హోం మంత్రిత్వ శాఖ

కర్ణాటక రాష్ట్రం బాగల్.కోట్ జిల్లాలో పలు ప్రాజెక్టులకు అమిత్ షా శ్రీకారం

స్వావలంబన లక్ష్యంగా, అధికారం చేపట్టినప్పటినుంచి
పలు చర్యలు తీసుకున్న నరేంద్ర మోదీ

కర్ణాటక అభివృద్ధికి కట్టుబడిన మోదీ సర్కారు

ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ మోదీ ప్రభుత్వ చర్యలు
ఇథనాల్.పై 2015లో సెంట్రల్ ఎక్సయిజ్ సుంకం తొలగింపు
2025నాటికి పెట్రోల్.లో 20శాతం ఇథనాల్ మిశ్రమమే లక్ష్యం

రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికే ప్రాధాన్యం
రూ. 21,931కోట్లనుంచి, రూ. 1,34,399 కోట్లకు
పెరిగిన 2013-14 వ్యవసాయ బడ్జెట్

పి.ఎం. కిసాన్ సమ్మాన్ పథకం కింద గత డిసెంబరు 25నాటికి
9కోట్ల రైతుల ఖాతాలకు రూ.1,13,619 కోట్లు నేరుగా బదిలీ
ఇది దళారుల ప్రమేయం లేని సొమ్ము బదిలీ ప్రక్రియ

కాశ్మీర్ సమస్యపై మోదీ ప్రభుత్వ సాహసోపేత నిర్ణయం
370వ ఆర్టికల్ తొలగింపుతో దీర్ఘకాల సమస్య పరిష్కారం

Posted On: 17 JAN 2021 5:41PM by PIB Hyderabad

   కర్ణాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్ జిల్లాలో పలు ప్రాజెక్టులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. రెండు రోజుల కర్ణాటక పర్యటనలో భాగంగా  ఆదివారం ఒక చక్కెర మిల్లు విస్తరణ పథకాన్ని, విజయ బ్యాంక్ 75 వ శాఖను ఆయన ప్రారంభించారు. ఆయుర్వేద వైద్య కళాశాలతో పాటుగా పలు వ్యవసాయ ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, అమిత్ షా మాట్లాడుతూ, 2014, 2019 సంవత్సరాల్లో కర్ణాటక ప్రజలు నరేంద్ర మోదీకి అనుకూలంగా ఓటు వేశారని, ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి,.. స్వావలంబనతో కూడిన ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు.  కేంద్ర బొగ్గు శాఖ, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ, కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్. యడియూరప్ప, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గోవింద్ కరాజోల్, కర్ణాటక హోమ్ శాఖ మంత్రి బసవరాజ్ బొమ్మై, ఆ రాష్ట్రానికి చెందిన ఇతర మంత్రులు, నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

https://ci4.googleusercontent.com/proxy/qjkfE6LmEG46sY8-ZAvq_G4dZ7fLbfIAuO8bF7uNWsKr4vMx4Qy-FQFFhfZNqN9mU5fj0I77YlQRXmgozgoHYgD5yJ8aLpdvFvi3viny2sd3-qiXpWJdIR9H=s0-d-e1-ft#http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0016SIS.jpg

  అమిత్ షా ఈ సందర్భంగా మాట్లాడుతూ,..కొత్త ఇంధన విధానాన్ని అనుసరించి, ఇథనాల్ ఉత్పాదనలో చెరుకురసం, ముడి పంచదార, మొలాసెస్, కుళ్లిన ఆహార ధాన్యాలు వినియోగానికి ప్రభుత్వం అనుమతించినట్టు చెప్పారు. ఇథనాల్ వినియోగంకోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, 2015లో ఇథనాల్ పై కేంద్ర ఎక్సయిజ్ సుంకాన్ని తొలగించిందని, 2018లో వస్తుసేవల పన్నును (జి.ఎస్.టి.ని) 18శాతంనుంచి 2 శాతానికి తగ్గించిందని చెప్పారు. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం ప్రక్రియ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరేలా నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ చర్యలన్నీ తీసుకుందన్నారు. నీరానీ గ్రూపు ఇప్పుడు రోజుకు 2,600కిలోలీటర్ల ఇథనాల్ ను  నీరానా గ్రూపు ఉత్పత్తి చేయగలగడం ఎంతో అభినందనీయమని అన్నారు.

