ప్రధాన మంత్రి కార్యాలయం
దేశ వ్యాప్తంగా కోవిడ్ 19 వాక్సిన్ వేసే ప్రక్రియను జనవరి 16న ప్రారంభించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 3000 ప్రదేశాలలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న ప్రధానమంత్రి.
వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభోత్సవం రోజున ప్రతి ప్రదేశంలో సుమారువంద మంది లబ్ధిదారులకు వాక్సినేషన్.
Posted On:
14 JAN 2021 6:59PM by PIB Hyderabad
కోవిడ్ -19 వాక్సిన్ ను భారతదేశం అంతటా వేసే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 జనవరి 16 వతేదీ ఉదయం 10.30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించనున్నారు. ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద వాక్సినేషన్ కార్యక్రమం. ఈ వాక్సినేషన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ,కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రారంభం కానుంది. అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలితప్రాంతాలలో 3006 సెషన్ కేంద్రాలలో ఈ వాక్సినేషన్ కార్యక్రమాన్నివర్చువల్‌గా ప్రారంభోత్సవ కార్యక్రమంతో అనుసంధానం చేయనున్నారు. ప్రతి సెషన్ ప్రాంతంలోనూ సుమారు100మంది లబ్ధిదారులకు ప్రారంభోత్సవం రోజున వాక్సినేషన్ వేయనున్నారు.
ఈ వాక్సినేషన్ కార్యక్రమం ప్రధానంగా వాక్సినేషన్ ప్రాధాన్యతా గ్రూప్‌ల ఆధారంగా జరుగుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఐసిడిసి వర్కర్ల తో సహా హెల్త్‌కేర్‌వర్కర్లకు ఇందులో ప్రాధాన్యత ప్రాతిపదికన ఈ దశలో వాక్సిన్‌వేస్తారు.
వాక్సినేషన్ కార్యక్రమం కో-విన్ ను ఉపయోగిస్తుంది.ఇది ఆన్‌లైన్ డిజిటల్ ప్లాట్‌ఫాం. దీనిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ రూపొందించింది. ఇది వాక్సినేషన్ స్టాక్‌లు, నిల్వ టెంపరేచర్, కోవిడ్ -19 వాక్సిన్ కు సంబంధించి వ్యక్తిగత లబ్ధిదారుల కు సంబంధించిన సమాచారాన్ని రియల్‌టైమ్‌లో అందిస్తుంది. ఈ డిజిటల్ ప్లాట్‌ఫారం , వాక్సినేషన్ సెషన్‌లకు సంబంధించి అన్నిస్థాయిలలోని ప్రోగ్రామ్‌మేనేజర్లకు సహకరిస్తుంది.
ఇందుకు సంబంధించి 24 గంటలూ పనిచేసే 1075 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇది కోవిడ్ 19 మహమ్మారి కి సంబంధించి, వాక్సిన్ కార్యక్రమం, కో విన్ సాఫ్ట్‌వేర్ కు సంందించిన సందేహాలకు సమాధానాలిస్తుంది.
కోవిషీల్డ్, కోవాక్సిన్ లను ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాలలోని వాక్సినేషన్ కేంద్రాలకు తగినంత డోస్‌లను సరఫరా చేయడం జరిగింది. పౌరవిమానయాన మంత్రిత్వశాఖ క్రియాశీలక మద్దతు తో వీటిని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకుచేర్చడం జరిగింది. వీటిని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు అక్కడినుంచి జిల్లాలకు సరఫరా చేస్తాయి.జన్ భాగిదారి సూత్రాల ఆధారంగా ఈ కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేయడం జరిగింది.
***
(Release ID: 1688682)
Visitor Counter : 339
Read this release in:
Hindi
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam