ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాలు వేసే కార్యక్రమంపై తాజా సమాచారం

భారతదేశంలో తయారైన రెండు టీకాలతో - మొదటి రోజు టీకాలు వేసే కార్యక్రమం విజయవంతం


3,352 ప్రదేశాలలో - 1,91,181 మంది లబ్ధిదారులకు టీకాలు వేయడం జరిగింది


దేశ వ్యాప్తంగా చేపట్టిన ఈ భారీ కార్యక్రమంలో 16,755 మంది సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు


టీకాలు వేసిన అనంతరం - ఎవరూ ఆసుపత్రి పాలయినట్లు సమాచారం నమోదుకాలేదు

Posted On: 16 JAN 2021 8:32PM by PIB Hyderabad

భారతదేశ ప్రజారోగ్య చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం, దేశంలో కోవిడ్-19 టీకాలు వేసే కార్యక్రమాన్ని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది, ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద టీకాలు వేసే కార్యక్రమం. 

దేశవ్యాప్తంగా చేపట్టిన కోవిడ్-19 టీకాలు వేసే అతి పెద్ద కార్యక్రమం మొదటి రోజు విజయవంతంగా నిర్వహించబడింది.  మొత్తం 3,352 ప్రదేశాల్లో చేపట్టిన ఈ భారీ కార్యక్రమంలో ప్రాధమిక నివేదికల ప్రకారం 1,91,181 మంది లబ్ధిదారులకు టీకాలు వేయడం జరిగింది.   దీనికి అదనంగా, రక్షణ సంస్థలలో 3,429 మంది లబ్ధిదారులకు టీకాలు వేయడం జరిగింది.   వివిధ ప్రదేశాల్లో టీకాలు వేసే కార్యక్రమ నిర్వహణలో గరిష్టంగా 16,755 మంది సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు.

టీకాలు వేసుకున్న అనంతరం ఎవరైనా ఆసుపత్రిలో చేరినట్లు ఇంతవరకు సమాచారం నమోదు కాలేదు.

టీకాలు వేసే కార్యక్రమానికి రెండు రకాల కోవిడ్-19 టీకాలు సరఫరా చేయబడ్డాయి:

కోవిషీల్డ్ వ్యాక్సిన్ (సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తయారు చేసింది) అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేయబడింది. 

కోవాక్సిన్ వ్యాక్సిన్ (భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తయారు చేసింది) 12 రాష్ట్రాలకు సరఫరా చేయబడింది.

దేశవ్యాప్తంగా కోవిడ్-19 టీకాలు వేసే అన్ని ప్రదేశాల్లో, తగినంత పరిమాణంలో టీకాలతో పాటు అవసరమైన రవాణా సదుపాయాలను అందుబాటులో ఉంచడం జరిగింది.  టీకాలు వేసే కొన్ని ప్రదేశాల్లో లబ్ధిదారుల జాబితాను అప్‌లోడ్ చేయడంలో కొంత ఆలస్యం జరగడం వంటి చిన్న సమస్యలు విజయవంతంగా పరిష్కరించబడ్డాయి.

రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు 

టీకాలు వేసిన ప్రదేశాల సంఖ్య 

లబ్ధిదారుల సంఖ్య 

అండమాన్-నికోబార్ దీవులు 

2

225

ఆంధ్రప్రదేశ్ 

332

18412

అరుణాచల్ ప్రదేశ్

9

829

అస్సాం 

65

3528

బీహార్ 

301

18169

చండీగఢ్ 

4

265

ఛత్తీస్ గఢ్ 

97

5592

దాద్రా-నగర్ హవేలీ 

1

80

డామన్-డియూ 

1

43

ఢిల్లీ 

81

4319

గోవా 

7

426

గుజరాత్ 

161

10787

హర్యానా 

77

5589

హిమాచల్ ప్రదేశ్ 

28

1517

జమ్మూ-కశ్మీర్ 

41

2044

ఝార్ఖండ్ 

48

3096

కర్ణాటక 

242

13594

కేరళ 

133

8062

లడఖ్ 

2

79

లక్షద్వీప్ 

1

21

మధ్యప్రదేశ్ 

150

9219

మహారాష్ట్ర 

285

18328

మణిపూర్ 

10

585

మేఘాలయ 

10

509

మిజోరాం 

5

314

నాగాలాండ్ 

9

561

ఒడిశా 

161

13746

పుదుచ్చేరి 

8

274

పంజాబ్ 

59

1319

రాజస్థాన్ 

167

9279

సిక్కిం 

2

120

తమిళనాడు 

161

2945

తెలంగాణ 

140

3653

త్రిపుర 

18

355

ఉత్తరప్రదేశ్ 

317

21291

ఉత్తరాఖండ్ 

34

2276

పశ్చిమ బెంగాల్ 

183

9730

భారతదేశం (మొత్తం)

3352

191181

 

 
 
*****
 


(Release ID: 1689237) Visitor Counter : 309