సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఓ.టి.టి. వేదిక కోసం కార్యక్రమాల శ్రేణిని ప్రకటించిన - 51వ ఐ.ఎఫ్.ఎఫ్.ఐ.

మాస్టర్ క్లాసులు; ముఖా-ముఖీ కార్యక్రమాలు; ప్రత్యక్ష ప్రసారాలు; ఓ.టి.టి. వేదికపై ప్రదర్శనలు; ప్రశ్నోత్తర కార్యక్రమాలు మరియు చలన చిత్ర ప్రశంసల సమావేశాలు

Posted On: 10 JAN 2021 5:59PM by PIB Hyderabad

2021 జనవరి, 16వ తేదీ నుండి 2021 జనవరి, 24వ తేదీ వరకు గోవాలో జరిగే ఆసియాలో అతి పురాతనమైన మరియు భారతదేశపు అతిపెద్ద పండుగా పేరుగాంచిన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐ.ఎఫ్.ఎఫ్.ఐ) యొక్క 51వ ఎడిషన్, ఈ ఉత్సవాల సందర్భంగా  ఓ.టి.టి. లో ప్రదర్శించే కార్యక్రమాల శ్రేణిని ప్రకటించింది.

కొనసాగుతున్న పాండమిక్ ‌ను పరిగణనలోకి తీసుకుని, భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం, తన మొట్టమొదటి ‘హైబ్రిడ్’ చలనచిత్రోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. తన ప్రేక్షకుల కోసం ఓ.టి.టి. ప్లాట్ ‌ఫారమ్ ‌లో కొన్ని కార్యక్రమాలను నిర్వహించనుంది.

కీలక ముఖ్యాంశాలు:

·         రిట్రోస్పెక్టివ్ చలన చిత్రాలు :

ఎ.       పెడ్రో అల్మోడోవర్  

             లైవ్ ఫ్లెష్ | బ్యాడ్ ఎడ్యుకేషన్ | వోల్వర్ 

బి.       రూబెన్ ఓస్ట్ లండ్  

            ది స్క్వేర్ | ఫోర్స్ మజేయర్ 

·          మాస్టర్ క్లాసులు :

              శ్రీ శేఖర్ కపూర్; శ్రీ ప్రియదర్శన్; శ్రీ పెర్రీ లాంగ్; శ్రీ సుభాష్ ఘాయ్; శ్రీ తన్వీర్ మొకమ్మేల్  

·           ముఖా-ముఖీ కార్యక్రమాలు : 

             శ్రీ రికీ కేజ్;  శ్రీ రాహుల్ రావైల్;  శ్రీ మాధుర్ భండార్కర్;  శ్రీ పాబ్లో సీజర్;  శ్రీ అబూ బకర్ షాకీ;  శ్రీ ప్రసూన్ జోషి;  శ్రీ జాన్ మాథ్యూ మాథన్;  శ్రీమతి అంజలి మీనన్;  శ్రీ ఆదిత్య ధార్;  శ్రీ ప్రసన్న వితాంగే;   శ్రీ హరిహరన్;  శ్రీ విక్రమ్ ఘోష్;  శ్రీమతి అనుపమ చోప్రా,  శ్రీ సునీల్ దోషి;  శ్రీ డొమినిక్ సంగ్మా;  శ్రీ సునీత్ టాండన్. 

·            ఓ.టి.టి. వేదికపై కొన్ని ప్రపంచ పనోరమా చలన చిత్రాలు 

·            ప్రారంభ మరియు ముగింపు ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారాలు :

·             ప్రశ్నోత్తరాల కార్యక్రమాలు : 

·             చలన చిత్రాల ప్రశంసల కార్యక్రమాలు : 

                ప్రొఫెసర్ మజార్ కమ్రాన్;  ప్రొఫెసర్ మధు అప్సర;   ప్రొఫెసర్ పంకజ్ సక్సేనా లతో - ఎఫ్.‌టి.ఐ.ఐ. 

·            మిడ్ ఫెస్ట్ ఫిల్మ్ - వరల్డ్ ప్రీమియర్

                మెహరున్నీసా 

ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. వెబ్ సైట్ :  https://iffigoa.org/

ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. సామాజిక మాధ్యమ వేదికలు  :

● ఇన్-స్టాగ్రామ్ -  https://instagram.com/iffigoa?igshid=1t51o4714uzle

●  ట్విట్టర్  - https://twitter.com/iffigoa?s=21

https://twitter.com/PIB_panaji 

●  ఫేస్ బుక్  - https://www.facebook.com/IFFIGoa/

ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. గురించి : 

1952 లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐ.ఎఫ్.ఎఫ్.ఐ) ఆసియాలో అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఒకటి.  ప్రతీ ఏటా జరిగే ఈ ఉత్సవం, ప్రస్తుతం గోవా రాష్ట్రంలో జరుగుతోంది. ప్రపంచంలోని సినిమాలలోని చలనచిత్ర కళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక ఉమ్మడి వేదికను అందించడాన్ని, ఈ ఉత్సవం లక్ష్యంగా పెట్టుకుంది.  వివిధ దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక పద్ధతుల నేపథ్యంలో అర్థం చేసుకోవడానికీ, అభినందించడానికీ, ప్రపంచ ప్రజల మధ్య స్నేహం, సహకారాన్ని ప్రోత్సహించడానికీ, ఈ ఉత్సవం దోహదం చేస్తుంది. ఈ ఉత్సవాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని చలన చిత్రోత్సవాల డైరెక్టరేట్ మరియు గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

*****(Release ID: 1687579) Visitor Counter : 202