సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
భారత్ తొలి ఆవుపేడతో కెవిఐసి అభివృద్ధి చేసిన పెయింట్ - ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ను ఆవిష్కరించిన గడ్కరీ
Posted On:
12 JAN 2021 4:44PM by PIB Hyderabad
భారత్‌లో తొలిసారి ఖాదీ, గ్రామీణ పరిశ్రమ కమిషన్ ఆవుపేడతో తయారు చేసిన వినూత్న రంగును కేంద్ర రహదారులు, రవాణా, హైవేలు, ఎంఎస్ ఎంఇ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం తన నివాసంలో ఆవిష్కరించారు. పర్యావరణ అనుకూల, విషపూరితం కాని ఖాదీ ప్రాకృతిక పెంయిట్ అన్న పేరుతో ఇది తయారు అయింది. ఇది సూక్ష్మక్రిములను, శిలీంద్రియాలకు వ్యతిరేకంగా పని చేసే గుణాలను కలిగి ఉంది. ఆవు పేడను ప్రధాన వస్తువుగా తీసుకుని తయారు చేసిన ఈ పెయింట్ అందుబాటు ధరలో ఉండడమే కాదు, ఎటువంటి వాసనలు లేకుండా ఉంటుంది. దీనిని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిపై చేసింది.
ఈ కార్యక్రమంలో మత్స్య, పశు సంవర్థక, పాడి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, ఎంఎస్ ఎంఇ సహాయ మంత్రి ఎస్ హెచ్ ప్రతాప్ చంద్ర సారంగీ, కెవిఐసి చైర్మన్ ఎస్ హెచ్ వినయ్ కుమార్ సక్సేనా కూడా పాల్గొన్నారు. ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ, రైతుల ఆదాయాన్ని పెంచాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు ఈ చర్య జోడవుతుందని మంత్రి అన్నారు. వలుసలు తలకిందులై నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు మళ్ళే స్థాయిలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలన్న కృషిలో ఈ అడుగు ఒక భాగమని ఆయన అన్నారు. నూతనంగా మార్కెట్లోకి ప్రవేశిస్తున్న ఈ పెయింటు డిస్టెంపర్ రూ. 120, ఎమల్షన్ రూ.225గా ధరను నిర్ణయించారని, ఇది పెద్ద పెయింట్ కంపెనీలు వసూలు చేసే ధరలో సగం మాత్రమేనని పట్టి చూపారు. ప్రభుత్వం సహాయ పాత్ర మాత్రమే పోషిస్తుందని నొక్కి చెప్తూ, ఈ పెయింట్‌ను ప్రొఫెషనల్ పద్ధతిలో మార్కెట్ చేస్తూ, దేశం నలు మూలలకూ అందిస్తారన్నారు.
ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ రెండు రూపాలలో లభ్యం అవుతుంది - డిస్టెంపర్ పెయింట్, ప్లాస్టిక్ ఎమల్షన్ పెయింట్. ఈ ప్రాజెక్టుకు కెవిఐసి చైర్మన్ మార్చ్ 2020లో ప్రాణం పోశారు, తదనంతరం దీనిని కుమరప్ప నేషనల్ హాండ్‌మేడ్ పేపర్ ఇనిస్టిట్యూట్, జైపూర్ (కెవిఐసి యూనిట్) దానిని అభివృద్ధి చేసింది.
ఈ పెయింట్‌లో సీనం, పాదరసం, క్రోమియం, ఆర్సెనిక్, కాడ్మియం వంటి భారీ ధాతువులు ఉండవు. ఇది స్థానిక ఉత్పత్తికి ప్రోత్సాహకరంగా ఉండడమే కాక సాంకేతిక బదిలీ ద్వారా నికరమైన స్థానిక ఉపాధిని సృష్టిస్తుంది. పర్యావరణ అఅనుకూల ఉత్పత్తులకు ఆవు పేడను ముడిపదార్ధంగా ఉపయోగించేందుకు ఈ సాంకేతికత దోహదం చేస్తూ, రైతులకు, గోశాలలకు అదనపు ఆదాయాన్నిసమకూర్చగలదు. ఆవు పేడను ఉపయోగించడం వాతావరణాన్ని శుభ్రం చేయడమే కాక, కాలువలు పూడుకుపోకుండా నిరోధిస్తుంది.
ఖాదీ ప్రాకృతిక్ డిస్టెంపర్, ఎమల్షన్ పెయింట్లను 3 ప్రతిష్ఠాత్మక జాతీయ ప్రయోగశాలలు పరీక్షించాయి.
నేషనల్ టెస్ట్ హౌజ్, ముంబై
శ్రీరామ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, న్యూఢిల్లీ
నేషనల్ టెస్ట్ హౌజ్, ఘజియాబాద్.
ఖాదీ ప్రాకృతిక్ ఎమల్షన్ పెయింట్ బిఐఎస్ 15489ః2013 ప్రమాణాలకు అనుగుణంగా ఉండగా, ఖాదీ ప్రాకృతిక్ డిస్టెంపర్ పెయింట్ 428ః 2013 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. వివిధ పరీక్షా పారామితులలో ఈ పెయింట్ విజయవంతంగా ఆమోదం పొందింది - పెయింట్ వేయడం, థిన్నింగ్ లక్షణాలు, ఆరిపోయే సమయం, అంతిమ నగిషీ లేక మెరుగు వంటి విషయాలలో ఈ పెయింట్ విజయవంతమైన ఫలితాలను ఇచ్చింది. ఈ పెయింట్ 4 గంటలలోపు ఆరిపోవడమే కాక, మృదువుగా, సమానమైన మెరుగును కలిగి ఉంటుంది. ఈ రంగును లోపలి గోడలకు, బయిటి గోడలకూ కూడా వేయవచ్చు. అటు డిస్టెంపర్, ఇటు ఎమల్షన్ పెయింటూ కూడా మూల రంగు తెలుపులో లభ్యమవుతాయి, దీనిని తగిన రంగు పదార్ధాన్ని కలుపుకుని, ఏ రంగునైనా తయారు చేసుకోవచ్చు.
ఈ కార్యక్రమం లైవ్ స్ట్రీమ్‌ను ఈ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చుః https://youtu.be/4pAa0SqvTM0
***
(Release ID: 1688080)
Visitor Counter : 288