వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

స్టార్టప్‌లతో ఇంటరాక్ట్ అవ్వడానికి చేపట్టిన 'ప్రారంభ్: స్టార్టప్‌ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్’లో నేడు ప్రసంగించనున్న ప్రధాని

“ప్రారంభ్-స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్” మొదటి రోజున అంతర్జాతీయ సహకారాన్ని వేగవంతం చేయడంతో పాటు ప్రపంచంలోని ఉత్తమ వ్యూహాత్మక విధానాలను ఆకర్షించడంపై సదస్సు

25కి పైగా దేశాల మరియు 200 మందికి పైగా అంతర్జాతీయ వక్తలు పాల్గొంటున్న ఈ సదస్సు 2016 లో స్టార్టప్ ఇండియా ప్రారంభించినప్పటి నుండి భారత ప్రభుత్వం నిర్వహించిన అతిపెద్ద స్టార్టప్ ఇంటరాక్షన్.

Posted On: 16 JAN 2021 9:41AM by PIB Hyderabad

అంకుర సంస్థలను ప్రొత్సహించడానికి అవసరమైన వ్యవస్థలను మెరుగుపరిచేందుకు మరియు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు ఆయా రంగాల ప్రాముఖ్యతను గుర్తించేందుకు మొదటిరోజు ప్రధాన ఆంశంగా చేపట్టారు.  స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్ నిన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. టెక్నాలజీస్, ఇన్నోవేషన్, బలమైన విధానాలు మరియు చొరవ, సమస్యల పరిష్కారం వంటి అంశాలపై వారు చర్చించారు. యువ ఆవిష్కర్తలు మరియు పారిశ్రామికవేత్తల్లో పట్టుదల రగిల్చేందుకు అలాగే ప్రభుత్వ మరియు అంతర్జాతీయ సంస్థలకు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది వీలు కల్పించింది. 2 రోజుల కార్యక్రమాన్ని డిపార్ట్మెంట్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్,  కామర్స్ & ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ సాయంత్రం ఐదు గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా స్టార్టప్‌లతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం తన ప్రసంగాన్ని అందిస్తారు.


రెండు రోజుల సదస్సును నిన్న వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ప్రారంభించారు. సదస్సులో  భారతదేశం నుండే గాక బిమ్స్‌టెక్ దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు,  పరిశ్రమల అధినేతలు అకాడెమిక్ లూమినరీల సమావేశంలో ప్రసంగించారు. అలాగే వర్చువల్ స్టార్టప్ షోకేస్‌లు ప్రారంభించారు.

సమ్మిట్  మొదటి రోజు 1,20,000 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. బిమ్స్టెక్ సభ్య దేశాల నుండి వచ్చిన ప్రముఖులు మరియు వాటాదారులకు ఆతిథ్యం ఇచ్చింది. బిమ్స్టెక్ సభ్య దేశాల స్టార్టప్ కమ్యూనిటీల నుండి ప్రఖ్యాత వాటాదారులు సమ్మిట్‌లో పాల్గొన్నారు. వివిధ చర్చల్లో పాల్గొన్న ప్రతినిధులు వారి ఉత్తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. అలాగే తొలిరోజు 54 ఔత్సాహిక స్టార్టప్‌లకు చెందిన  75 మంది పెట్టుబడిదారులు నాన్‌స్టాప్ పిచింగ్ నిర్వహించారు.


ప్రపంచ ఉత్తమ అవిష్కరణలకు చెందిన వివిధ అంశాలపై మారథాన్ ఈవెంట్ ప్రధానంగా దృష్టి సారించింది. అలాగే అంకుర సంస్థల్లో బలమైన వ్యవస్థలకు రూపకల్పన చేయడం, బిమ్స్టెక్ సభ్య దేశాల నిపుణులు / స్టార్టప్ వ్యవస్థాపకులను వారి అనుభవాలను పంచుకునేందుకు మరియు ఆలోచనలను ఆవిష్కరణలుగా ఎలా మార్చాలనే దానిపై ఔత్సాహికులకు మార్గనిర్దేశం చేయడం, బలమైన మార్కెట్ వ్యూహాలు మరియు సోషల్ ఇన్నోవేషన్‌ను పెంచడం వంటి ఆంశాలపై చర్చ జరిగింది.

గ్లోబల్ వెంచర్ ఫండ్ల కోసం వ్యాపారం సులభతరం చేయడాన్ని ప్రోత్సహిస్తూ, స్టార్టప్‌ల కోసం అంతర్జాతీయీకరణ మరియు ఇండియన్ స్టార్టప్‌ల కోసం గ్లోబల్ క్యాపిటల్‌ను సమీకరించడం వంటి వాటితో క్లోజ్డ్ డోర్ రౌండ్‌టేబుల్ కూడా నిర్వహించబడింది.

సదస్సు మొదటి రోజున మిస్టర్ క్రిస్ గోపాలకృష్ణన్ (చైర్మన్ మరియు వ్యవస్థాపకులు, ఆక్సిలర్ వెంచర్స్), శ్రీమతి శోభనా కామినేని (ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్), ప్రపంచవ్యాప్తంగా ఉన్న విస్తృత ఆవిష్కరణ మరియు వ్యవస్థాపక వ్యవస్థల నుండి ప్రముఖ పరిశ్రమ నాయకులు పాల్గొన్నారు. దీప్‌ కల్రా (వ్యవస్థాపకుడు మరియు గ్రూప్ సిఇఒ, మేక్‌మైట్రిప్), మిస్టర్ మనోజ్ కోహ్లీ (కంట్రీ హెడ్ - సాఫ్ట్‌బ్యాంక్ ఇండియా), మిస్టర్ కునాల్ బాహ్ల్ (సిఇఒ & కో-ఫౌండర్, స్నాప్‌డీల్) వంటి ఎందరో ప్రముఖులు పాల్గొన్నారు.

సిస్కో మాజీ ఛైర్మన్ & సిఇఒ మిస్టర్ జాన్ ఛాంబర్స్ మరియు హీరో ఎంటర్ప్రైజ్ చైర్మన్ మిస్టర్ సునీల్ కాంత్ ముంజాల్‌తో స్టార్‌ టాక్స్‌ పేరుతో సిఎన్‌బిసి టివి -18 మేనేజింగ్ ఎడిటర్ శ్రీమతి షీరన్‌భన్‌తో ఒక ప్రత్యేక సెషన్ నిర్వహించారు. ఈ సెషన్‌లో ప్రముఖ నటి శ్రీమతి ప్రియాంక చోప్రా జోనాస్‌తో ప్రత్యేక చాట్ కూడా ఉంది.

జనవరి 16, 2016 న ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రారంభించిన స్టార్టప్ ఇండియా ప్రస్తుతం ఐదవ వార్షికోత్సవం జరుపుకుంటోంది. 2016 లో స్టార్టప్ ఇండియా ఆవిష్కరణ 19 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక ద్వారా ఏర్పాటు చేసిన పునాదిపై ఈ సమ్మిట్ నిర్మించబడింది.

ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ బాడీస్ ఇన్వెస్ట్ ఇండియా, ఫిక్కీ, ఇండియన్ ఏంజెల్ నెట్‌వర్క్, ఐవిసిఎ, టై ఢిల్లీ ఎన్‌సిఆర్, సిఐఐ, నాస్కామ్, సిడ్బి, టైగ్లోబాలాండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ మద్దతు ఇస్తున్నాయి.

***


(Release ID: 1689024) Visitor Counter : 213