సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

బంగ్లాదేశ్- 51 వ ఐఎఫ్ఎఫ్ఐ కోసం కంట్రీ ఇన్ ఫోకస్

Posted On: 11 JAN 2021 1:09PM by PIB Hyderabad

ఈ సారి అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు కంట్రీ ఇన్ ఫోకస్ ని ప్రకటించారు. 51 వ ఐఎఫ్ఎఫ్ఐ కోసం కంట్రీ ఇన్ ఫోకస్ గా బంగ్లాదేశ్ ని ఎంపిక చేశారు. 

సినిమా అభివృద్ధి కోసం ప్రత్యేక 

కంట్రీ ఇన్ ఫోకస్ అనేది ఒక ప్రత్యేక విభాగం, ఇది దేశంలోని సినిమా నైపుణ్యాన్ని మరియు అందించిన సేవలను గుర్తిస్తుంది. 51 వ ఐఎఫ్ఎఫ్ఐ లోని ఈ విభాగం నాలుగు చిత్రాలను ప్రదర్శిస్తుంది:

1. తన్వీర్ మోకమ్మేల్ నిర్మించిన  జిబొంద్ధులి 

 

 

2. జహిదూర్ రహీమ్ అంజాన్ నిర్మించిన మేఘ్మల్లార్ 


                                3. రుబియాత్ హుస్సేన్ నిర్మించిన అండర్ కన్స్ట్రక్షన్ 


4. నుహాష్ హుమాయున్, సయ్యద్ అహ్మద్ షాకి, రహత్ రెహ్మాన్ జాయ్, ఎండి రోబియులాం, గోలం కిబ్రియాఫారూకి, మీర్ ముకారాం హుస్సేన్, తన్వీర్ అహ్సాన్, మహముదుల్ ఇస్లాం, అబ్దుల్లా అల్ నూర్, కృష్ణేండు అష్టోధాధానే నిర్మాణం చేసిన  సిన్స్ఎర్లీ యువర్స్, ఢాకా

 

 

ఐఎఫ్ఎఫ్ఐ గురించి: 

1952 లో స్థాపించబడిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ఆసియాలో అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఒకటి. ఏటా జరుగుతుంది, ప్రస్తుతం గోవా రాష్ట్రంలో, ఈ ఉత్సవం ప్రపంచంలోని సినిమాహాళ్లకు చలన చిత్ర కళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక సాధారణ వేదికను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది; వివిధ దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక మరియు సాంస్కృతిక నీతి నేపథ్యంలో అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుంది; మరియు ప్రపంచంలోని ప్రజల మధ్య స్నేహం మరియు సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ఉత్సవాన్ని డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ (సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో) మరియు గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తాయి

51వ  ఉత్సవాలు 2021 జనవరి 16 నుండి 24వ తేదీ వరకు నిర్వహించనున్నారు.  

***



(Release ID: 1687839) Visitor Counter : 212