సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

51వ ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. లో ప్రముఖ నటుడు, దర్శకుడు బిస్వజిత్ ఛటర్జీ కి - "ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్" అవార్డు ప్రకటించారు

గోవాలో జరుగుతున్న 51వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో, ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు మరియు హిందీ, బెంగాలీ సినీ నేపధ్యగాయకుడు శ్రీ బిస్వజిత్ ఛటర్జీ ని "ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్" అవార్డుకు ఎంపిక చేశారు.  ఈ పండుగ ప్రారంభోత్సవ కార్యక్రమంలో, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్, ఈ అవార్డును ప్రకటించారు.

2021 మార్చి నెలలో జరిగే జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రదానం చేసే సమయంలో, ఈ అవార్దును, అతనికి ప్రదానం చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. 

 

బిస్వాజిత్ ఛటర్జీ, తాను నటించిన పాత్రల ద్వారా , ఉదాహరణకు: "బీస్-సాల్-బాద్" అనే చలన చిత్రంలో కుమార్ విజయ్ సింగ్;  "కోహ్రా" లో రాజా అమిత్ కుమార్ సింగ్; "ఏప్రిల్ ఫూల్"  చిత్రంలో అశోక్;  "మేరే సనమ్"  లో రమేష్ కుమార్; "నైట్ ఇన్ లండన్" అనే చిత్రంలో  జీవన్ ;  "దో కలియాన్‌" లో శేఖర్; "కిస్మత్‌" చిత్రంలో విక్కీ వంటి పాత్రల ద్వారా , మంచి పేరు తెచ్చుకున్నారు.  ఆయన ఎక్కువగా, ఆశా పరేఖ్, వహీదా రెహ్మాన్, ముంతాజ్, మాలా సిన్హా, రాజ్‌శ్రీ వంటి ప్రముఖ నటీమణులతో కలిసి నటించారు.  ఆయన నటించిన బెంగాలీ చిత్రాలలో -  ఉత్తమ్ కుమార్ మరియు కుహేలితో "చౌరింఘీ" (1968) మరియు "గర్ నాసింపూర్";  "శ్రీమాన్ ప్రిథ్వీరాజ్" (1973);  "జై బాబా తారక్ నాథ్" (1977); "అమర్ గీతి"  (1983) చిత్రాలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు.  1975 సంవత్సరంలో, బిస్వజిత్,  తన సొంత చిత్రం "కహతే హై ముజ్ కో రాజా" ను నిర్మించి, దర్శకత్వం వహించారు.  నటన, దర్శకత్వంతో పాటు, ఆయన, గాయకుడు, నిర్మాతగా కూడా వ్యవహరించారు.

*****




(Release ID: 1689233) Visitor Counter : 199