, సాధారణంగా దేశంలో ఆరోగ్య క్షేత్రాన్ని చెప్పకోదగిన విధంగా ఎలా మార్పు చేయగలవో ఈ కార్యక్రమ సామర్థ్యం నొక్కి చెప్తుంది.
సర్వే ఏం పేర్కొందంటేః
ఎ. ఆరోగ్య బీమా లేక ఆర్థిక పథకం కిందకు వచ్చిన సాధారణ సభ్యలతో కూడిన కుటుంబాల నిష్ఫత్తి పిఎంజెఎవై అమలు చేస్తున్న రాష్ట్రాలలో ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ 4 నుంచి ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ 5నాటికి 54 శాతం పెరిగ్గా, పిఎంజెఎంవైను స్వీకరించిన రాష్ట్రాలలో అది 10% తగ్గింది. ఇది, ఆరోగ్య బీమా కవరేజీని పెంచడంలో పిఎంజెఎవై విజయాన్ని ప్రతిబింబిస్తుంది.
బి. శిశు మరణాల రేటు పిఎంజెఎవై రాష్ట్రాలలో 20 శాతం తగ్గగా, పిఎంజెఎవైయేతర రాష్ట్రాలలో 12శాతం మాత్రమే ఉంది. పిఎంజెఎవైని అమలు చేయని రాష్ట్రాలలో కన్నా చేస్తున్న రాష్ట్రాలలో అది 8% ఎక్కువగా తగ్గింది.
సి. రెండు సర్వేల నడుమ అన్ని రాష్ట్రాలలో కుటుంబ నియంత్రణ పాటిస్తున్న ప్రజల నిష్పత్తి పెరిగింది. ముఖ్యంగా పిఎంజెఎంవైను అమలు చేస్తున్న రాష్ట్రాలలో ఇది ఎక్కువగా ఉండటం దాని ప్రభావాన్ని సూచిస్తుంది.
డి. పిఎంజెఎవై రాష్ట్రాలలో మొత్తం కుటుంబ నియంత్రణకు సంబంధించిన అవసరాలు తీరని మహిళల శాతం 31 శాతం తగ్గగా, పిఎంజెఎవైని అమలు చేయని రాష్ట్రాలలో అది కేవలం 10%గా ఉంది.
ఇ. ప్రసూతి సంరక్షణ సూచీలలో మెరుగుదల, ఉదా. వ్యవస్థాగత జననాలు, ప్రభుత‌్వ కేంద్రంలో లో సంస్థాగత జననాలు, ఇంట్లో ప్రసవాలు పిఎంజెఎవైను అమలు చేయని రాష్ట్రాలలో అధికంగా ఉన్నాయి. సిజేరియన్ కాన్పులలో మొత్తంగా పెరుగదల ఉండగా, ప్రైవేటు ఆరోగ్య కేంద్రాలలో మినహాయిస్తే, పిఎంజెఎవైని అమలు చేయని రాష్ట్రాలతో పోలిస్తే అమలు చేస్తున్న రాష్ట్రాలలో వాటి శాతం పెరిగింది. కనుక, ప్రసూతి సంరక్షణ విషయంలో పిఎంజెఎవై అంత ప్రభావం చూపలేకపోయిందని సర్వే పేర్కొంది.
ఎఫ్. హెచ్ ఐవి/ ఎయిడ్్స విషయంలో సమగ్ర జ్ఞానం కలిగిన మహిళల శాతం పిఎంజెఎవై రాష్ట్రాలలో చెప్పుకోదగిన విధంగా 13 శాతం పెరగ్గా, పిఎంజెఎవై అమలు కాని రాష్ట్రాలలో దాని పెరుగుదల 2శాతం మాత్రమే. పురుషుల విషయంలో ఈ గణాంకాలు మరీ స్పష్టం, పిఎంజెఎవై రాష్ట్రాలలో అది 9శాతం పెరగ్గా, పిఎంజెఎవైయేతర రాష్ట్రాలలో అది 39 శాతం తగ్గింది.
భారత ప్రభుత్వం 2018, మార్చిలో దేశంలోని అత్యంత బడుగు వర్గాలకు ద్వితీయ, తృతీయ శ్రేణి ఆరోగ్య సంరక్షణ సేవలను అందించాలన్న చారిత్రిక లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఎబి-పిఎంజెఎవై)ని ప్రారంభించింది. మొత్తం 10.74 కోట్ల పేద, బడుగు కుటుంబాలలో దాదాపు 50 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒక కుటుంబానికి ఏడాదికి రూ. 5లక్షల విలువ గల ఆరోగ్య సంరక్షణను, సేవలను అందిస్తుంది. దీనితో పాటుగా, ప్రభుత్వ, ఎంపానెల్ చేసిన ప్రైవేటు ఆరోగ్య సేవలు అందించే సంస్థల నెట్‌వర్క్ ద్వారా ద్వితీయ, తృతీయ శ్రేణి హాస్పెటలైజేషన్ సౌకర్యం కల్పిస్తుంది. దీనికిందకి మొత్తం 23 స్పెషాలిటీలు సహా 1573 ప్రొసీజర్లు వస్తాయి. జాతీయ ఆరోగ్య అథారిటీ (ఎన్ హెచ్ ఎ, 2019) విడుదల చేసిన పిఎంజెఎవై తాజా వార్షిక నివేదిక ప్రకారం 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పథకాన్ని అమలు చేశాయి.
***
(Release ID: 1693456)
Visitor Counter : 370