మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

దేశంలో ఏవియన్ ఇన్‌ఫ్లుయాంజా‌ స్థితి

Posted On: 27 JAN 2021 4:23PM by PIB Hyderabad

 

బుధ‌వారం నాటికి (27వ తేదీ) వరకు, దేశంలో ఏవియన్ ఇన్‌ఫ్లుయాంజా(బర్డ్ ఫ్లూ) వ్యాప్తి 9 రాష్ట్రాలలో (కేరళ, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గ ఢ్‌, ఉత్తరాఖండ్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్) ఉన్న పౌల్ట్రీ పక్షులు  మరియు మ‌రో 12 రాష్ట్రాల‌లో (మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ మరియు పంజాబ్) కాకి/ వలస/ అడవి పక్షులలో క‌నిపించింది.
మహారాష్ట్రలోని నాందేడ్, సోలాపూర్,పుణె, అహ్మద్‌నగర్, బుల్ధానా, అకోలా, నాసిక్ మరియు హింగోలి జిల్లాల నుండి వచ్చిన పౌల్ట్రీ నమూనాలలో ఏవియన్ ఇన్‌ఫ్లుయాంజా నిర్ధారించబడింది; మ‌రోవైపు గుజరాత్‌లోని భావ్‌నగర్, ఛత్తీస్‌గఢ్‌
రాష్ట్రంలోని ధమ్‌తారి జిల్లాలోని వ‌చ్చిన పౌల్ట్రీ నమూనాలలో కూడా ఏవియన్ ఇన్‌ఫ్లుయాంజా నిర్ధారించబడింది. దీనికితోడు ఉత్తరాఖండ్ రాష్ట్రం (రుద్రప్రయాగ్ ఫారెస్ట్ డివిజన్) లోని కాకిలో ఏవియ‌న్ ఇన్‌ఫ్లుయాంజా నిర్ధారించబడింది; ‌ జునాగడ్‌లో (గుజరాత్) ఇన్‌టైటార్‌, బీడ్‌లోని(మహారాష్ట్ర) లో ఇన్పీకాక్‌లో ఉన్న కాకుల్లోనూ ఏవియన్ ఇన్‌ఫ్లుయాంజా నిర్ధారించబడింది. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గ‌ఢ్‌, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్‌లోని ప్రభావిత కేంద్రాలలో ఏవియన్ ఇన్‌ఫ్లుయాంజా నియంత్రణ నియంత్రణ కార్యకలాపాలు (శుభ్రపరచడం మరియు క్రిమిసంహారక) చురుగ్గా సాగుతున్నాయి. పౌల్ట్రీ మినహా ఇతర జాతుల పక్షులలో ఏవియన్ ఇన్‌ఫ్లుయాంజా నిర్ధారించబడిన‌ ప్రదేశాలలో నిఘా పనులు కొనసాగుతున్నాయి. కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పౌల్ట్రీ పక్షులు, గుడ్లు, పౌల్ట్రీ ఫీడ్లను మాంసంగా చేసి/ పారవేసే రైతులకు పరిహారం చెల్లించబడుతుంది. కేంద్ర ప్ర‌భుత్వ ప‌శు సంవ‌ర్థ‌క‌, మ‌రియు పాల ఉత్ప‌త్తి (డీఏహ‌చ్‌డీ) శాఖకు చెందిన‌ ఎల్‌హెచ్ & డీసీ పథకం యొక్క ఏఎస్‌సీఏడీ విభా‌గం కింద 50:50 షేరింగ్ ప్రాతిపదికన రాష్ట్రాలు/ కేంద్ర ‌పాలిత ప్రాంతాల‌కు ప‌రిహారం నిధులను అందిస్తుంది. బర్డ్ ఫ్లూ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం కింద, ఇన్‌ఫెక్ఫ‌న్ సోకిన ప్రాంతానికి  కిలోమీటర్ల వ్యాసార్థంలో పౌల్ట్రీ మరియు ఇతర పక్షులు, గుడ్లు మరియు పౌల్ట్రీ ఫీడ్ మరియు వ్యాధి నియంత్రణ ఖర్చుల నిర్వహణకు గాను రూ.130 లక్షల పరిహార ప్యాకేజీని మహారాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఏవియన్ ఇన్‌ఫ్లుయాంజా 2021 యొక్క నివారణ, నియంత్రణ కోసం సవరించిన కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా రాష్ట్రాలు/ యుటీలు అనుసరించిన నియంత్రణ చర్యలకు సంబంధించి స‌మ‌స్త స‌మాచారాన్ని రాష్ట్రాలు ప్రతిరోజూ కేంద్ర ప్ర‌భుత్వ శాఖ‌కు నివేదిస్తున్నాయి. ట్విట్టర్, ఫేస్‌బుక్ హ్యాండిల్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో సహా వివిధ‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఏవియన్ గురించి అవగాహన కల్పించడానికి డిపార్ట్‌మెంట్‌ నిరంతర ప్రయత్నాలు చేస్తోంది.
                           

***



(Release ID: 1692855) Visitor Counter : 146