https://ci5.googleusercontent.com/proxy/6w-Qy1f5vAtiWAwu164axFw6agLW6EtR2TGuLdeGU4z3MK7tFw2s4gTFbXOr8xQYZHfZMh8kdys5FbHIXx3aKZBfN43BCBfzVD_DYWBJXbWl4yd3lu6GOmmn=s0-d-e1-ft#http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002WWE6.jpg

  మోదీ ప్రభుత్వం వచ్చేటప్పటికి, పెట్రోల్.లో 1.58శాతం ఇథనాల్.ను మిశ్రమం చేసే విధానం అమలులో ఉందని, అయితే, 2022నాటికి ఇథనాల్ మోతాదును 10శాతానికి పెంచడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని, 2025నాటికి ఇథనాల్ మోతాదును 20శాతానికి పెంచడమే లక్ష్యమని అమిత్ షా చెప్పారు.  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి నరేంద్ర మోదీ ప్రాధాన్యం ఇచ్చిందని, 2013-14లో వ్యవసాయ బడ్జెట్.ను రూ. 21,931 కోట్లనుంచి రూ.1,34,399 కోట్ల స్థాయికి పెంచిందని అన్నారు. రైతుల పెట్టుబడి ఖర్చులో 50 శాతానికి పైగా సమాన మొత్తానికి కనీస మద్దతు ధరను ప్రభుత్వం పెంచిందన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద గత డిసెంబరు 25 నాటికి రూ.1,13,619 కోట్ల సొమ్మును 9కోట్లమేర రైతుల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం నేరుగా బదిలీ చేసిందని, ఎలాంటి మధ్యవర్తి ప్రమేయం లేకుండా ఈ ప్రక్రియను నిర్వహించిందని చెప్పారు. వెయ్యికి పైగా వ్యవసాయ మండీలకు ఆన్ లైన్ సదుపాయం కల్పించిందని, పదివేల వ్యవసాయ ఉత్తత్తి దారుల సంఘాలను (ఎఫ్.పి.ఒ.లను) ఏర్పాటు చేసిందని తెలిపారు. 

 

https://ci4.googleusercontent.com/proxy/tSzGTDEbntYw-PNaKnhyH5j26YmO8WA7BzhwiRqKwDBqaBA9Aec5aazVfC4ymTmEKI4L8Iee4N-X8iXRlOmzmI3BrtRkXwxRnbF_mDLs8j-j8KtGQ66PkO1f=s0-d-e1-ft#http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0039BC1.jpg

కాశ్మీర్ సమస్యపై నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఎంతో సాహసోపేతంగా వ్యవహరించిందని, కాశ్మీర్ రాష్ట్రానికి మాత్రమే వర్తింపజేస్తున్న 370 ఆర్టికల్ ను తొలగించడం ద్వారా దీర్ఘకాల సమస్యను ప్రభుత్వం సమర్థంగా పరిష్కరించిందని అమిత్ షా చెప్పారు.

 

https://ci5.googleusercontent.com/proxy/i0Mc4dM10SsQc3v8FOslVio6Ey9nmabUtouZKBO4mi37Vs89ImCUQZRlvljDlahThY77kmaJWVln6J6dt9alt1-c4udj6c8jNou5nw0HvZAnOuLCKOz4-tGW=s0-d-e1-ft#http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004VR1Q.jpg

కర్ణాట రాష్ట్రాభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2,600కిలోలీటర్ల ఇథనాల్ ఉత్పత్తి చేసేందుకు నీరానీ పరశ్రమల గ్రూపు తీసుకున్న నిర్ణయంతో రైతులు జీవన ప్రమాణాలు, వారి ఆదాయాలు కూడా పెరుగుతాయని అమిత్ షా చెప్పారు.

 

******(Release ID: 1689579) Visitor Counter : 102