ప్రధాన మంత్రి కార్యాలయం

దేశ వ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సినేష‌న్ కార్యక్రమాన్ని ప్రారంభించిన శుభ సందర్భంగా ప్రధాన‌మంత్రి ప్రసంగ మూల పాఠం

Posted On: 16 JAN 2021 1:11PM by PIB Hyderabad

  

ఈ రోజు కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. నెలల తరబడి, దేశంలోని ప్రతి ఇంట్లోని పిల్లలు, వృద్ధులు, యువకులకు  కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తు౦ది అనే ప్రశ్నే ఉ౦ది. కాబట్టి ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ వచ్చింది, అది కూడా చాలా తక్కువ సమయంలో. ఇక నుంచి కొద్ది నిమిషాల లోనే ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని భారత్ లో ప్రారంభించబోతున్నారు. ఇందుకు నా దేశ ప్రజలందరికీ నా అభినందనలు. ఈ రోజు, అనేకమంది శాస్త్రవేత్తలు, వ్యాక్సిన్ల పరిశోధనలో పాల్గొన్న వారు ప్రశంసలకు అర్హులే, వ్యాక్సిన్‌ రూపకల్పనకు శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడ్డారు. వ్యాక్సిన్ల తయారీ కోసం ఎందరో అవిశ్రాంతంగా పనిచేశారు.

వారు పండుగ, పగలు లేదా రాత్రి అని ఏమీ పట్టించుకోలేదు. సాధారణంగా టీకాల తయారీకి ఏళ్లు పడుతుంది. కానీ మన శాస్త్రవేత్తలు అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి చేశారు. వారి కృషి ఫలితంగా నేడు ఒకటి కాదు రెండు స్వదేశీ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు, ఇంకా ఎన్నో వ్యాక్సిన్లు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దేశీయ టీకా తయారీతో భారత్‌ సత్తా మరోసారి ప్రపంచానికి తెలిసింది. ఇది భారతదేశ బలానికి, భారతదేశ శాస్త్రీయ నైపుణ్యానికి, భారతదేశ ప్రతిభకు ఒక ప్రకాశవంతమైన రుజువు. ఇలాంటి విజయాల గురించి జాతీయ కవి రామ్‌ధారీ సింగ్ దింకర్ ఇలా అన్నారు,  "మనుషులు పట్టుదల గా ఉన్నప్పుడు, రాళ్లు కూడా నీరుగా మారతాయి!!

 

 

సోదర సోదరీమణులారా ,

 

భారతదేశం యొక్క వ్యాక్సినేషన్ ప్రచారం చాలా మానవతా మరియు ముఖ్యమైన సూత్రాల పై ఆధారపడి ఉంది. అత్యంత అవసరమైన వారికి ముందుగా టీకాలు వేయిస్తారు. కరోనా సంక్రామ్యత యొక్క అత్యంత ప్రమాదం ఉన్న వారికి ముందుగా వ్యాక్సిన్ వేయబడుతుంది. మన డాక్టర్లు, నర్సులు, సఫాయి కరంచారిలు (పారిశుద్ధ్య సిబ్బంది) ఆసుపత్రులలో, పారామెడికల్ సిబ్బంది లో మొదటి టీకాలు వేయించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్నా, ప్రైవేటు లో ఉన్నా ప్రాధాన్యతప్రాతిపదికన వారికి టీకాలు వేయనున్నారు. ఆ తర్వాత, ఆవశ్యక మైన సేవలు మరియు దేశం లేదా శాంతిభద్రతలను సంరక్షించే బాధ్యత కలిగిన వారికి  టీకాలు వేయబడతాయి . ఉదాహరణకు మన భద్రతా దళాలు, పోలీసు సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, సఫాయి కరమ్చారిస్ (పారిశుద్ధ్య సిబ్బంది) మొదలైన వాటికి ప్రాధాన్యత ఉంటుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, వారి సంఖ్య మూడు కోట్లు. వీరందరిటీకాలు వేయించడానికి అయ్యే ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తుంది.

 

టీకా తీసుకోవడంలో వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులే తొలి హక్కుదారులు. కరోనాను ఎదుర్కొనేందుకు రెండు డోసులు తప్పనిసరిగా వేయించుకోవాలి. రెండు డోసులకు మధ్య నెల రోజుల వ్యవధి ఉండాలని నిపుణులు సూచించారు. అందువల్ల రెండో డోసును మర్చిపోవద్దు. అంతేగాక, తొలి డోసు వేసుకున్నాక కూడా మాస్క్‌లు,భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే రెండో డోసు వేసుకున్న తర్వాతే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

 

 

కరోనాను ఎదుర్కొనేప్పుడు ఎలాంటి ధైర్యం ప్రదర్శించారో ఇప్పుడు కూడా అంతే ధైర్యాన్ని చూపాలి. కరోనా మహమ్మారిపై యుద్ధం సమయంలో యావత్‌ భారతావని కుటుంబంలా మారింది , సమైక్యతతోనే వైరస్‌ను ఎదుర్కోగలిగాం. ఇప్పుడు అదే స్ఫూర్తితో అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టగలిగాం.

 

 

దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో 100 మందికి చొప్పున నేటి నుంచి వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమైంది. తొలి రోజు 3 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా ఇవ్వనున్నారు. తొలి విడతలో 3 కోట్ల మందికి, రెండో విడతలో 30 కోట్ల మందికి టీకా ఇవ్వనున్నట్లు మోదీ తెలిపారు. తొలుత ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, ఆరోగ్య సిబ్బందికి ప్రాధాన్యమివ్వనున్నారు. ఆ తర్వాత 50ఏళ్ల పైబడిన, ఇతర అనారోగ్య సమస్యలున్న 50ఏళ్లలోపు వారికి టీకా అందిస్తారు.  

 

 ‘‘సొంతలాభం కొంత మానుకో. పొరుగువాడికి తోడుపడవోయ్‌. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్‌’’ అంటూ తెలుగు మహాకవి గురజాడ అప్పారావు రాసిన దేశభక్తి గీతాన్ని వినిపించారు. గురజాడ మాటలను ఆచరిస్తూ కరోనా పోరులో దేశ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారు.


 

దేశం నుంచి కరోనాను తరిమికొట్టేందుకు లక్షల మంది వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు నిర్విరామంగా పనిచేశారు. ఈ క్రమంలో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విధుల కోసమని వెళ్లిన సిబ్బందిలో కొంతమంది ఇంటికి తిరిగి రాలేదు. ఈ వ్యాధి ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని, కరోనా కారణంగా ఎంతోమంది తల్లులు తమ పిల్లలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆసుపత్రుల్లో చేరిన వృద్ధులను వారి కుటుంబసభ్యులు కలుసుకోలేకపోయారు. కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారికి సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు కూడా చేయలేని దుస్థితి ఏర్పడింది.
 


దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో కఠిన చర్యలకు ఉపక్రమించాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ విధించి ప్రజలను ఇళ్లకే పరిమితం చేయడం అంత సాధ్యమైన పనికాదు. కానీ ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ప్రజల సహకారం వల్లే కరోనా వ్యాప్తిని అరికట్టగలిగాం. మహమ్మారిని ఎదుర్కొనే సమయంలో ప్రజలంతా కలిసికట్టుగా ఉన్నారు.
 


వ్యాక్సిన్లు వచ్చినా జాగ్రత్తలు మరవొద్దు. టీకా తీసుకున్నా మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించాలి. ‘ఈ సమయంలో మన కొత్త మంత్రం ఇదే.. దవాయి భీ.. కదయి భీ(మందులతో పాటు జాగ్రత్తలు కూడా)’
 


కరోనా పోరులో ఎన్నో విషయాల్లో భారత్‌ ప్రపంచానికి ఉదాహరణగా మారింది. ‘చైనాలో వైరస్‌ విజృంభించిన తర్వాత అక్కడ చిక్కుకుపోయిన తమ పౌరులను తీసుకొచ్చేందుకు అనేక దేశాలు ఇబ్బందిపడ్డాయి. వారిని స్వదేశాలకు తీసుకురాలేకపోయాయి. కానీ భారత్‌ ముందుకొచ్చింది. వందే భారత్‌ మిషన్‌ ద్వారా చైనాలో చిక్కుకుపోయిన భారతీయులనే గాక, ఇతర దేశాల ప్రజలను కూడా అక్కడి నుంచి బయటకు తీసుకురాలగలిగింది.
 

శాస్త్రవేత్తల కృషితో దేశంలో రెండు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. విదేశీ టీకాలతో పోలిస్తే అత్యంత తక్కువ ధరకే ఈ టీకాలు లభిస్తున్నాయి. అంతేగాక, సాధారణ ఉష్ణోగ్రతల్లోనూ వీటిని భద్రపరిచే వీలుంది. వ్యాక్సిన్‌పై వదంతులు నమ్మొద్దని దేశ ప్రజలను కోరారు. మీ అందరికీ అనేక శుభాకాంక్షలు. దీనిని ముందస్తుగా సద్వినియోగం చేసుకోండి. మీరు మరియు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండండి! ఈ సంక్షోభ సమయంలో నుంచి మానవాళి మొత్తం బయటకు వచ్చి మనమందరం ఆరోగ్యంగా ఉండగలగాలనే  ఈ కోరికతో, మీకు అనేక ధన్యవాదాలు.



(Release ID: 1689259) Visitor Counter : 294