మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
దేశంలో ఏవియన్ ఇన్ఫ్లూయెన్జా పరిస్థితి
Posted On:
13 JAN 2021 4:11PM by PIB Hyderabad
దేశంలో 10 రాష్ట్రాలలో ఏవియన్ ఇన్ఫ్లూయెన్జా 13 జనవరి 2021 వరకు ఉన్నట్టు ధ్రువీకృతమైంది. పక్షులు అసహజంగా మరణించిన కేసులు జమ్ము కాశ్మీర్‌లోని గందరబల్ నుంచి, జార్ఖండ్‌లోని 4 జిల్లాలలో నమోదయ్యాయి.
జనవరి 12, 2021నాడు డిఎహెచ్ డి కార్యదర్శి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో 17 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. తమ తమ రాష్ట్రాలలో ఏవియన్ ఇన్ఫ్లూయెన్జా వ్యాప్తిని ప్రభావవంతంగా నిర్వహించేందుకు కార్యాచారణ ప్రణాళిక 2021కి అనుగుణంగా వ్యవహరించవలసిందిగా ఈ సమావేశం ద్వారా రాష్ట్రాలకు సూచించడం జరిగింది. పరిస్థితిని నిర్వహించేందుకు ఆరోగ్య, అటవీ శాఖల సమన్వయంతో ఈ విషయంపై ప్రజలను చైతన్యవంతం చేయవలసిందిగా కోరారు. పరిరక్షణ పరికరాలు తగినంతగా ఉంచుకోవలసిందిగా, పౌల్ట్రీ పార్మ్‌లలో జీవ-పరిరక్షణను నిర్వహించాలని రాష్ట్రాలను కోరారు. రాష్ట్రంలో ఇన్ఫెక్షన్‌ను గుర్తించడాన్ని వేగవంతం చేసేందుకు రాష్ట్ర స్థాయిలో బిఎస్ ఎల్- 11ను గుర్తించి, నియంత్రణ మెకానిజంను తగిన సమయంలో ప్రవేశపెట్టవలసిందిగా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. పౌల్ట్రీ రైతులకు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది కనుక కోళ్ళ ఫారాలలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు తెలిపారు. అనేక రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల నుంచి కోళ్ళను, కోళ్ళకు సంబంధించిన ఉత్పత్తుల సరఫరాను నిషేధిస్తున్నాయని తెలిసింది. పౌల్ట్రీ పరిశ్రమపై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశమున్నందున, అటువంటి నిర్ణయాలను పుననఃపరిశీలించవలసిందిగా కోరారు.
దినపత్రికలలో ప్రకటనలు, సెమినార్ల ద్వారా ప్రజలలో చైతన్యం తెచ్చే కార్యక్రమాలను పలు రాష్ట్రాలు నిర్వహిస్తున్నాయి. ఇటువంటి చైతన్యం పెంచే కార్యక్రమాలను కొనసాగించవలసిందిగా రాష్ట్రాలను ప్రోత్సహిస్తూ, ఇందుకు రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ సహాయాన్ని తీసుకోవలసిందిగా సూచించారు. అటువంటి కార్యకలాపాలకు నిధులను అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. కోడి మాంసం, గుడ్లు తినడానికి సంబంధించి చేయవలసిన, చేయకూడని పనుల గురించి సూచనలను రాష్ట్రాలు జారీ చేయాలని కోరారు. తద్వారా పౌల్ట్రీ రైతులకు ఆర్థిక నష్టాన్ని కలిగించే పుకార్లు/ తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ఈ చర్యలు తీసుకోమని కోరారు.
***
(Release ID: 1688276)
Visitor Counter : 202