ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రొఫెసర్ శశికుమార్ చిత్రే మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన - ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 11 JAN 2021 10:42PM by PIB Hyderabad

ప్రొఫెసర్ శశీకుమార్ చిత్రే మరణం పట్ల ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ మేరకు, ప్రధానమంత్రి, సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్‌ చేస్తూ,  "ప్రొఫెసర్ శశికుమార్ చిత్రే మరణ వార్త విని, చాలా బాధ కలిగింది.  ఖగోళ భౌతిక శాస్త్రం, సౌర భౌతిక శాస్త్రం, గురుత్వాకర్షణ లెన్సింగు మరియు సైన్సు విద్య వంటి అంశాలలో ఆయన చేసిన కృషి అపారమైనది, మరువలేనిది. ఆయన అమూల్యమైన కృషి రాబోయే కాలంలో విద్యార్థులను ఉత్తేజపరుస్తుంది. ఓం శాంతి." అని పేర్కొన్నారు. 

*****


(रिलीज़ आईडी: 1687853) आगंतुक पटल : 180
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam