ప్రధాన మంత్రి కార్యాలయం
డబ్ల్యుఇఎఫ్ కు చెందిన దావోస్ డైలాగ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ నెల 28న ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
Posted On:
27 JAN 2021 4:35PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) కు చెందిన దావోస్ డైలాగ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ నెల 28న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. ప్రపంచవ్యాప్తం గా 400 మందికి పైగా అగ్రగామి పారిశ్రామిక నేత లు హాజరు అయ్యే ఈ సదస్సు లో ప్రధాన మంత్రి ‘మానవాళి హితం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న నాలుగో పారిశ్రామిక విప్లవం’ అంశం పై మాట్లాడుతారు. ఈ కార్యక్రమం లో భాగం గా ముఖ్య నిర్వహణ అధికారి( సిఇఒ) లతో కూడా ప్రధాన మంత్రి మాట్లాడుతారు.
కొవిడ్ అనంతర జగతి లో, ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) చేపడుతున్న ‘గ్రేట్ రిసెట్ ఇనీశియేటివ్’ కు దావోస్ డైలాగ్ తాలూకు చర్చాంశాల పట్టిక నాందీ ప్రస్తావన గా నిలవనుంది.
***
(Release ID: 1692719)
Visitor Counter : 229
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam