ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల తాజా సమాచారం

దేశ వ్యాప్తంగా 3.81 లక్షలకు పైగా ఆరోగ్య రక్షణ కార్యకర్తలకు టీకాలు

టీకాల ప్రభావంతో తీవ్ర అనారోగ్యం పాలైన వారెవరూ లేరు

Posted On: 18 JAN 2021 7:50PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా జరుగుతున్న టీకాల కార్యక్రమం మూడో రోజు కూడా విజయవంతమైంది. ఈ రోజు వరకు మొత్తం 7704 చోట్ల 3,81,305 మంది లబ్ధిదారులకు టీకాలు వేసినట్టు తాత్కాలిక నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ రోజు మూడవరోజున సాయంత్రం 5 గంటలవరకు 1,48,266 మందికి టీకాలు వేశారు. రాత్రి పొద్దుపోయాక తుది నివేదిక అందుతుంది.   

సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

టీకాల లబ్ధిదారులు ( తాత్కాలికం)

1

ఆంధ్రప్రదేశ్

9,758

2

అరుణాచల్ ప్రదేశ్

1,054

3

ఆస్సాం

1,822

4

బీహార్

8,656

5

చత్తీస్ గఢ్

4,459

6

ఢిల్లీ

3,111

7

హర్యానా

3,486

8

హిమాచల్ ప్రదేశ్

2,914

9

జమ్మూ-కశ్మీర్

1,139

10

జార్ఖండ్

2,687

11

కర్నాటక

36,888

12

కేరళ

7,070

13

లక్షదీవులు

180

14

మధ్య ప్రదేశ్

6,665

15

మణిపూర్

291

16

మిజోరం

220

17

నాగాలాండ్

864

18

ఒడిశా

22,579

19

పుదుచ్చేరి

183

20

పంజాబ్

1,882

21

తమిళనాడు

7,628

22

తెలంగాణ

10,352

23

త్రిపుర

1,211

24

ఉత్తరాఖండ్

1,579

25

పశ్చిమ బెంగాల్

11,588

 

మొత్తం

1,48,266

 

 

టీకాల అనంతరం ప్రతికూల ఘటనలకు టీకాలతోగాని టీకాల ప్రక్రియతోగాని సంబంధం ఉండకపొయే అవకాశముంది.  

ఇప్పటివరకు టీకాల అనంతరం సంభవించిన ఘటనలు 580 నమోదయ్యాయి. వారిలో ఏడుగురిని ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం కనిపించింది. ఢిల్లీలో నమోదైన మూడు కేసులలో ఇద్దరిని డిశ్చార్జ్ చేయగా ఒకరు స్పృహ తప్పుతున్నట్టు అనిపించటంతో పాత్పర్ గంజ్ లోని మాక్స్ ఆస్పత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. ఉత్తరాఖండ్ లో నమోదైన ఒక కెసు విషయంలో బాధితుణ్ణి రిషీకేశ్ ఎయిమ్స్ లో పర్యవేక్షణలో ఉంచారు. చత్తీస్ గఢ్ లో ఒక వ్యక్తి రాజ్ నంద్ గావ్ లొని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. కర్నాటకలో వచ్చిన రెండు కేసులలో ఒకరి చిత్రదుర్గ జిల్లా ఆస్పత్రిలోను, ఇంకొకరు చిత్రదుర్గలోనే చల్లకెరె జనరల్ ఆస్పత్రిలో ఉన్నారు. 

రెండు మరణాలు నమోదు కాగా, వారిలో ఒకరు ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ కు చెందిన 52 ఏళ్ళ  పురుషుడు. అతడికి జనవరి 16న టీకా వేశారు. 17వ తేదీ సాయంత్రం మరణించాడు.  అయితే, ఆయన మరణానికీ, టీకాకు ఎంతమాత్రమూ సంబంధం లేదనొ పోస్ట్ మార్టమ్ నివేదికలో వెల్లడైంది. హృదయ, ఊపిరితిత్తుల సమస్య కారణంగా చనిపోయాడు. రెండవ మరణం 43 ఏళ్ళ పురుషునిది. అతడు కర్నాటకలోని బళ్ళారికి చెందినవాడు. ఆయనకు 16న టీకా ఇవ్వగా ఈ రోజు చనిపొయాడు. ఇతని మరణానికి కారణం గుండె, ఊపిరితిత్తుల గోడ వైఫల్యమని తేలింది. బళ్ళారిలోని విజయనగర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్  సైన్సెస్ నుంచి నివేదిక రావాల్సి ఉంది. 

***



(Release ID: 1689914) Visitor Counter : 200