ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 టీకా కార్యక్రమం తాజా సమాచారం
దేశవ్యాపితంగా 15 లక్షలకు పైగా ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు
8వ రోజు సాయంకాలం 6 గంటల వరకు టీకా కార్యక్రమంలో 1,46,598 మందికి లభ్ది
0.0007% మంది మాత్రమే టీకా తీసుకున్న తరవాత అస్వస్థతో ఆసుపత్రిలో చేరిక
13 దేశాలలో భారత్ తరహాలో టీకాల కార్యక్రమంపై శిక్షణ
Posted On:
23 JAN 2021 7:31PM by PIB Hyderabad
కోవిడ్-19 నివారణకు దేశ వ్యాపితంగా ప్రారంభమైన టీకాల కార్యక్రమం ఎనిమిదవ రోజున కూడా విజయవంతంగా కొనసాగింది. కోవిడ్ 19 నివారణకు టీకాలు తీసుకున్న ఆరోగ్య కార్యకర్తల సంఖ్య ఈ రోజు 15 లక్షల సంఖ్యను దాటింది. ఈ రోజు సాయంకాలం ఆరు గంటల సమయానికి దేశవ్యాపితంగా 15,37,190 లబ్ధిదారులకు టీకాలను వేయడం జరిగింది. 27,776 సెషన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు సమాచారం. ఈ రోజు ఒక్కరోజే 3,368 సెషన్లను నిర్వహించారు.
టీకాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సాయంకాలం ఆరు గంటల సమయానికి 1,46,598 మంది టీకాలను వేయించుకున్నారు. ఈ రోజు రాత్రికి తుది నివేదికలు వస్తాయి.
|
రాష్ట్రం / కేంద్రపాలితప్రాంతం
|
టీకా లబ్ధిదారులు
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
530
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
11,562
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
525
|
4
|
బీహార్
|
12,165
|
5
|
చండీగఢ్
|
345
|
6
|
చత్తీస్ గఢ్
|
8,138
|
7
|
దాద్రా, నాగర్ హవేలి
|
83
|
8
|
డామన్, డయ్యూ
|
189
|
9
|
ఢిల్లీ
|
6,111
|
10
|
గోవా
|
615
|
11
|
గుజరాత్
|
22,063
|
12
|
హర్యానా
|
9,188
|
13
|
హిమాచల్ ప్రదేశ్
|
3,935
|
14
|
జమ్మూ కశ్మీర్
|
1,820
|
15
|
కర్నాటక
|
3,669
|
16
|
కేరళ
|
6,012
|
17
|
లద్దాఖ్
|
18
|
లక్షదీవులు
|
81
|
19
|
మహారాష్ట్ర
|
21,751
|
20
|
మణిపూర్
|
396
|
|
|
|
21
|
మేఘాలయ
|
158
|
|
|
22
|
మిజోరం
|
322
|
23
|
ఒడిశా
|
14,892
|
24
|
పుదుచ్చేరి
|
381
|
25
|
పంజాబ్
|
8,968
|
26
|
రాజస్థాన్
|
7,900
|
27
|
తమిళనాదు
|
4,642
|
|
|
|
|
|
|
మొత్తం
|
1,46,598
|
ఎనిమిదవ రోజు సాయంకాలం ఆరు గంటల వరకు 123 ఏఇఎఫ్ఐ లు నివేదికలు అందాయి.
ఇంతవరకు 11 మంది ఆసుపత్రులలో చేరారు. టీకాలు తీసుకున్న వారిలో కేవలం 0.007% మంది మాత్రమే ఆసుపత్రిలో చేరారు. గత 24 గంటలలో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో మాత్రమే ఒకేఒక్క వ్యక్తి ఆసుపత్రిలో చేరారు. ఈ వ్యక్తి జనవరి 20వ తేదీన టీకా తీసుకున్నారు.
టీకాలు తీసుకున్న తరువాత ఆరుమంది మరణించారు. గత 24 గంటలలో హర్యానా లోని గురుగ్రంలో నివసిస్తున్న 56 సంవత్సరాల వ్యక్తి మరణించారు. అయితే, ఈ మృతికి టీకాకు సంబంధం లేదని ఆ వ్యక్తి గుండె సంబంధ సమస్యతో ప్రాణాలు కోల్పోయారని పోస్ట్ మార్టం నివేదిక తెలిపింది. అన్ని మరణాలకు కోవిడ్ 19 టీకాతో ముడిపెట్టడం జరుగుతోంది.
టీకా కార్యక్రమాన్ని ప్రారంభించక ముందు దేశంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నిర్వహించిన కార్యక్రమాన్ని 13 విదేశాలు ( బహరైన్,బంగ్లాదేశ్, భూటాన్,బ్రెజిల్,మాల్దీవులు,మారిషస్,మంగోలియా,మొరాకో,మయాన్మార్,నేపాల్,ఒమాన్,సీషెల్స్ మరియు శ్రీలంక) అమలు చేస్తున్నాయి.
12 రాష్ట్రాలకు అదనంగా వచ్చేవారం నుంచి ఛత్తీస్ ఘర్,గుజరాత్,ఝార్ఖండ్,కేరళ,మధ్యప్రదేశ్,పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు కావాక్సీన్ ఇవ్వనున్నాయి. ఈ ఏడు రాష్ట్రాల అధికారులకు ఈ రోజు కార్యక్రమంపై ఐసిఎంఆర్, ఆరోగ్యకుటుంబ సంక్షేమశాఖలు అవగాహన కల్పించడం జరిగింది.
***
(Release ID: 1691699)
Visitor Counter : 192