యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

రెజ్లింగ్ జాతీయ ఛాంపియన్ ‌షిప్ పోటీలలో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన పై నివేదిక కోరిన - ఎస్.ఏ.ఐ.

Posted On: 24 JAN 2021 2:23PM by PIB Hyderabad

కరోనా వైరస్ మహమ్మారి నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో క్రీడా పోటీలను నిర్వహించడానికి రూపొందించిన ఎస్.ఓ.పి. లలో పేర్కొన్న విధంగా, సామాజిక దూరం పాటించాలన్న నిబంధనలు, ఇతర విధానాలను, నోయిడా స్టేడియంలో, జనవరి 23వ తేదీన జరిగిన రెజ్లింగ్ జాతీయ ఛాంపియన్‌ షిప్ పోటీలలోఉల్లఘించారన్న మీడియా కథనాలను, భారత క్రీడా ప్రాధిఖార సంస్థ, పరిగణలోకి తీసుకుంది.

ఈ విషయమై, ఎస్.ఏ.‌ఐ.  డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్ మాట్లాడుతూ,  "మేము, ఈ విషయాన్ని, భారత రెజ్లింగ్ సమాఖ్య దృష్టికి తీసుకువెళ్ళి, క్రీడా పోటీల నిర్వహణలో ఎస్.ఓ.పి. నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలియజేశాము. నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలపై, సోమవారం నాటి కల్లా నివేదిక సమర్పించాలని కూడా మేము సమాఖ్యను కోరడం జరిగింది. ప్రోటోకాల్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తామని, ఈ సందర్భంగా సమాఖ్య హామీ ఇచ్చింది." అని పేర్కొన్నారు. 

క్రీడాకారుల (అథ్లెట్ల) భద్రతను నిర్ధారించడానికి,  కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, జాతీయ క్రీడా సమాఖ్యలన్నింటికీ తెలియజేయాలని కూడా,  భారత ఒలింపిక్ అసోసియేషన్ను ఎస్‌.ఏ.ఐ. కోరింది. 

*****



(Release ID: 1691934) Visitor Counter : 109