ప్రధాన మంత్రి కార్యాలయం

రాజ‌స్థాన్‌లోని జాలోర్‌లో జ‌రిగిన ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 17 JAN 2021 11:24AM by PIB Hyderabad

రాజ‌స్థాన్‌లోని జాలోర్‌లో జ‌రిగిన ప్ర‌మాదంలో కొంద‌రు ప్రాణాలు కోల్పోవ‌డం ప‌ట్ల ప్ర‌ధాన‌మంత్రి సంతాపం వ్య‌క్తం చేశారు. ఇందుకు సంబంధించి ఆయ‌న ఒక ట్వీట్ చేస్తూ,  రాజ‌స్థాన్‌లోని జాలోర్ జిల్లాలో బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న వార్త అత్యంత బాధాక‌ర‌మైన వార్త‌. ఈ దుర్ఘ‌ట‌న‌లో ప‌లువురు ప్రాణాలు కోల్పోయిన‌ట్టు తెలిసింది. మృతుల కుటుంబాల‌కు నా సానుభూతి తెలియ‌జేస్తున్నాను.  గాయ‌ప‌డిన‌వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నాను, అని ప్రధాని త‌మ సందేశంలో పేర్కొన్నారు.

****


(Release ID: 1689560)